జేసుదాసు గారూ, మీరు కూడానా?!


Yesudas

అద్భుతమైన గొంతుతో ఎన్నో పాటలు పాడి ప్రాక్పశ్చిమ దేశాల శ్రోతలను అలరించిన సినీ నేపధ్య గాయకుడు కె.జె.జేసుదాసు తప్పుడు కారణాలతో పతాక శీర్షికలను ఆక్రమించారు. సో కాల్డ్ హిందూ సంస్కృతీ పరిరక్షకులు, మతోన్మాద పెత్తందార్లు, ఖాప్ పంచాయితీలు, రాజకీయ నాయకులు, పోలీసు బాసులు, బాబాలు… ఇలా అందరి వంతు అయింది, తన వంతే మిగిలింది అన్నట్లుగా జేసు దాసు గారు స్త్రీల వస్త్ర ధారణపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలకు ఆయన గాంధీ జయంతి వేడుకలను వేదికగా ఎంచుకోవడం ఒక విశేషం.

“కప్పి పెట్టవలసిందాన్ని ఖచ్చితంగా కప్పి పెట్టాలి. జీన్స్ ధరించడం ద్వారా స్త్రీలు ఇతరులను ఇబ్బంది పెట్టడం తగదు” అని జేసుదాసు వ్యాఖ్యానించారు. ఇంతకీ జీన్స్ ధరించడం ద్వారా స్త్రీలు దేనిని కప్పిపెట్టకుండా బహిరంగం చేస్తున్నారో ఆయన చెప్పనే లేదు. జీన్స్ ఫ్యాంటు నడుము నుండి చీల మండల వరకు కప్పి పెడుతుంది కదా! ఆడపిల్లలు ధరించే కొన్ని జీన్స్ పిక్కల కింద వరకు కత్తిరించి ఉంటున్నాయి. వాటిని ఉద్దేశించి జేసు దాసు వ్యాఖ్యానించారా? అదే అయితే పిక్కల కింది భాగంలోని కాళ్ళను చూసి ఇబ్బంది పడే పురుష పుంగవుల మానసిక వక్ర బుద్ధిని ఆక్షేపించడం మాని ఆడపిల్లలు ఆక్షేపించడం సబబేనా?

అత్యాచారాలకు గురవుతున్న స్త్రీలు, పిల్లల దుస్తుల ధారణతో సంబంధం లేకుండానే అత్యాచారాలు జరుగుతున్నాయని ఉన్నత స్ధాయి పోలీసు అధికారులు కొందరు అనేకసార్లు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు గత రెండేళ్లుగా ఇదే సంగతి చెప్పారు. అత్యాచారానికి గురయిన స్త్రీలు లేదా పిల్లలు 90 శాతం పైగా తెలిసిన వారు, బంధువులు, పక్కింటివారు తదితరుల నుండి దాడులకు గురయ్యారని వారు వెల్లడి చేశారు.

మిగిలిన వారు కూడా వారు ధరించిన దుస్తుల వల్ల అత్యాచారానికి గురయిన ఉదాహరణ ఒక్కటీ లేదనీ, కేవలం అత్యాచారం చేసేవాడి పరిస్ధితే నేరానికి దారి తీస్తోందని వారు తెలిపారు. అయినా ఈ పెద్ద మనుషుల తలకాయలు ఎక్కడ పెట్టుకుని ఉంటారో గానీ పాడిన పాటే పాడుతూ తమ తమ సాంస్కృతిక వెనుకబాటుతనాన్ని, పురుషాధిక్య ధోరణులను వెల్లడి చేసుకుంటున్నారు.

జేసు దాసు గారు అంతటితో ఆగలేదు. “మహిళలు జీన్స్ ధరించినప్పుడు జనం వారిపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఆ జీన్స్ వెనక ఏముందో అన్న ఉద్రేకానికి గురవుతారు. దానితో వారు అవాంఛనీయమైన చర్యలకు దిగుతారు. మహిళలు పురుషులుగా ప్రవర్తించేందుకు ప్రయత్నించకూడదు. వారు అణకువగా ప్రవర్తించాలి. జీన్స్ ధరించడం అంటే భారతీయ సంస్కృతిని త్యజించడమే. స్త్రీల నమ్రతా గుణమే వారికి అందాన్ని ఇస్తుంది” అని స్త్రీలకు హితబోధ చేశారు.

శ్రీ స్వాతి తిరుమాళ్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో గాంధీ జయంతి రోజున ‘స్వచ్చ్ భారత్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ జేసుదాసు గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఖాదీ ధరించాలన్న గాంధీ బోధనను గుర్తుకు తెస్తూ బహుశా జేసుదాసు గారు ఈ మాటలు చెప్పారేమో తెలియదు. స్వచ్చ భారత్ గురించో, ఖాదీ ధారణ గురించో చెప్పి ఊరుకోకుండా స్త్రీల సంస్కృతి పరిరక్షణ బాధ్యత మీదికి మళ్లించడం ఎందుకు?

ఇంతా చేసి జేసుదాసు గారు తన కాలంలో ఎక్కువ భాగం అమెరికాలో గడుపుతారట. ఆయన అక్కడ జీన్స్ మొఖం చూడలేదా? అక్కడ స్త్రీలు జీన్స్ ధరించగా ఈయన చూడలేదా? లేక జీన్స్ బోధన భారత స్త్రీలకే వర్తిస్తుందా? జీన్స్ దుస్తులు కప్పి పెట్టవలసింది కప్పి పెట్టలేనప్పుడు, ఆ లోపల ఏముందో తెలుసుకోవాలన్న ఉద్రేకాన్ని కలిగించినపుడు ఆ ధరించేది భారతీయ స్త్రీ అయినా, పశ్చిమ స్త్రీ అయినా ఒకటే కదా! అసలు భారతీయ సంస్కృతిని కాపాడే బాధ్యత ఒక్క స్త్రీల పైనే ఎందుకు మోపుతారు? పోనీ జీన్స్ ఫ్యాంటు కాకుండా మామూలు ఫ్యాంటు ధరిస్తే ఓ.కెనా?

జేసు దాసు వ్యాఖ్యలను నిరసిస్తూ కేరళలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి, కాంగ్రెస్, సి.పి.ఎం పార్టీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. ఫేస్ బుక్ లాంటి సోషల్ వెబ్ సైట్లలోనూ జేసుదాసు వ్యాఖ్యల పట్ల నిరసనలు, వెక్కిరింపులు వెలిశాయి. కొంతమంది మరింత ముందుకు పోయి జేసుదాసు కోడలు జీన్స్ ధరించి ఉన్న ఫోటోలు ప్రచురించి ఆయనది హిపోక్రసీ అంటూ ఎత్తి చూపారు. కానీ జేసుదాసు భావాలను ఆయన కోడలు నమ్ముతుందన్న గ్యారంటీ లేదు. ఆయన వ్యాఖ్యలను ఆయన కోడలుకు అంటగట్టడం మరో విపరీతం!

 

 

35 thoughts on “జేసుదాసు గారూ, మీరు కూడానా?!

  1. రేప్ చెయ్యాలనుకునేవాడు బురఖా వేసుకున్న స్త్రీని కూడా వదలడు. Modest వస్త్రధారణలో ఉన్నంత మాత్రాన రేప్ జరిగే అవకాశాలు తగ్గవు.

  2. ఈయన జీన్స్ గురించిన అభిప్రాయాలు, ఇస్లామిక్ దేశాల్లోనివారి చీర గురించిన అభిప్రాయాలతో సరిపోలతాయి (చీర అంతా ఏమీ దాచెయ్యదుకదా). మరి ఆయన ఇలాంటిసుద్దులే చొక్కాలులేక్లుండా (అనగా top less గా) గుళ్ళలో కనిపించే పూజారులకు ఎందుకు చెప్పలేదో!! వాళ్ళు కనీసం షర్టూ ప్యాంటూవేసుకోకుండా కనబడటంకూడా ఎవరినైనా రెచ్చగొడుతుందో ఏమిటో?

    ఎందుకైనా మంచిది యేసుదాసుగారు చెప్పినట్లుగా, ఎవర్నీ లైంగికంగా రెచ్చగొట్టకుండేందుకుగానూ ఆడామగా తేడాలులేకుండా బురఖాలుధరించాకగానీగానీ బయటకురాకూడదని ఒక చట్టంచేస్తేగానీ బాగుండదని అనుకుంటున్నాను.

    ఎవరైనా ఇంకొకర్ని హత్యచేస్తే, హంతకుణ్ణి హత్యకు ప్రేరేపించినందుకుగానూ హతుడి తరపువాళ్ళకీ, దొంగను ప్రేరేపించినందుకు దోచుకోబడ్డవారికి, రౌడీలను ప్రేరేపించినందుకు రౌడీలదాడికి గురైనవారికీ కూడా తగినశిక్షలుండేలా మన శిక్షాస్మృతిని మార్చుకోవాలి. అలాగే తీవ్రవాదులు బోధించిన సంస్కృతీ విలువలను నిరాకరించి, వారిని దాడులకు ప్రేరేపించినందుకు మనందరికీ తగుశిక్షలు ఉండడమే ఉత్తమం.

  3. “ఎవరైనా ఇంకొకర్ని హత్యచేస్తే, హంతకుణ్ణి హత్యకు ప్రేరేపించినందుకుగానూ హతుడి తరపువాళ్ళకీ, దొంగను ప్రేరేపించినందుకు దోచుకోబడ్డవారికి, రౌడీలను ప్రేరేపించినందుకు రౌడీలదాడికి గురైనవారికీ కూడా తగినశిక్షలుండేలా మన శిక్షాస్మృతిని మార్చుకోవాలి. అలాగే తీవ్రవాదులు బోధించిన సంస్కృతీ విలువలను నిరాకరించి, వారిని దాడులకు ప్రేరేపించినందుకు మనందరికీ తగుశిక్షలు ఉండడమే ఉత్తమం.”

    విశేషజ్ఞ గారూ ఇదేదో చాలా బాగుంది. ఫిర్యాదు చేసినోడికే శిక్ష వేసేస్తే ఎన్నో బాధలు తప్పుతాయి పోలీసులకి.

    ఏ నేరం విషయంలో కనిపించని విచిత్రమైన కారణాలు ఒక్క అత్యాచారాల విషయంలోనే కనిపిస్తాయి.

  4. విశేషజ్ఞ గారు, పాకిస్తాన్‌లో కరాచీ లాంటి ప్రాంతాలలో మాత్రమే మహిళలు చీరలు కట్టుకుంటారు. కరాచీలో నిర్మించిన ఉర్దూ సినిమాలు నేను యూత్యూబ్‌లో చూస్తుంటాను. పాకిస్తాన్ సంస్కృతి నాకు పరిచితమే. అయితే రేప్ చేసేవాడు బురఖా వేసుకున్న స్త్రీని కూడా వదలడు.

  5. Marxist Leninist గారు: నేను చెబుతున్నది పాకిస్తాన్లోని comparatively ఉదారవాదుల గురించికాదు. Umm Mohammad అనే పుస్తకంలో Aminah Assami, చీరకట్టుకొని మసీదులోకి ఒక మహిళ వచ్చిందని, “Why did you allow naked woman to enter the Masjid” అని అక్కడి మౌల్వీని నిలదీస్తుంది. వీలుంటే Umm Mohammad చదవండి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. Autoనోకాదో గుర్తులేదుకానీ అది ఒక biography. ఆమె అఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నప్పుడు ఆమెకు వచ్చిన ఒక marriage proposal సాక్షాత్తూ ఒసామా బిన్ లాడెన్‌నుండే వచ్చిందని చెబుతారు.

    ఒకపోతే చీర గురించిన అలాంటి అభిప్రాయం మనకులేదని కాదు. ఏదో సినిమాలో ఒక హీరో అంటాడు “అవసరమైనమేరకే చూపించడం చీర గొప్పదనం”, “చీరలో మధ్యప్రదేశ్ అందంగా కనిపిస్తుంది” అని (మధ్యప్రదేశ్ అంటే నడుము/పొట్ట అని మాటల రచయితగారి భావం). మొదటిగా అలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చింది Khushwant Singh అనుకుంటాను (తన Women, Sex, Love and Lust పుస్తకంలో). చీరకట్టుకున్న యువతికి చూపుల తాకిళ్ళుఎక్కువ అన్నది ఒక statistical fact (ఎందుకంటే నగరాల్లో చీర ఒక incongruity). ఈ విషయాన్ని మీరు ఏమహానగరంలోనైనా మొదటిరోజునే గమనించవచ్చు.

    Umm Mohammad : http://www.goodreads.com/author/show/5752619.Umm_Muhammad_Aminah_Assami

  6. యేసు దాసు పుట్టినది కేరళలో. ఆ రాష్ట్రంలో దళిత స్త్రీలు ఒకప్పుడు రవికెలు వేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు కేరళలో స్త్రీలందరూ రవికెలు వేసుకుంటున్నారు, చీరలు కూడా కట్టుకుంటున్నారు. జీన్స్‌నే అశ్లీల దుస్తులు అనుకునే యేసు దాసుకి ఒకప్పుడు కేరళ స్త్రీల వేషం ఎలా ఉండేదో తెలిసినట్టు లేదు.

  7. ఈమాత్రం దానికి కేరళదాకా ఎందుకులెండి. మనరాష్ట్రంలోకూడా ‘తక్కువ కులపు ఆడాళ్ళు’ రైకలేసుకొనేవారుకాదు (కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఈనాటికీ పదిలంగా ఉంది). అలా వేసుకొంటే ఎక్కువకులపోళ్ళకి రోషాలు పొడుచుకొచ్చేవి.

    సాంప్రదాయంలో బూతు (బూతుబొమ్మలూ/బూతుశ్లోకాలూ) పవిత్రమూ మరియూ భక్తీనూ.

  8. అసలు ఉండాల్సిన వక్ర బుద్దంతా ఇలా స్త్రీల వస్త్ర దారణ గురించి మాట్లాడే వాల్లలోనే ఉంది. వీళ్లు స్త్రీలను సెక్సు దృష్టి తో తప్ప మరో దృష్టితో చూడరను కుంటాను. మరి ఇలా చూసేవారికి ఎలాంటి డ్రెస్స్‌ ఏసుకున్నా ఒకటే గదా? మళ్లీ వీళ్లు పెద్ద మనుషులన్నట్లు మాట్లాడటం ఏమిటీ? వితండం కాక పోతే! ఒకమ్మాయి పేసు బుక్కులో అనిందట
    ” Yes, I am a girl and I drink alcohol, so I am an ‘easy target’. Is that it?
    Yes, I drink. I smoke. Does that mean I want to have sex with you and every man on the street?”
    ఇది నిజమే గదా? రేప్‌ కేసుల్లో ” ఆమె క్యేరెక్ట్‌ మంచి ది కాదు గనక ఇదేమి తప్పులేదులే ” అని తీర్పులిచ్చిన జడ్జీలు కూడ ఉన్నట్లు మనం న్యూస్‌ లో చదువుకొని ఉంటాం. అమ్మాయి అయినంత మాత్రనా తను అట్రక్ట్‌ అయిన ప్రతి మగాడి దగ్గర పడుకోవాలసి వస్తుందన్నట్లు మాట్ల్లాడటం మరీ ఈ మోరల్‌ పోలీసింగ్‌ ఫ్యాషన్‌ అయి పొయింది. వీల్లకు స్త్రీ శరీరం లేకుండ ఒక్క వ్యాపారం జరగదు. ఈ మోరల్‌ పోలీసింగ్‌ చేశే వారు మీ వ్యాపారానికి స్త్రీ ఆకర్షణను వాడుకో వద్దు అని ఒక్కడు అనడు. వీళ్లు వాడు కోవడం అటుంచి విదేశి సంస్థలను తలమీద పెట్టు కొని మోస్తారు. అప్పుడు మోరల్‌ పోలీసింగ్‌ గుర్తు రాదు. అయినా నాకు తెలియక అడుగుతాను మగాడు గోచి పెట్టుకొని వీధుల వెంట తిరిగినా ఆడవాళ్లకు చీమ కుట్టినట్లైనా ఉండా? వాల్లకు అలా ఉంటే వీల్లేమి చేస్తారు? గతం లో ‘ అందాల పోటీలు ‘ కు వ్యతిరేకంగా కమ్యునిష్టులు ఏదో చేస్తుండే వారు. వారుకూడా పట్టించుకున్నట్లు లేదు.

  9. @తిరుపాలు, దీపికా పడుకొణే చేసినది కూడా తప్పే. ఆమె తన వక్షోజాలు కనిపించేలా దుస్తులు వేసుకుని మగవాళ్ళు తనని అక్క లేదా చెల్లిలాగ చూడాలంటే అలా ఎవరు చూస్తారు? పెళ్ళైన స్త్రీలు చీరలు కట్టుకోవడం, పెళ్ళి కాని స్త్రీలు వక్షోజాలు కనిపించే దుస్తులు వేసుకోవడం స్త్రీవాదానికి ఏమాత్రం అనుకూలం కాదు. దీపికపై స్త్రీవాదులకి సానుభూతి ఉండక్కరలేదు.

  10. ఎవరు ప్రవీనూ దీపిక? ఎవరి గురించి చెపుతున్నారో నాకు తెలియదు.. ఇక్కడ ఏ వాదం గురించి మాట్లాడలేదు జెస్ట్‌ ఉటకించాను.

  11. “I am a woman. I have breasts and cleavage” అన్నది దీపిక కాకపోతే ఇంకెవరు? నాకు ఒక సందేహం ఉంది. సినిమా నటులు ఆ రకం దుస్తులు వేసుకునేదే మగవాళ్ళ దృష్టిని మరల్చడానికి. మగవాళ్ళు అది చూసి ఎంజాయ్ చేసిన తరువాత ఆమె ఏడిస్తే దాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు?

  12. ప్రవీణ్ గారూ మీ భావాలు మీరు వ్యక్తం చెయ్యండి, అభ్యంతరం లేదు. కానీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అన్న మీ పేరు తొలగించి ఆ పని చెయ్యండి. మార్క్సిస్టు లెనినిస్టులు ఎవ్వరూ మీలా ఇంత కన్సర్వేటివ్ గా, ఆడవాళ్ళ పైన నిబంధనలు పెట్టి అర్ధం లేని ద్వేషం కక్కరు. టి.ఓ.ఐ పత్రిక ట్వీట్ కు సమాధానంగా ఆమె మీరు చెప్పిన వ్యాఖ్యానాన్ని వ్యంగ్యంగా అన్నారు. దానికి మీరు అంటగడుతున్న అర్ధం విపరీతంగా ఉంది.

    మగవాళ్ళ దృష్టి మరల్చడం ఏమిటి? దృష్టి మార్చే ఉద్దేశ్యం లేనివారు ఆమె ఫోటోలు ఎందుకు చూడాలి, దృష్టి మార్చింది బాబోయ్ అని ఎందుకు ఏడవాలి? పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రతి అంశాన్ని మార్కెటీకరణ చేసినట్లే స్త్రీ, పురుషుల శరీరాల్ని, వారి ఆకర్షణను కూడా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటుంది. అందులో భాగం అయినవారు అలాగే ఉంటారు. ఆమె స్పందన సందర్భాన్ని పూర్తిగా పక్కనబెట్టేసి, ఆమె చెప్పిన మాటల్నే ఎత్తి రాసే మీ ఆనందం చూస్తే చాలా చిరాగ్గా ఉంది.

    ఇందులో నేను రాసిన అంశాల మీదనే నేరుగా స్పందించండి. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి అదీ ఇదీ రాయకుండా నిభాయించుకుంటారని ఆశిస్తున్నాను.

  13. దీపిక అవయవాలు కనిపించేలా దుస్తులు వేసుకునేదే సినిమాలలో అవకాశాల కోసం. ఆ నటులనీ, మోదల్స్‌నీ చెత్తగా చూపించేవాళ్ళదే వ్యాపారమైతే వాళ్ళ కోసం బట్టలు విప్పేవాళ్ళది మాత్రం వ్యాపారం కాదా? (….. edited……..) బతకడానికి న్యూద్ మోదలింగ్ ఒక్కటే మార్గం కాదని ఇది వరకే ఆ వృత్తిలో ఉన్న స్త్రీలకి తెలియదా? పెళ్ళైన స్త్రీ ఒక మగవాని సొత్తనీ, న్యూద్ మోదలింగ్ చేసే స్త్రీ మాత్రం అలా కాదనీ అనుకుంటే ఇక అశ్లీల సంస్కృతిపై వ్యతిరేకత ఏముంటుంది?

    దీపికా కోట్లు రెమ్యూనరేషన్ కోసం నటిస్తోంది. ఆమేమీ కార్మిక వర్గానికి చెందిన స్త్రీ కాదు. ఆమెపై సానుభూతి చూపాల్సిన అవసరం మార్క్సిస్త్‌లకి లేదు. ఆమె ప్రస్తావన తెచ్చింది తిరుపాలు గారే కానీ నేను కాదు.

  14. మీ నుండి ఇంత కంటే మంచి స్పందన వస్తుందని నేను ఆశించలేదు గానీ, ఒక సంగతి మీరు గ్రహించాలి. దీపిక ప్రస్తావన తెచ్చింది మీరే, తిరుపాలు గారు కాదు. వ్యాఖ్యలన్నీ అలాగే ఉన్నాయి. అయినా నెపం తిరుపాలు గారి మీదికి నెట్టగల మీ ధైర్యానికి మెచ్చుకోవాలి.

    అసలేమాత్రం లాజిక్ లేని కంక్లూజన్ తీయడం మీ హక్కులాగుంది.

    “పెళ్ళైన స్త్రీ ఒక మగవాని సొత్తనీ, న్యూద్ మోదలింగ్ చేసే స్త్రీ మాత్రం అలా కాదనీ అనుకుంటే ఇక అశ్లీల సంస్కృతిపై వ్యతిరేకత ఏముంటుంది?”

    ఏంటిది? దీనికేమన్నా అర్ధం ఉందా? పెళ్లికీ న్యూడ్ మోడలింగ్ కీ తేడా తెలియదా మీకు?

    మళ్ళీ చెత్త మాటలు (ఎడిట్ చేసినవి) రాస్తే మీ వ్యాఖ్యలు ప్రచురించడానికి పునరాలోచిస్తాను. గమనించగలరు.

  15. ప్రవీను గారు సంబందం లేకుండ మాట్లాడుతున్నారు. నేను ‘ పని లేని ‘ బ్లాగ్‌ లో బ్రంహం గారు ఉటకించిన దానిలోంచి తీసు కున్నాను. ఆ అమ్మాయి పేరు ‘ Nivedita N Kumar’ అట! మీరు ఏదేదో ఊహించి రాయకండి. అక్కడ చూడండి.

  16. పేదరికం వల్ల వంద రూపాయల కోసం వ్యభిచారం చేసి, ఇంటికి తిరిగి వస్తూ ఆకతాయిల వేధింపులకి గురైన స్త్రీ మీద సానుభూతి ఉండొచ్చు కానీ తిరుపాలు గారు ఉదహరించింది “కోట్లు పారితోషికం తీసుకునే & మార్క్సిజం అవసరం లేని” దీపికా పడుకొణే సమస్య గురించి. అందుకే ఆయన వ్యాఖ్యపై నేను అభ్యంతరం చెప్పాను.

    స్త్రీకి తన అవయవాల్ని చూపించుకునే హక్కు ఉంటే పెళ్ళైన స్త్రీకి కూడా ఆ హక్కు ఉంటుంది. కానీ సమాజం ఆ హక్కు ఇవ్వలేదంటే దాని అర్థం న్యూద్ మోదలింగ్ వల్ల స్త్రీ-పురుష సమానత్వం రాదనే కదా! ఆ వృత్తిలో ఉన్నవాళ్ళ సమస్యని ఇక్కడ ఉదహరించొద్దు అని చెప్పడానికే నేను ఆ వ్యాఖ్య వ్రాసాను.

  17. చర్చల నుండి, వాద ప్రతివాదాల నుండి ఏ మాత్రం నేర్చుకోకుండా యుగాల తరబడి పాడిందే పాడుతూ, తప్పుల్ని సవరించుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడనివారికి ఎన్ని చెప్పి ఏం ప్రయోజనం?

    అవయవాలు చూపించుకునే హక్కు ఏమిటయ్యా బాబు? అదొక హక్కూ, దానిపై చర్చా? పైగా ఏ సమాజాన్ని విమర్శిస్తున్నామో దాన్నే అడ్డం తెచ్చుకోవడం! స్త్రీ పురుష సమానత్వం అనేది సమాజం ఇచ్చే న్యూడ్ మోడలింగ్ హక్కూపై ఆధారపడి ఉంటుందా? సమాజం ఆ హక్కు ఇవ్వలేదు కాబట్టి స్త్రీ పురుష సమానత్వం రాలేదా?

    స్త్రీ సమాన హక్కులు వారు చేసే వృత్తిపైన ఆధారపడి ఉండవు. స్త్రీ సమానాత్వాన్ని ఏ సమాజం అయితే నిరాకరిస్తోందో సరిగ్గా అదే సమాజం స్త్రీని ఆట బొమ్మగా చూపిస్తూ విలువలు, వలువలు విప్పుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ సంబంధం చూడలేకపోతే మీరిక స్త్రీవాదం అంటూ మాట్లాడకపోవడమే ఉత్తమం. మీరు అది మానాలని నా కోరిక కాదు. స్త్రీ సమాన హక్కులని సరైన అర్ధంలో చూడడం మొదట మీరు నేర్చుకోవాలన్నదే నా మొత్తుకోలు.

  18. I am a regular user of Facebook but it is not possible for me to read every post. Therefore I have not read Tirupalu’s post though he is in my friends list on Facebook. వ్యాఖ్య యొక్క శైలి చూసి అది దీపికా పడుకొణే వ్యాఖ్య అనుకున్నాను. అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ చర్చ అనవసరం అనుకుని నేను అందుకు అభ్యంతరం చెపుతూ వ్యాఖ్యలు వ్రాసాను. అది ఇక్కడ జరిగిన పొరపాటు.

    పాచిపళ్ళ పాటలు కాదు. స్త్రీ-పురుష సమానత్వం లేనప్పుడు అశ్లీల ప్రదర్శనల వల్ల అది వస్తుందని అనుకోలేము. ఈ విషయం నేను ఇంతకు ముందే వ్రాసాను. విచ్చలవిడితనం వల్ల సమానత్వం వస్తుందని నమ్మేవాళ్ళు కొంత మంది నిజంగా ఉన్నారు.

  19. పాపం! కొంతమంది ప్రముఖులకి లౌక్యం తెలియక ఇలా అనవసరమైన విషయాలలో తలదూర్చి విమర్శలపాలవుతారు.

  20. బోనగిరి గారు, పొరపాట్లు అందరూ చేస్తారు. హిందువులలో కజిన్ మేరేజెస్ నిషిద్ధం కదా అని ముస్లింలలో వాటిని నిషేధించడం సాధ్యం కాదనీ, హిందువులు మేనమామ కూతురితో inbreeding చేసినా పుట్టబోయే పిల్లలకి జన్యుపరమైన సమస్యలు వస్తాయనీ, inbreedingకి వరసల విధానంతో సంబంధం లేదనీ నేను స్పష్టంగా చెప్పినా అర్థం చేసుకోకుండా నువ్వు ముస్లింలని ఎందుకు విమర్శించడం లేదు అంటూ నన్ను తిట్టినవాళ్ళని మీరు రెగ్యులర్‌గా చదివే ఓ బ్లాగ్‌లో చూసాను.

    నేను అభిప్రాయాలు మార్చుకోని మొండివాణ్ణని నాపై విమర్శలు ఉన్నాయి. కానీ నేను ఆ రకం కాదు. గతంలో నేను రైలు చార్జిలు తగ్గిస్తే రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందనుకునేవాణ్ణి. వంతెనలూ, సొరంగాలూ లేకుండా కిలో మీతర్ రైలు మార్గం వెయ్యడానికి కోటి రూపాయలు ఖర్చవుతుందనీ, ఐదు రూపాయల తికెత్‌ల కోసం కోట్లు ఖర్చు పెట్టి కొత్త రైలు మార్గాలు నిర్మించడం సాధ్యం కాదనీ ఒక రైల్వే అధికారి నాకు చెప్పిన తరువాత నా అభిప్రాయం మారింది. అదే విషయం నేను బ్లాగుల్లో వ్రాస్తే, నేను రైలు చార్జిల పెంపుని సమర్థిస్తున్నానంటూ నా పై తిట్లు!

  21. కొన్ని విషయాల్లో ప్రవీణ్ అభిప్రాయాలు ఛాందసుల అభిప్రాయాలతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయన్నది నా గమనింపు కూడా ముఖ్యంగా స్త్రీల పవిత్రత/శీలం గురించిన అభిప్రాయాల విషయంలో. “మా భావజాలాన్ని మీరు గౌరవించరు కాబట్టి, మీపై జరిగే దాడి సరైనదే” లేదా “మా భావజాలాన్ని గౌరవిస్తేనే మిమ్మల్ని మేం defend/protect చేస్తాం” అన్న అభిప్రాయాలు ఎవరు వెలిబుచ్చినా వాటిని మెచ్చుకోవడం నాకు సాధ్యంకాదు. ఇది ఏవాదమైనా దానినినేను సమర్ధించలేను. ఇదొకవేళ కమ్యూనిజమో, ఫెమినిజమో ఐతే దాన్ని నేను గౌరవించలేనని చెప్పడానికి గర్విస్తున్నాను.

  22. విశేషజ్ఞ గారూ, అనేశారా! ఆ కాస్త మాట కూడా అనేశారా? ఈ ప్రమాదం ఉందనే ప్రవీణ్ ని మార్క్సిజం-లెనినిజం అంటూ మాట్లాడొద్దని చెప్పేది. ఆ సిద్ధాంతం గురించి స్పష్టమైన అవగాహన లేకుండా తాను చెప్పేదంతా మార్క్సిజం కిందికి నెట్టేయడం ప్రవీణ్ చేస్తున్న అతి పెద్ద తప్పు. ఎన్నిసార్లు చెప్పినా సవరించుకోవడం మాని పైత్యం వెళ్లబోస్తూ దాన్ని మార్క్సిజం కింద చెలామణి చేసే ప్రమాదం కొని తెస్తున్నారు. ఇది చాలా చాలా అభ్యంతరకరం.

    ప్రవీణ్ గారూ ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు మీ పేరుతో ఎన్నయినా రాసుకోండి. మరోలా భావించవద్దు. సిద్ధాంతం గురించి తెలిస్తేనే చెప్పండి. తెలియకపోతే వదిలేయండి. తెలియకపోవడం నేరమేమీ కాదు. మార్క్సిజం లాంటి సామాజిక సిద్ధాంతాలను త్వరపడి అన్వయిస్తూ ఇలా మంచిపేరుకు బదులు చాలా చెడ్డపేరు తెస్తున్నారు.

    విశేషజ్ఞ గారూ ప్రవీణ్ వెలిబుచ్చే అభిప్రాయాలూ ఆయన వ్యక్తిగతం. అది ఫెమినిజం కాదు. మార్క్సిజం అయితే చస్తే కాదు. ప్రవీణిజం అనుకోవచ్చేమో ప్రవీణ్ గారు చెప్పాలి.

  23. Visekhar, do you know what communism is? Communism is related to class consciousness. Hatred on one person cannot be a reason to hate communism and favour on one person cannot be a reason to love communism.

    I am the first person one the Telugu blogosphere to support cougar marriages (a young guy marrying a woman who is 25 years older than him). Still you say that I am a conservative.

  24. ప్రవీన్ గారికి నేను గతంలొ ఒకసారి చెప్పి ఉన్నాను. మీ అభిప్రాయాలు మార్కిజం అనే పేరు తగిలించకుండా చెప్పండి, కొత్తగా యవరైనా దానిగురించి తెలుసుకొవాలనే వారికి అదేదొ (మార్కిజాన్ని) ఆశామాషిగా తీసుకునే అవకాశం వుందని. దానినుంచి దూరం అయ్యే ప్రమాదం వుంది. అంతిమంగా అది బుర్జువాలకే వుపకరిస్తుంది.

    బుర్జువా పార్టీలాగే కొందరు బుర్జువా స్త్రీ వాదులు ఏవొ చిట్టి పొట్టి సంస్కరణలకే పరిమితమై స్త్రీ పురుషులను పరస్పర శత్రువర్గాలుగా వాళ్ళ అందరి ఉమ్మడి ప్రయొజనాలు ఒకటి కాదన్నట్టుగా స్త్రీలను కార్మికులనుంచి దూరం చేసి మాట్లాడుతూ వుంటారు. అలాంటి వాటిని దౄస్టిలొ పెట్టుకుని మీరు విమర్శ చేస్తె మంచిది. మిమ్మలను కొరేదల్ల ఒకటే. మార్క్సిజం అనే పేరు లేకుండా మీ పేరుతొనే మీరు మీ అభిప్రాయాలను చెప్పండి. దానివల్ల మీరు పొరపాటు అభిప్రాయం వెలిబుచ్చినా మార్క్సిజాన్ని రక్షించిన వారవుతారు.

  25. నేను స్త్రీలని కార్మికుల నుంచి దూరం చేసి మాట్లాడానా? ఎక్కడ? కార్మిక వర్గం నుంచి దూరంగా పోతున్నది మీరే, మన దేశంలో చాలా మంది స్త్రీలు సిగరెత్‌లు తాగాలనుకోవడం లేదు, మందు కొట్టాలనుకోవడం లేదు. అలా అనుకునేవాళ్ళ భావాలని మీరు ఎంఫసైజ్ చేసి నాది తప్పంటారు.

  26. స్త్రీలు సిగరెట్ తాగితేనో మందు కొడితేనో తమరికి వచ్చిన నష్టం ఏమిటిట? సిగరెట్ కీ భావాలకీ సంబంధం అంటగడితే ఆ పని స్త్రీలు, పురుషులు ఇద్దరి విషయంలోనూ చెయ్యాలి. కార్మిక నాయకుల్లో, విప్లవ కమ్యూనిస్టు నాయకుల్లో సిగరెట్ తాగేవాళ్లు బోలెడు మంది ఉన్నారు. మావో అయితే చుట్టలే కాల్చేవారు. అందుకని ఆయన కమ్యూనిస్టు కాకుండా పోయారా?

    స్వకపోల కల్పిత భావాలని మార్క్సిజంగా చెప్పవద్దు బాబోయ్ అని మొత్తుకుంటుంటే మళ్ళీ మళ్ళీ అదే పని చేయడం ఏమిటి? అసలు మేము చెప్పేది తిన్నగా అర్ధం చేసుకోవడం మీకు సాధ్యం కాదా? వ్యాఖ్య రాసినప్పుడల్లా ఏదో కొత్త చెత్త రాయడం, దాన్ని మార్క్సిజంలో భాగం చేసెయ్యడం! చెప్పింది తిన్నగా అర్ధం చేసుకోకపోవడం, మీరు అర్ధం చేసుకున్నా కొత్త అర్ధాలని అంటగట్టడం, పైగా మీకే ఏమీ తెలియదని దబాయించడం!

    మీ భావాలు మీ ఇష్టం. ఎన్నయినా రాయండి. కానీ వాటిని మార్క్సిజం పేరుతో రాయొద్దనే రామ్మోహన్ గారు చెప్పింది. ముందు మీరు మార్క్సిస్టు-లెనినిస్టు పేరు తొలగించమని నా అభ్యర్ధన కూడా. అభ్యర్ధన అని అనడం వేరే మార్గం లేకనే అన్న సంగతైనా మీకు అర్ధం కావాలని కా ప్రగాఢ కోరిక.

  27. సిగరెత్‌లు తాగేవాళ్ళు మార్క్సిస్త్‌లు కాదని నేను అన్నానా? నేను అననివి అన్నట్టు మీరు అనడం ఎందుకు?

    కార్ల్ మార్క్స్ కూడా వైన్ తాగేవాడు. వైన్ తాగడం, కారం ఎక్కువ కలిసిన ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురై మార్క్స్ చనిపోయాడు. వ్యక్తిగత అలవాట్లకి వర్గ చైతన్యంతో సంబంధం లేదు.

  28. నేను మార్క్సిస్త్‌ని కాదని విమర్శించే ముందు మీరు మార్క్సిస్త్‌లా, కాదా అనేది ఆలోచించండి. మీరు మార్క్సిస్త్‌లమని చెప్పుకుంటూ పాలకవర్గం పెట్టే ఫ్రీ స్కీములని నమ్మడం నాకు నిజంగా బాధ కలిగించింది. “చంద్రబాబు అన్ని ఊర్లకీ రోద్‌లు వేసాడు కదా, ఆయన ఎలా ఓడిపోయాడు” అని 2004లో కొంత మంది పల్లెటూరివాళ్ళు అడగడం నేను కళ్ళారా చూసాను. ఆయన ఊర్లకి రోద్‌లైతే వేసాడు కానీ ఫ్లోరైద్ గ్రామాలకి మంచి నీళ్ళు ఇవ్వలేదని ఎంత మందికి తెలుసు? వ్యవసాయం దండగ అని ప్రచారం చేసిన ఆయనకే వ్యవసాయ ఋణాలు మాఫీ చెయ్యాలని దిమాంద్ చేసే మీది వర్గ చైతన్యం, ఋణ మాఫీ సాధ్యం కాదని నమ్మే నేను నమ్మేది పెట్టుబడిదారీ ప్రచారం!

వ్యాఖ్యానించండి