ఎఎపి: నోట్లు ఊడ్చినట్లే ఎన్నికలూ ఊడ్చాల! -కార్టూన్


Poll sweep

“ఎన్నికలను కూడా ఇలాగే ఊడ్చేయగలిగితే బాగుడ్ను!”

ఎన్నికలలో ఖర్చు కోసం పరిశుభ్రమైన డబ్బు కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఒక ట్వీట్ ద్వారా పిలుపు ఇవ్వడంతోనే రెండు రోజుల్లో 1.15 కోట్ల రూపాయలు వసూలయ్యాయట. అత్యంత పెద్ద మొత్తం తమిళనాడు నుండి అందిన రు. 1 లక్ష కాగా, అత్యంత చిన్న మొత్తం రు. 10 అని ఎఎపి నేతలు చెప్పారు.

అరవింద్ ట్విట్టర్ లో చేసిన విన్నపం ఇది:

“Reached Varanasi. Will go to Amethi on 20th. Need clean money to fight Modi and Rahul. Pl sms me at 9868069953 if u wish to donate. Pl RT (retweet),”

ఏప్రిల్ 15 తేదీన ఇది రాయగా రెండు రోజుల్లో 1.15 కోట్లు వచ్చాయని ఎఎపి నేత ఒకరు చెప్పినట్లు ఔట్ లౌక్ పత్రిక చెప్పింది. విదేశాల నుండి కూడా డబ్బు అందిందని సమాచారం. సింగపూర్, అమెరికా, బెల్జియం, ఒమన్, కెనడా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లోని భారతీయులు ఈ డబ్బు పంపినవారిలో ఉన్నారు.

2 thoughts on “ఎఎపి: నోట్లు ఊడ్చినట్లే ఎన్నికలూ ఊడ్చాల! -కార్టూన్

  1. పింగ్‌బ్యాక్: ఎఎపి: నోట్లు ఊడ్చినట్లే ఎన్నికలూ ఊడ్చాల! -కార్టూన్ | ugiridharaprasad

వ్యాఖ్యానించండి