కె.సి.ఆర్ దాయాది బాబు -కార్టూన్


TS cousin

“ఈయన ఆంధ్ర నుండి వచ్చిన మా కజిన్.

కుటుంబ చర్చల కోసం మాత్రమే ఆయన ఇక్కడకు వచ్చారు”

***

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సలహా మేరకు దాయాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురూ కలిసి కూర్చుని కష్ట, సుఖాలు మాట్లాడుకున్నారు. చర్చలు చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ఇద్దరు సి.ఎం లూ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని కె.సి.ఆర్ అంగీకరించినట్లుగా కూడా ఎ.పి. సి.ఎం బాబు చెబుతున్నారు.

చర్చల అనంతరం తమ సంభాషణ గురించి సి.ఎం లు ఇరువురూ చెప్పిన వివరాలను కార్టూనిస్టు ఇలా హాస్యీకరించారు. సి.ఎం ల చర్చలను, వివాదాస్పదంగా మారిన తెలంగాణ ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వేను కలగలిపి హాస్యమాడారు. ఇరువురూ ఒకరికొకరు దాయాదులమే అవుతామని, కాబట్టి ఒకరికొకరు సహకరించుకోవాలనీ సి.ఎం లు ఇద్దరూ గుర్తించిన విషయాన్ని ఇలా చురుకు (చురక కాదు లెండి) పుట్టే విధంగా విప్పి చెప్పారు.

సర్వే ద్వారా ఆంధ్ర వారికి పొగబెట్టడానికే పధకం వేశారన్న ఆరోపణలను కూడా ఈ కార్టూన్ అంతర్లీనంగా తడుముతున్న సంగతి గమనించవచ్చు. చర్చల కోసమే వచ్చారని చెప్పడం ద్వారా, చర్చలు అయ్యాక వెనక్కి వెళ్లిపోతారని ఇంటాయన పరోక్షంగా సూచిస్తున్నారు.

సర్వే అని సూచిస్తూ బోర్డు పట్టుకుని నిలబడ్డ వ్యక్తి హావభావాలను గమనించండి. సర్వే చేస్తున్నవారు చెమట్లు కక్కుతుంటే, ఆయనేమో మొఖం చిట్లించి ఈ పచ్చ చొక్కా ఆయన ఇక్కడెందుకు ఉన్నట్లు అన్నట్లుగా నిలబడి ఉన్నారు. సర్వే చుట్టూ అలుముకుని ఉన్న వాతావరణాన్ని ఈ కార్టూన్ చక్కగా ప్రతిబింబిస్తోంది.

One thought on “కె.సి.ఆర్ దాయాది బాబు -కార్టూన్

వ్యాఖ్యానించండి