దశాబ్దాల భారతీయ శ్రమ కుప్పపోస్తే, లండన్! -ఫోటోలు


ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశంగా బ్రిటన్ కి పేరు. మొట్ట మొదటి పౌర హక్కుల పత్రం ‘మాగ్న కార్టా’ కు ప్రాణం పోసింది బ్రిటిష్ పెట్టుబడిదారులే. రాచరికం నుండి హక్కుల కోసం పోరాడిన బ్రిటిష్ పెట్టుబడిదారీ వర్గం అనతికాలంలోనే ప్రపంచం లోని అనేక ఖండాంతర దేశాలకు బయలెల్లి అక్కడి ప్రజలకు హక్కులు లేకుండా చేశారు.

బ్రిటిష్ వలస పాలకులు భారత దేశం లాంటి సంపన్న వనరులున్న దేశాలను దురాక్రమించి వలసలుగా మార్చుకుని ఒకటిన్నర శతాబ్దాల పాటు అక్కడి సంపదలను దోచుకెళ్లారు. అందుకే బ్రిటిష్ పెట్టుబడికి మూలం భారత దేశమే అని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఆర్ధిక పునాదులు సైతం అక్కడే ఉన్నాయని సామాజికార్ధిక చరిత్రకారులు ససాక్షరంగా విప్పి చెప్పారు.

అనేకానేక దశాబ్దాలు దోచుకుతిన్న సంపద ఒక చోట కుప్ప పోస్తే ఆ చోటు ఎలా ఉంటుంది? ధగ ధగ మెరుస్తూ ఉంటుంది. అణువణువూ అపురూపమై, దేదీప్యమాన కాంతులీనుతుంది. రేయింబవలు తేడా తెలియని జిలుగు వెలుగుల తళుకులీనుతుంది. డబ్బు కట్టలు కూరిన కాంక్రీటు అరణ్యం అవుతుంది. శ్రమజీవుల చెమట తుంపర్ల చల్లదనమవుతుంది. కరిగిన కండల ఇటుకలు పేర్చిన ఆకాశహర్మ్యం అవుతుంది.

ఆ లండన్ నగరాన్ని, ఆ యునైటెడ్ కింగ్ డమ్ ని పై నుండి చూస్తే ఇదిగో ఈ అద్భుత దృశ్యాల ఫోటోలయింది.

Photos: The Atlantic

4 thoughts on “దశాబ్దాల భారతీయ శ్రమ కుప్పపోస్తే, లండన్! -ఫోటోలు

  1. గతం గతాహి !
    చరిత్ర ను తిరగ రాసే అవకాశం ఉన్న భారతీయులు కూడా ,
    తోటి భారతీయుల పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారు !
    కొల్ల గొట్టిన ధనాన్ని, విదేశీ బ్యాంకుల్లో దాస్తున్నారు !
    చర్మం రంగులో తేడా ఇక్కడ వర్తించదు కదా !

  2. “దశాబ్ధాల భారతీయశ్రమ కుప్పపోస్తే-లండన్” ఈ వాఖ్యం ఏకపక్షంగా ఉన్నట్టు అనిపిస్తుంది!ఎన్నో దేశాల ఆర్ధికవనరులను కొల్లగొట్టారు. “సామ్రాజ్యవాదదోపిడికి నిలువుటద్దం-లండన్” అన్న శీర్షిక బాగుంటుందేమో!

  3. ఆ మాటకొస్తే…..లండన్ దాకానో ఎందుకు…? మన దేశంలో…, రాష్ట్రంలో ఎన్ని కోటలు, ఆకాశ హర్మ్యాలు లేవు. చరిత్రలోనే కాదు ఇప్పటికీ ఆ దోపిడీ సాగుతూనే ఉంది. కాకుంటే సుధాకర్ గారు చెప్పినట్లు ఒంటి రంగు తేడా అంతే.

వ్యాఖ్యానించండి