ఎ.పి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఒకరినొకరు ఆక్షేపించని రోజు లేకుండా పోతోంది. పోలవరం ముంపు గ్రామాల విలీనంతో మొదలుకుని ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు, ఫీజుల చెల్లింపుల వరకూ ఇరు ప్రభుత్వాలూ తగాదా పడుతూనే ఉన్నారు. స్వాతంత్ర దినం నాడు కూడా ఒకరు విభజన పద్ధతి ప్రకారం జరగలేదంటే మరొకరు ఇంకోటన్నారు.
పుడుతూనే పౌరుషాలతో, పంతాలతో కొట్లాడుతూ పుట్టిన తెలుగు పుంజులు ఇరు రాష్ట్రాల ప్రజలకు లేని సమస్యలు సృష్టిస్తున్నారు. చల్లబరచాల్సిన అనవసర భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇది వారి రాజకీయ అవసరాలను తీర్చుతుందేమో గానీ జనానికి మాత్రం చేటు తెస్తుంది.

రోజూ ఈవాదనలు వింటూ,చూస్తూ నవ్వుకుంటూనే ఉన్నాను! కానీ,హైదరాబాద్(ముఖ్యంగా) లోఉంటున్న సామాన్య సీమాంద్రులనుచూస్తే జాలివేస్తుంది!