డబ్బు ఎలా ఏర్పడింది? -ఈనాడు


డబ్బు విషయంలో కొద్దిమంది సంతృప్తిగా ఉన్నప్పటికీ అనేకమంది అసంతృప్తి ప్రకటిస్తుంటారు. జీవితంలో ఏదో ఒక క్షణంలో డబ్బుని కనిపెట్టినవాడిని పట్టుకుని తన్నాలనిపించే ఆలోచన కలిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి డబ్బు గురించి ఈ రోజు ఈనాడు పత్రికలో చర్చించబడింది.

డబ్బు అంటే మనకు తెలిసింది నోట్ల కట్టలు, నాణేలు మాత్రమే. డి.డిలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ట్రెజరీ బిల్లులు లేదా బాండ్లు (వీటిని సావరిన్ బాండ్లు లేదా సార్వభౌమ ఋణ పత్రాలు అంటారు), బ్యాంకులు పోస్టాఫీసులు జారీ చేసే వివిధ బాండ్లు, ఫిక్సుడ్ డిపాజిట్ బాండ్లు, సెక్యూరిటీలు… మొదలైనవన్నీ కూడా డబ్బుకు వివిధ రూపాలే. వీటన్నిటినీ కలిపి విస్తృత అర్ధంలో ద్రవ్యం అని అంటారు. ద్రవ్యం అన్న పదాన్ని విస్తృతార్ధంలో వాడితే డబ్బు అన్న పదాన్ని కరెన్సీని సూచించే narrow అర్ధంలో వాడుతారు.

కరెన్సీ నోట్లను ఆర్.బి.ఐ ముద్రిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కరెన్సీ అంటే వాస్తవానికి రూపాయి నోటు మాత్రమే. మిగిలిన నోట్లన్నీ ప్రామిసరీ నోట్లు. రూపాయి నోటు వరకు కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. రూపాయి కరెన్సీ నోటు తప్ప మిగిలిన నోట్లకు ఆర్.బి.ఐ గవర్నర్ బాధ్యత వహిస్తారు. అందువలన ఈ నోట్లపై ‘ఐ ప్రామిస్ టు పే’ అన్న ప్రామిస్ తో గవర్నర్ సంతకం ఉంటుంది. రూపాయి నోటుపైన మాత్రం గవర్నర్ సంతకం ఉండదు.

ఈ తేడా ఎందుకంటే కాయినేజి చట్టం – 1906 కింద రూపాయి నోటుని ముద్రించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించింది. రూపాయి అనేది భారత దేశం యొక్క ప్రాధమిక కరెన్సీ. అందువలన అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. మిగిలిన డినామినేషన్ తో కూడిన నోట్లన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క కరెన్సీ అధికారం తరపున ఆర్.బి.ఐ బాధ్యత వహిస్తూ ప్రామిసరీ నోట్లుగా జారీ చేస్తుంది. రూపాయి కరెన్సీ అయితే మిగిలిన నోట్లు దానికి ప్రతిబింబాలు అన్నమాట. ప్రామిసరీ నోటు ద్వారా దానిపై ఎంత అంకె ఉంటే అన్ని (రూపాయి) కరెన్సీ నోట్ల విలువ చెల్లిస్తున్నట్లుగా బేరర్ కు ఆర్.బి.ఐ హామీ ఇస్తుంది.

నాణేలు కూడా కరెన్సీయే. అవి ఆ విలువకు సమానమైన లోహంతో తయారు చేస్తారు. కనుక వాటి విలువ నిజమైనది. రూపాయికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించే కరెన్సీ కనుక అది లోహం కాకపోయినా తన విలువను వ్యక్తం చేస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం మోసే లయబిలిటీ. అలాగే నాణేలన్నింటిని ముద్రించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. ముద్రించడం కేంద్ర ప్రభుత్వమే ముద్రించినా చెలామణిలోకి రావడం మాత్రం ఆర్.బి.ఐ ద్వారానే వస్తుంది. కాయినేజి చట్టం ప్రకారం 1000 రూపాయల వరకు నాణేలను ముద్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.

కేంద్ర ప్రభుత్వ నాణేల ముద్రణా కేంద్రాలు నాలుగు చోట్ల ఉన్నాయి. అవి: ముంబై, అలిపూర్ (కోల్ కతా), సైఫాబాద్ (హైద్రాబాద్, చెర్లపల్లి (హైద్రాబాద్). అనగా మన రాష్ట్రంలో, సారీ, తెలంగాణ రాష్ట్రంలోనే రెండు నాణేల ముద్రణా కేంద్రాలు ఉన్నాయి. 50 పై.లు అంతకు లోపు నాణేలను స్మాల్ కాయిన్స్ అంటారు. రూపాయి అంతకు ఎక్కువ విలువ నాణేలను రుపీ కాయిన్ లు అంటారు. 

డబ్బుకు సంబంధించి ఇతర అంశాలను ఈనాడు ఆర్టికల్ లో చూడగలరు. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే కింది లింక్ ను క్లిక్ చేయండి. ఈ లింకు వచ్చే ఆదివారం వరకు మాత్రమే పని చేస్తుందని మరవొద్దు.

డబ్బు ఎలా ఏర్పడింది?

ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ రూపంలో చూడడం కోసం కింది బొమ్మపైన క్లిక్ చేయండి. డౌన్ లోడింగ్ కోసం రైట్ క్లిక్ చేయండి.

Eenadu - 27.10.2014

 

13 thoughts on “డబ్బు ఎలా ఏర్పడింది? -ఈనాడు

  1. ఆర్థిక శాస్త్రం అందరికీ తెలియాల్సిందే. మన దేశ కరెన్సీ విలువ ఎందుకు తగ్గుతోందో మన ఆర్థిక మంత్రులకే తెలియదు. పూర్వ ఆర్థిక మంత్రి చిదంబరం కరెన్సీ విలువ తగ్గితే దేశానికి విదేశీ పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేసాడు. కానీ కరెన్సీ విలువ తరుగుదల వల్ల విదేశాల నుంచి దిగుమతి అయ్యే పెత్రోలియం, సెల్ ఫోన్‌ల ధరలు పెరిగినాయి.

    IT కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి కారణం కేవలం ఇక్కడి కరెన్సీ విలువ తక్కువ ఉండడం కాదు. అమెరికాతో పోలిస్తే ఇందియా ఆర్థికంగా చాలా వెనుకబడిన దేశం. యాభై వేల రూపాయల జీతం అమెరికాలో ఉండేవాడికి తక్కువే కావచ్చు కానీ ఇందియాలో ఉండేవాడికి మాత్రం ఎక్కువే. అందుకే అమెరికన్ కంపెనీలకి ఇందియాలో చీప్ లేబర్ దొరుకుతుంది. అంతే కానీ కేవలం కరెన్సీ విలువ తరుగుదల వల్ల విదేశీ పెట్టుబడిదారులకి ఖర్చులు తగ్గవు. మన రూపాయి విలువని దాలర్‌కి 120 రూపాయల వరకు తగ్గించి IT ఉద్యోగి జీతాన్ని నెలకి లక్ష రూపాయలు చేసినా పరిస్థితిలో తేడా ఏమీ రాదు. కరెన్సీ విలువ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా రిజర్వ్ బ్యాంక్ దేశంలో ఉన్న వనరులకి సరిపడా సంఖ్యలోనే కరెన్సీ కట్టల్ని ముద్రిస్తుంది.

    ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలతో పోలిస్తే ఒరిస్సా, చత్తీస్‌గడ్, విదర్భ ఆర్థికంగా చాలా వెనుకబడిన ప్రాంతాలు. ఆంధ్రాతో పోలిస్తే విదర్భలో రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు చాలా తక్కువ. విదర్భలో lodgeలూ, movie theaterలు కూడా పట్టణానికి ఒకటి కంటే ఎక్కువ ఉండవు. అయినప్పటికీ రూపాయి విలువ ఆంధ్రాలోనూ, విదర్భలోనూ ఒకటే. రైల్వే స్తేషన్‌లో ప్లేత్ సమోసా ధర ఆంధ్రాలోనైనా పది రూపాయలే, విదర్భలోనైనా పది రూపాయలే. కరెన్సీ విలువ తగ్గింపు వల్ల దేశంలోని ముడి సరుకుని లేదా finished goodsని విదేశాలకి ఎగుమతి చేసేవాళ్ళకి లాభం కానీ సాధారణ ప్రజలకి మాత్రం ఏమీ రాదు. ఈ విషయం B.A. 1st year Economics పుస్తకం చదివినవానికి తెలుసు కానీ మన ఆర్థిక మంత్రులకి తెలియదు.

  2. యూనివర్సితీలో తెలుగు మీదియం ఉంది. కానీ తెలుగు మీదియంవి చదివితే ఆ తరువాత ఇంగ్లిష్‌లో రిఫరెన్సెస్ చదవడం కస్ఠమవుతుంది. లైబ్రరీలలో గానీ ఆన్‌లైన్‌లో గానీ తెలుగు రిఫరెన్సెస్ దొరకవు.

  3. రిఫరెన్స్ సంగతి ఎవరు అడిగారు. ఆయనకు ఒక సమస్య వచ్చింది. అది తీర్చగలిగితే చెప్పండి. అదనపు సమస్య మీరే ఊహించుకుని మీరే పరిష్కారం ఇచ్చేస్తే ఏమి ఉపయోగం? అసలు సమస్య తీరకుండా!

  4. Telugu medium is recommended for them who cannot understand English. It is possible to get books in either of the media of instruction. If you have passed intermediate, you can join any distance education course without entrance test. You can even contact OU or Nagarjuna University.

  5. @laranaik1…

    మీరు ఎకనామిక్స్ ను అకడమిక్ పరంగా చదవాలనుకుంటే…తెలుగు అకాడమీ వాళ్లవి డిగ్రీ బుక్స్ ఏ పెద్ద పుస్తకాల షాపులో అడిగినా అందుబాటులో ఉంటాయి. అలాగే అంబేద్కర్, లేదా ఇతర ఏ ఓపెన్ వర్శిటీ స్టడీ సెంటర్లలో సంప్రదించినా…డిగ్రీ తెలుగు మీడియం బుక్స్ దొరుకుతాయి. అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ సైట్ (www.braou.ac.in ) లో మీ ఊరికి సమీపంలోని స్టడీ సెంటర్ల వివరాలు చూడవచ్చు.
    – లేదు అకడమిక్ గా కాదు. పాఠకునిగా అవగాహన కోసం అనుకుంటే….ఆ BA పుస్తకాలతో పాటూ… రంగనాయకమ్మ గారు పిల్లల కోసం అర్థశాస్త్రం పుస్తకం రాశారు. అలాగే విశేఖర్ గారు కూడా ఈనాడులో రాస్తున్న వ్యాసాలు చదవొచ్చు.

  6. మన రాజకీయ నాయకుల్లో చాలా మందికి ఆర్థిక శాస్త్రం తెలియదు. సామ్రాజ్యవాద ఆర్థిక వ్యవస్థని వెనుకబడిన దేశాల ఆర్థిక వ్యవస్థతో పోల్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ లింక్ చదవండి, మీకు విషయం అర్థమవుతుంది: https://m.facebook.com/story.php?story_fbid=10204324061998306&id=1131987446&refid=17&_ft_

వ్యాఖ్యానించండి