భాషేదైనా కానీ ఈ బుజ్జిదాని పాట చూడాల్సిందే -వీడియో


‘సంగీతానికి ఎల్లలు లేవు’ అని సంగీతం గురించి తెలిసినవారు, తెలియని వారు కూడా తరచుగా చెప్పే మాట! ఎల్లలు అంటే ఏ ఎల్లలో తెలియదు గానీ భాషా పరమైన ఎల్లలు కూడా లేవని ఈ వీడియో చూస్తే (వింటే) వచ్చే ఆనందం ద్వారా మన అనుభవంలోకి వస్తుంది.

ఈ కొరియా పాప (లేకపోతే చైనీస్ పాపో, జపనీస్ పాపో అయినా అయి ఉండవచ్చు) పాడింది ఒక్క నిమిషం మాత్రమే. ఆల్రెడీ రికార్డ్ చేసిన పాటకు నటించిందా లేక తానే పాడిందా అన్నది తెలియలేదు. రికార్డు చేసిన పాటకు అనుకరణ అయితే మాత్రం పాపకు నటనా పరమైన మార్కులు కూడా వేసెయ్యొచ్చు. తన గౌను రంగును బట్టి చూస్తే ఉత్తర కొరియా పాప అయి ఉండొచ్చనిపిస్తోంది.

చిన్న పిల్లలు మాట్లాడితేనే మనకు చూడబుద్ధేస్తుంది, వినబుద్ధేస్తుంది. అలాంటిది పాట పాడుతూ, నటనా కౌశలం, నాట్య కౌశలం కూడా ప్రదర్శిస్తే ఇక చెప్పేదేముంది. ఇంతకీ ఈ పాప వెలువరిస్తున్న శబ్దాలేమిటి?

“న్యేగా ద్దో ప్పోప్పో యూరీ అప్పో ప్పోప్పో యూరీ అప్ప ప్పోప్పో కంజిర్యెయోవా”

అంటున్నట్టుగా ఉంది. బహుశా అమ్మకి ముద్దు, నాన్నకి ముందు అంటోందనుకుంటా.  ఈ ప్రదర్శన కోసం పాప ఎంత ఇబ్బంది పడిందో గానీ ప్రదర్శన మాత్రం చాలా బాగుంది.

One thought on “భాషేదైనా కానీ ఈ బుజ్జిదాని పాట చూడాల్సిందే -వీడియో

  1. వి శేఖర్ గారు చాలా మంచి వీడియో అందించారు. ఆ పాప హావభావాలు ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. ఈ వీడియో చూశాక ఆ చిన్నారి గురించి నెట్ లో ఆరా తీస్తే చాలా సమాచారమే ఉంది.
    ఆ పాప పేరు కిమ్ సోల్ మాయె (KIM SOL MAE) అని, ఉత్తర కొరియాలో చాలా ఫేమస్ సింగర్ అని తెలుస్తోంది. ఉత్తర కొరియాలో పిల్లలకు చాలా కఠోరమైన శిక్షణ ఇచ్చి సంగీతం-నృత్యం కలిపి ( బాలే అనవచ్చా..?) సర్కస్ లాగా, జిమ్నాస్టిక్స్ లాగా నేర్పిస్తారని చాలా విమర్శలున్నాయని తెలుస్తోంది. వాటి సంగతి పక్కన పెడితే ఆ చిన్నారి ప్రతిభ మాత్రం ముచ్చటగా ఉంది. థాంక్యూ.

వ్యాఖ్యానించండి