భారత ప్రధానికి బోలెడు ఉపగ్రహాలు -కార్టూన్


SAARC & regional satelite

“శ్రీలంక నుండి అప్రమత్తత సంకేతమా? కాస్త ఆగండి. నేను చెన్నైలోని మా ప్రాంతీయ ఉపగ్రహం నుండి వివరాల కోసం ఎదురు చూస్తున్నాను.”

*********

భారత ప్రధాని నరేంద్ర మోడీకి బోలెడు ఉపగ్రహాలు. ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను పిలిపించుకుని (సో కాల్డ్) ‘చరిత్ర సృష్టించడం’ ద్వారా భారత పెద్దన్న పాత్రను ఆదిలోనే రుజువు చేశారు ప్రధాని. ఆ చర్యతో భారతేతర సార్క్ దేశాలు ఇండియా ఉపగ్రహాలన్న అభిప్రాయం ఒకటి అంతర్జాతీయ పరిశీలకులకు ఏర్పడిపోయింది.

ప్రధాని మోడి దేశీయంగా కూడా కొన్ని ఉపగ్రహాలు సృష్టించుకున్నారని ఈ కార్టూన్ ద్వారా తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ప్రధాని మోడి ప్రభావంలో ఉన్నారన్న అనుమానాన్ని, మన వాళ్ళు కాకుండా శ్రీలంక రక్షణ శాఖ రేకెత్తించింది.

శ్రీలంక తమిళ సమస్య, తమిళనాడు మత్స్యకారుల సమస్యలపైన తమిళనాడు ముఖ్యమంత్రి రాసిన లేఖలను ప్రధానికి ఆమె రాసిన లవ్ లెటర్స్ గా ప్రస్తావిస్తూ శ్రీలంక రక్షణ శాఖ తమ వెబ్ సైట్ లో ఒక ఆర్టికల్ పోస్ట్ చేసింది. వినడానికే ఆగ్రహం కలిగించేదిగా ఉన్న ఈ ప్రస్తావనను ఎలా చేశారో గానీ, ఆనక తప్పు తెలుసుకుని శ్రీలంక ప్రభుత్వం లెంపలు వేసుకుంది. బేషరతుగా క్షమాపణ చెబుతూ ఆర్టికల్ ను తొలగించింది.

ఉపగ్రహంగా భావిస్తున్న శ్రీలంక నుండి హెచ్చరిక సంకేతం రాగా దేశీయ (ప్రాంతీయ) ఉపగ్రహం నుండి సంకేతం వస్తే స్పందించబోనని మన ప్రధాని వ్యాఖ్యానిస్తున్నట్లు కార్టూనిస్టు హాస్యమాడారు.

వ్యాఖ్యానించండి