ఒకరిది హైరానా, మరొకరిది ఘరానా -కార్టూన్


Maharashtra election play

ఆటగాళ్ళు ఇద్దరూ క్రీజు వదిలి మధ్యలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. కాదు, పోట్లాడుకుంటున్నారు. బంతిని తొందర తొందరగా వికెట్ల దగ్గరికి విసిరేస్తే వికెట్లను పడగొట్టి ఆటగాళ్లను ఔట్ చేయొచ్చని ఫీల్డర్లు, బౌలర్, వికెట్ కీపర్ ల హైరానా!

ఒక ఆటగాడే మొత్తం టైమ్ అంతా తినేస్తున్నాడు. మరో ఆట గాడికి బ్యాట్ ఝుళిపించే సమయం దొరికి చావడం లేదు. స్ట్రైకింగ్ ఛాన్స్ వస్తే తన సత్తా చూపించవచ్చని మరో ఆటగాడి ఆత్రం. కానీ తాను నిలదొక్కుకున్నా గనక తన మా(ఆ)టే చెల్లాలని క్రీజులో పాతుకుపోయిన ఆటగాడి పంతం. ఇద్దరూ పిచ్ పొడవున్న బ్యాట్ లు తెచ్చుకోవడంతో పిచ్ మధ్యలో ఉన్నా తమను ఎవరూ ఔట్ చేయలేరన్న ఘరానా!

హైరానా పడుతోంది కాంగ్రెస్, ఎన్.సి.పి లు కాగా, ఘరానాగా తీరిగ్గా తగాదా పడుతున్నది బి.జె.పి, శివ సేనలు. బి.జె.పి, శివ సేనలకు గెలుపు మీద మహా ధీమాగా ఉంది. అందుకే సెప్టెంబర్ 27 తేదీన నామినేషన్లకు చివరి తేదీ అయినా సెప్టెంబర్ 21 వరకూ సీట్ల పంపకం పైన ఒప్పందానికి రాకుండా ఎవరి పంతం వారు పట్టుకుని కూర్చున్నారు.

తాజాగా 125 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చి 155 సీట్లు మేమే పోటీ చేస్తామని శివ సేన ఆఫర్ ఇచ్చిందిట. ఇది అన్యాయం అని బి.జె.పి వాపోతోంది. గత ఎన్నికల్లో ఇరు పార్టీలు ఓడిపోయిన 50, 20 సీట్ల గురించి ఒక్కో సీటు వారీగా చర్చించి తేల్చుకుందామని బి.జె.పి ప్రతిపాదిస్తున్నా, శివ సేన లొంగి రావడం లేదు. దానితో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

బి.జె.పి, శివ సేనల ఘారానాను, కాంగ్రెస్, ఎన్.సి.పిల హైరానాను జనం గమనించకుండా పోయారా? గమనిస్తే తగిన ఫలితం ఇవ్వకపోరా? కానీ అందరూ ఆ తానులో ముక్కలే అయినప్పుడు ఎవరికి అధికారం ఇచ్చి ఏమి ప్రయోజనం?

వ్యాఖ్యానించండి