ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష దాడిలో గాజా రక్తం ఓడడం కొనసాగుతోంది. అంతర్జాతీయ చీత్కరింపులను లెక్క చేయకుండా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు, ట్యాంకులు, గన్ బోట్లు జనావాసాలపై బాంబులు కురిపిస్తూ పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. ఇజ్రాయెల్ ఒక పక్క మానవ హననం సాగిస్తుంటే మరో పక్క అమెరికా, ఐరోపా, ఐరాసలు బూటకపు శాంతి ఉద్భోదలతో పొద్దు పుచ్చుతున్నారు.
పాలస్తీనా (దురాక్రమణ) సమస్య ను క్లుప్తంగా వివరించడానికి ఈ వీడియోలో ప్రయత్నం జరిగింది. నా పి.సికి సౌండ్ డివైజ్ పని చేయడం లేదు. అందువల్ల వాయిస్ ఓవర్ లో ఏమి చెప్పింది నాకు తెలియలేదు. దృశ్యాలను బట్టి చూస్తే వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లే కనిపించింది. అందువల్ల తిరుపాల్ గారు ఇచ్చిన లింక్ ద్వారా ఈ వీడియోను పాఠకులకు అందిస్తున్నాను. దృశ్యాలతో ఇచ్చే అవగాహన వెంటనే మనసుకు నాటుకుంటుంది. ఆ దృష్టితో ఈ వీడియోను ప్రచురిస్తున్నాను. వీడియోను ఎంబెడ్ చేయడం సాధ్యం కాలేదు.
