
సీన్ 1: @*@ (తిట్లు…)
సీన్ 2: $?#@?& (మరిన్ని తిట్లు….)
సీన్ 3: చెప్పు తెగుద్ది, చంపుతా, పొడుస్తా, చీ(పు)రేస్తా…
సీన్ 4: లక్ష్మణ రేఖా? అదెక్కడ?
ఎన్నికలను అవినీతి రహితంగా, ప్రలోభాల రహితంగా, కుల-మతాలకు అతీతంగా, పారదర్శకంగా, నిస్పాక్షికంగా, ప్రజాస్వామికంగా జరుపుతున్నామని చెప్పుకోవడానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పడరాని పాట్లు పడుతోంది.
విద్వేష ప్రసంగం చేసారంటూ వరుస కేసులు పెడుతున్నా ఆ మరుసటి రోజే మరొక నేత తయారవుతున్నాడు. సి.ఇ.సి మందలింపులు, హెచ్చరికలు, కేసులు ఎదుర్కొంటున్నవారి జాబితాలో భవిష్యత్తులో కేంద్ర మంత్రి పదవులను చేపట్టనున్నారని అంచనా వేస్తున్న నేతల నుండి పాటు ప్రధాన మంత్రి పదవిని కాంక్షిస్తున్న నాయకులు కూడా ఉండడం బట్టే భారత రాజకీయాల పరిశుద్ధత, ప్రజాస్వామికత ఏ పాటివో తేటతెల్లం అవుతోంది.
సి.ఇ.సి గీసిన లక్ష్మణ రేఖను పాటించకుండానే పాటిస్తున్నట్లు నటించడానికి, నామమాత్ర కేసులను కూడా ఎదుర్కోకుండా ఉండడానికి రాజకీయ నాయకులు సరికొత్త సూత్రం కనిపెట్టారని కార్టూన్ సూచిస్తోంది. లక్ష్మణ రేఖనే కనపడకుండా చేసేస్తే ఇక దానిని పాటించే అవసరం ఉండదు కదా. రేఖ ఉందని చెప్పడానికి సి.ఇ.సి ఎంత గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటే నేతలు అంత వీరంగం వేస్తూ దాన్ని చెరిపివేయడంలో సఫలం అవుతున్నారు.
ఎన్ని జరిగినా, ఎవరెన్ని వేషాలు వేసినా భారత దేశం మాత్రం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. ఆ సంగతి చాటుకోవాలంటే ఈ అయిదేళ్ళ కొకసారి జరిగే జాతరలు తప్పవు.
(మొదటి మూడు సీన్లు స్వేచ్ఛానువాదంగా గమనించగలరు)