సివిల్స్ పరీక్షల్లో కొశ్చెన్ ట్యాగ్స్ (డైరెక్టివ్) గురించి ఈనాడు చదువు పేజీలో చర్చిస్తున్నాము. ఈ వారం భాగంలో ‘డిస్కస్’ అనే డైరెక్టివ్ గురించి రాశాను.
గత సంవత్సరం ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఒక ప్రశ్నను ఉదాహరణగా తీసుకుని చర్చించాను. తెలుగు పత్రికల్లో పెద్దగా చర్చకు రాని షేల్ గ్యాస్ గురించిన ప్రశ్నను తీసుకుని సమాధానం ఎలా రాయవచ్చో వివరించాను.
ఈనాడు వెబ్ సైట్ లో ఈ వారం భాగాన్ని చూడాలనుకుంటే కింది లింక్ ను క్లిక్ చేయగలరు.
పి.డి.ఎఫ్ డాక్యుమెంటు రూపంలో చూడాలంటే కింది ఇమేజ్ ను క్లిక్ చేయగలరు. రైట్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


very informative.thank you sir.
మీరు మైక్రో & మాక్రో ఎకనామిక్ ఎనాలిసెస్‌కి విరుద్ధంగా ఈ వ్యాసం వ్రాసారు. మన దేశంలో జనాభా ఎక్కువ, భూమి విస్తీర్ణం తక్కువ. రైతుల్లో ఎక్కువ మంది నాలుగైదు ఎకరాలు భూమి ఉన్నవాళ్ళే. నాలుగైదు ఎకరాలు విస్తీర్ణం గల వ్యవసాయ భూమి భారీ యంత్రాల వాడకానికి సహకరించదు. రైతుకి వ్యవసాయ ఋణం ఇచ్చినా అతను ఆ డబ్బుతో అధునాతన యంత్రాలు కొనుక్కోవడం జరగదు, agricultural output పెరగదు. పెరగలేని output కోసం ఋణం ఇవ్వడమే అనవసరం, ఇక ఋణమాఫీ మాత్రం ఎలా అవసరమవుతుంది?
మన రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర భూములు తీసుకున్న పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టకుండా, ఆ భూముల్ని తనఖా పెట్టి బ్యాంక్ లోన్లు తీసుకున్నారు. అది చట్ట ప్రకారం నేరం అని తెలిసే అలా చేసారు. పరిశ్రమ పెట్టడానికి భూమి ఒక్కటే సరిపోదు కదా, మరి భూమి ఫ్రీగా ఇచ్చినంతమాత్రాన పరిశ్రమలు ఎలా పెడతారు? ఆ భూమి విలువని ఎక్కువగా చూపే దొంగ పత్రాలు సృష్టించి, దాంతో బ్యాంక్ లోన్‌లు తీసుకుని ఆ డబ్బుతోనే బతికేస్తారు ఈ పారిశ్రామికవేత్తలు. అందుకే మన దేశంలోని బ్యాంక్‌లకి NPAలు ఎక్కువగా ఉన్నాయి.
దొంగ పత్రాలకి లోన్‌లు ఇచ్చే బ్యాంక్ అధికారులని అరెస్త్ చెయ్యాలని కోరకుండా “మీరు పారిశ్రామికవేత్తలకి లోన్‌లు ఇచ్చారు కనుక రైతులకి కూడా లోన్‌లు ఇవ్వండి” అని అంటే బ్యాంక్‌లు రైతులకి ఋణాలు ఎలా ఇస్తాయి?
పైగా ఋణాల మాఫీ కూడానూ! మనది ప్రపంచ బ్యాంక్ అప్పులతో బతికే దేశం. ఉచిత విద్యుత్‌కి ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదు అని గతంలో ప్రచారం చేసిన చంద్రబాబు ఋణమాఫీకి మాత్రం ప్రపంచ బ్యాంక్ అప్పు ఇస్తుందని ఎలా అనుకున్నాడు? 1950లోనే జవహార్ లాల్ నెహ్రూ విదేశీ అప్పులు తీసుకునే విధానాన్ని మొదలుపెట్టకుండా ఉండి ఉంటే మన దేశం ఈ స్థితికి దిగేది కాదు.