మోడి & అమిత్ షా: ఇక పనిలోకి దిగుదాం! -కార్టూన్


Business as usual

కొత్త ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తోడనే గుజరాత్ లో సంచలన కేసుల కధలు ఒక్కొక్కటీ కంచికి ప్రయాణం కడుతున్నాయి. ఆయా కేసుల్లో నిందితులకు గౌరవ మర్యాదలతో పదవులు దక్కుతున్నాయి.

షోరాబుద్దీన్ షేక్ (మరియు) ఆయన భార్య  ఎన్ కౌంటర్, ఇష్రత్ జహాన్ (మరియు మరో ముగ్గురు ముస్లిం యువకులు) ఎన్ కౌంటర్, తులసీరాం ప్రజాపతి హత్య తదితర కేసుల్లో నిందితులైన ఐ.పి.ఎస్ అధికారులు ఇద్దరిని సగౌరవంగా తిరిగి పదవులు కట్టబెట్టారు. ఆషామాషీ పదవులు కాకుండా శక్తివంతమైన అధికారం కలిగిన పదవుల్లో వారిని నియమించినట్లు పత్రికలు తెలియజేశాయి.

గుజరాత్ లో ముఖ్యమంత్రి పదవిలో ఇప్పటి ప్రధాని, హోమ్ మంత్రి పదవిలో ఇప్పటి బి.జె.పి అధినేత… ఇరువురూ జోడుగా నిర్వహించిన కార్యకలాపాల నకళ్లు మళ్ళీ జాతీయ స్ధాయిలో యధావిధిగా రీ ప్లే అవుతున్నాయని ఈ కార్టూన్ సూచిస్తోంది.

ఇద్దరు మిత్రులు కూర్చొని ఉన్న కుర్చీలు రెండూ కోర్డులో జడ్జిల సీట్లు లేదా బోనులను తలపించడం గమనార్హం. నిందితులుగా ఉంటూనే జడ్జిల పాత్ర నిర్వహిస్తున్నారని దీని అర్ధమా? వారి కుర్చీల పక్కన సిద్ధంగా ఉన్న గండ్ర గొడ్డళ్ళు వారు ఏ పనిలో యధావిధిగా (బిజినెస్ యాజ్ యూజువల్) నిమగ్నమై ఉన్నారో సూచన ఇస్తున్నాయి.

డి.ఐ.జి వంజార కు కూడా త్వరలో విముక్తి దొరకానుందా?

పాపము శమించు గాక!

One thought on “మోడి & అమిత్ షా: ఇక పనిలోకి దిగుదాం! -కార్టూన్

వ్యాఖ్యానించండి