(ఈ రచనను మిత్రులు తిరుపాలు గారి ద్వారా ఫేస్ బుక్ లో చూశాను. ఇది అరుణ్ సాగర్ గారి రచన. షేర్ చేయాలనీ, ప్రచారం చేయాలనీ ఆయనే కోరినందున ప్రత్యేక అనుమతి అవసరం లేదన్న భరోసాతో అడగకుండానే ప్రచురిస్తున్నాను. -విశేఖర్)
డియర్ చె. మమ్మల్ని క్షమించు. ఓ అజ్ఞాని చేసిన అపచారానికి, దాన్ని ఆనాడే నిలదీయకుండా లైటు తీసుకున్న మా అలసత్వాన్ని క్షమించు. నువ్వు నలుగురికి కొత్తగా పరిచయమవుతావనీ నువ్వు కొన్ని కొత్త హృదయాలను వెలిగిస్తావనీ నువ్వు కొన్ని కొత్త ఆవేశాలను రగిలిస్తావనీ ఆశతో ఆకాం క్షతో సహించాం. ఇప్పుడిక తాటతీస్తాం.
***
ఎన్నిమాటలు గురూ రెండున్నర గంటలపాటూ టేకులూ రీటేకులూ లేని నటనా వైదుష్యం. యాడికెల్లొస్తారు గురూ, వీళ్లు మనల్ని ఏమనుకుంటారు. పాపం చిన్న జీవితం. బావి చుట్టూ గుండ్రంగా, రౌండుగా ఒక చక్రంలో చిక్కుకున్న ఆ ప్రదేశముందే అదే వారి ఆకాశం. ఆ పదడుగుల నీరే ఆవాసం. పైగా చె గవేరా బొమ్మొకటి. ఎగిరితన్నేవాడు లేకపొతే సరి.
***
ఒక పార్టీ. దానికో విధానం. దానికో పుస్తకం. పర్యావరణం కోసం పాటు పడతాం. రాష్ట్ర ఆవిర్భావం తప్ప వేరే ఏ పండగా జరుపుకోం. అందరూ మంచిగా ఉండేలా సమాజాన్ని మారుస్తాం. వైద్యం అందరికీ సమానంగా అందిస్తాం. మహిళలు నిర్భయంగా తిరిగేలా చూస్తాం. పర్యావరణాన్ని పరిరక్షిస్తాం.- అయిందా? ఇంకేమైనా ఉందా? ఉండదులే. చిన్న మెదడు తప్ప పెద్ద మెదడు ఉండే అవకాశమే లేని చోట ఇంతకంటే గొప్ప ఆశయాలు ఏముంటాయి. ఇవి తప్ప గొప్ప విధానాలు ఉంటాయనే ఆలోచన మాత్రం ఎలా వస్తుంది. అజ్ఞానము ఉపశమించు గాక. తప్పు. పాపము శమించునేమో గానీ, అజ్ఞానము ఉపశమించదు. చీకటి బుర్రలో ప్రమిద వెలిగించాలన్నా కొంచెం ప్లేసుండాలి కదరా అన్నయా. పార్టీ విధానమంటే ఏం చేస్తామో చెప్పడం కాదురా బై, ఎలా చేస్తామో చెప్పడం.
***
ప్రశ్నించడానికే పుట్టాం. కానీ, ప్రశించాల్సినవేవీ ప్రశ్నించం. కన్వీనియంట్ గా ఉండే ప్రశ్నల్నే వేస్తాం. బై ద వే, మమ్మల్ని ప్రశ్నలు వేస్తే మాత్రం సహించం.
***
కానీ గురూ, పర్యావరణ పరిరక్షణ అంటే ఏమిటి? చీపురు పట్టుకుని రోడ్లు ఊడవడమూ, హుసేన్ సాగర్ డ్రెడ్జింగ్ కు బడ్జెట్లకై పోరాడటమా. లేక ప్లాస్టిక్ నిషేధమా. కొందరు సినిమా దైరెక్టర్లను వేదిక ఎక్కించి ఎర్త్ అవర్ పాటించడమా. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడటమంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడటమని వీళ్లకు ఎవరు చెబుతారు. వర్ధమాన దేశాల నీటినీ గాలినీ నేలనీ ఆవరణాన్ని ధ్వంసం చేస్తున్న దోపిడి రూపాలేంటొ కప్పలకు ఎలా తెలుస్తుంది. జెనీవాకు, వియన్నాకు లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్లి నిరసన ప్రదర్శనలతో దేశం కాని దేశంలో ఎందుకు అరెస్టయి జీవితాలు త్యాగం చేసుకుంటారో వీళ్లకు ఎలా అర్ధమవుతుంది. రాష్ట్రాన్ని విడదీసినందుకు కాదురా, దేశాన్ని అణుఒప్పందంతో అమెరికా కాళ్ల దగ్గర పడేసినందుకు కాంగ్రెస్ ను ఓడించాలన్న విశాలదృక్పధం చె గవేరా బొమ్మ పెట్టుకున్నంతమాత్రానే అర్ధమైపోతుందా. పర్యావరణ రక్షనంట! పర్యావరణ రక్షణ!
***
మంచి సమాజం, అందరూ సమానం. ఎన్నెన్ని ఐడియల్స్ గురూ, ఎంత వీజీ గురూ ఎంత కొత్తదనంతో పరిమళిస్తున్నయి గురూ. పార్టీ విధానమంటే స్లోగన్ కాదురా నాయనా ఆచరణ అనీ దానికి ఒక ప్రణాళిక, కార్యక్రమం ఉంటాయనీ ఎలా చెప్పాలితనికి. పైగా తిలక్ కవిత్వం ఎవడో రాసిస్తే చదివేసి, గద్దర్ పాట అర్ధం తెలియకుండా పాడేసి! ముందిది చెప్పు. తెలంగాణా పోరాటం ఎందుకు జరిగిందనుకుంటున్నావో చెప్పు. అసలు నీకు పెద్దమనుషుల ఒప్పందంలో ఏమేమున్నాయో తెలుసా. ముల్కీ అనే మాట విన్నావా. తొక్కలో డైలాగులు నాలుగు విసిరి ఎంటర్టైన్ చేసేస్తే నీ అజ్ఞానానికి మేకప్ వేసినట్టేనని భ్రమపడుతున్నావా! అంబానీల అడ్డగోలు దోపిడీకి అన్నిగేట్లూ ఎత్తేయడానికి సిధ్ధపడ్డవాడిని నెత్తిన పెట్టుకుని అందరూ సమానమయే సమాజం గురించి విధాన ప్రకటన చేస్తున్నవే- మా చెవిలో ఏమైనా కమలం పూవులు కనిపిస్తున్నాయా.
***
సరే కానియ్, ఇవన్నీ పక్కన పెట్టు. నీ నుంచి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలను ఆశించడం వెర్రివాళ్లు చేసే పనే. కాని ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. నీకు కుత్బుద్దీన్ అన్సారీ ఎవరో తెలుసా? ఫేస్ ఆఫ్ గుజరాత్ రాయిట్స్ ను నువ్వు గుర్తు పట్టగలవా? గర్భిణుల కడుపులు చీల్చి. కుటుంబాలకు కుటుంబాలను ఇళ్లలో బంధించి సజీవదహనాలు చేసి. వీధిలో బడిలో బేకరీలో కత్తులు గొడ్డళ్లు త్రిశూలాలు చేతబట్టి వెంటాడి వేటాడి నెత్తుర్లు పారించిన రక్తపువాసన నీ ముక్కుకు తెలుసా. మోడీ మీద నమ్మకమంట. తొక్కలోది.
***
వైద్యం అందరికీ సమానంగా! ఎక్కడనుంచి వస్తుంది గురూ. నువు చాలా మంచాయన అని చెబుతున్నా చంద్రబాబు గానీ, ఎవరి తీర్ధాన్నయితే నెత్తిమీద పోసుకుంటున్నావో ఆ మోడీ గానీ ఏం పీకారు? ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్ని నాశనం చేసి, నిధులివ్వక, కార్పొరేట్ ఆసుపత్రుల బొక్కసాన్ని ప్రజాధనంతో నింపేస్తున్న దొంగ ఇన్స్యూరెన్స్ స్కీముల స్కాముల సాముల్ని నెత్తిన పెట్టుకుని నువు మాట్లాడే మాటల్ని ఎవరు నమ్ముతారు. పైగా స్కాంస్టర్ ని పార్టీ ఫినాన్సియర్ గా పెట్టుకుని తొక్కలో సద్దులు చెబితే నమ్మడానికి జనం వెర్రిగొర్రెలనుకున్నావా.
***
బాసూ నువ్వింత నాటకం ఆడకుంటే బాగుండేది. సామాన్యుడు సామాన్యుడు అంటూ దొంగజపం చేస్తూ ఇన్ని కోట్ల ఖర్చుతో హైటెక్ పార్టీ లాంఛ్ చేయకుంటే బాగుండేది. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేశావు. సొమ్ము నీది కాదు కాబట్టి పెద్ద ఫరకేం పడదు. నువు మాత్రం ఏం చెయగలవు. నీ డిరెక్టర్ ఫాల్టది. బహుశా మోడీ గారు ఇలాగే కోరి ఉంటారు. ఈ నాటకం అంతా ఆడి సినిమాటిక్ గా ఈ ట్విస్టు ఇవ్వమని చెప్పి ఉంటారు. పిచ్చిజనులు కాదు గురూ పచ్చి నాటకాలను కూడా కచ్చితంగా పసిగట్టగల చైతన్యశీలురు. నీ వినోదాత్మక ప్రసంగంలోనే కనిపెట్టారు. నీ ముందూ వెనుకా నిన్ను నడిపించే శక్తులెవరో, ఈ కార్పొరేట్ రాజకీయ క్రీడలో నీ స్పాన్సర్లెవరో జనం సులభంగా గ్రహించారు.
***
చరిత్రలో ఇది మామూలే. పెట్టుబడి వేసే ఎత్తుగడల్లో భాగంగా చాలా మంది సిఖండులు రకరకాల స్థలకాలాల్లో ఇలా అవతారమెత్తి ఆపై పని కాగానే అలా సర్దుకుంటారు. ఇప్పుడు పెట్టుబడికి మోడీ కావాలి. అతనికోసం రకరకాల రూపాల్లో పాత్రల్లో తెరమీదకు తోలుబొమ్మలు రావాలి. కాగల కార్యం తీర్చాలి. అలాంటి కేరక్టరే ఇది. కాకపోతే ఇది తెరమీది పాత్ర కాదు, అంతే తేడా. నటనొక్కటే కామన్.
***
ఎంత మోసగాడివి! మోసగాడు సినిమాలో మీ అన్నయ్య నటించాడు. నువ్వేమో చె గవేరా బొమ్మలు పెట్టుకున్నావ్, శివసాగర్ కవిత్వం చదివావ్, తిలక్ ని కోట్ చేశావ్, కొమురం పులి సినిమా టైటిల్ పెట్టుకున్నవ్. నీ గురించి ఊహించుకున్నదొకటి, నువు చేసిందొకటి. అంటే ఇంతవరకూ నువ్విచ్చింది ఓ బిల్డప్ అన్నట్టు. పెద్ద బిల్డప్! బకరా బనాలియా హం కో. బద్దలై పోయింది. నిజరూపం బట్టబయలైపోయింది గురూ. ఇదొక స్కెచ్. ఆ స్కెచ్ లో నువ్వొక గీత. రెండు సినిమాలు ఫ్లాపయితే చెరిగిపోయే గీత. నీక్కూడా తెలిసి రావాలిలే. నీ సీను తరిగిన రోజున నీకేసి గల్లీ లీడరు కూడ చూడడని తెలిసే-నీ రోజు నీకుంది అన్నయా. లేదా మీ అన్నయ్యను చూస్తే అర్ధమవుద్ది.
***
సంఘ్ పరివార్ వాళ్లు ప్రతి దానికీ గొడవ చేస్తారు. పోస్టర్ లో కృష్నుడికి కళ్లజోడు పెడితే గొడవ. రాముడి ఫొటో టీ షర్ట్ మీద వేస్తే గొడవ. హిందూదేవతల బొమ్మ లేడీస్ హాండ్ బాగ్ మీద ఉంటే గొడవ. కానీ మేం అలా కాదు. చె బొమ్మలు టీ షర్టుల మీదా, బీరు మగ్గుల మీదా, సిగార్ పెట్టెల మీదా అఖరికి హవాయి చెప్పుల మీద ఉన్నా మేం ఫీలవలేదు. అతన్ని ధరించడం ఫాషనైనందుకు గర్వపడ్డాం. కానీ గురూ పొరపాటు చేశాం. ప్రతి గొట్టం గాడూ చె ఫొటో పెట్టుకోడాన్ని చూసి ఊరుకొని పొరపాటు చేశాం. ఆనాడే నీకేంతెలుసని అడిగుంటే, నీ జ్ఞానమేంటో ప్రశ్నించిఉంటే ఇప్పుడిలా మోసపోయేవాళ్లం కాదు. ఆత్మల మీద నమ్మకం లేదుగానీ, చె గవేరా బాధతో కుమిలిపోతున్నాడు. నినదించే గొంతులో వినిపించే రూపం. నిర్బంధకాండకు ఎదురొడ్డే గుండెలపై వికసించాల్సిన చిత్రం-ఇలా అమానవీయ మతోన్మాద జాత్యహంకార రక్కసికి మొక్కినవాడి చేత చిక్కినందుకు అవమానభారంతో కుంగిపోతున్నాడు.
***
బెటర్ లేట్ దేన్ నెవర్. ఇప్పుడొక బహిరంగ హెచ్చరిక. ముందు నీ ఇంటి గోడ మీద చె బొమ్మ తీసెయ్. నీ సినిమాల్లో సెట్ ప్రోపర్టీల్లో చె బొమ్మను ఎడిట్ చేసెయ్. నువ్వు మోడి తీర్ధం తాగుతావో, చంద్రబాబు స్పాన్సర్డ్ పాట పాడుకుంటావో నీ ఇష్టం. బట్. చె కి దూరంగా ఉండు. నీకిక ఆ అర్హత ఏ మాత్రమూ లేదు. నీకే చెబుతుంది! వినిపిస్తుందా?
***
డియర్ చె. మమ్మల్ని క్షమించు. ఓ అజ్ఞాని చేసిన అపచారానికి, దాన్ని ఆనాడే నిలదీయకుండా లైటు తీసుకున్న మా అలసత్వాన్ని క్షమించు. నువ్వు నలుగురికి కొత్తగా పరిచయమవుతావనీ నువ్వు కొన్ని కొత్త హృదయాలను వెలిగిస్తావనీ నువ్వు కొన్ని కొత్త ఆవేశాలను రగిలిస్తావనీ ఆశతో ఆకాంక్షతో సహించాం. ఇప్పుడిక తాటతీస్తాం.
-అరుణ్ సాగర్

Reblogged this on ugiridharaprasad.
టి.వి లల్లొ అంధమైన అమ్మయిలచేత గురజాడ గురించి, కంధుకురి విరేశలింఘం గురించి, ఇంకా ఘంటశాల పాటల గురించి వాటి అందాలగురించి, మొదలైన వాటి గురించి అలఓకగా మాట్లాడేస్తుంటారు , అంతమాత్రం చేత వాళ్ళకు తెలుసనుకొగలమా? యవరొ రాచ్చిన స్కిప్ట్ అక్కడ చదివి వినిపిస్తుంటారు. అది వాళ్ళ ఉద్యొగ ధర్మం , అంతకుమించి దానిపైన ఆసక్తి వుండదు. పవంకల్యాన్ లాంటి చిల్లర దగాకొరు , పిచ్చిపట్టిన {ఇలాంటి విశేషణాలకు అర్హుడు} దొంగ వైద్యులు కొట్లమంది వచ్చారు పొయారు. తాము చేసేవాటిని నిజంగా నమ్మి ఊహాస్వర్గ కమ్యునిస్టులు పొయర్ లాంటి వాళ్ళు తమజీవితాలనే త్యాగం చేశారు. కానీ ఇలాంటి స్వర్దపరులు ముఖ్యంగా సినిమా నటులు తమను అనుసరించే అభిమానులు ఉన్నంతవకూ యలాంటి పిచ్చికుతలు కుయడానికైనా వెనుకాడరు. వాటి పిచ్చిప్రెలాపణలు అర్దం చేసుకునే అత్యధిక ప్రజలు లేరు వాటి గురించి వివరించాల్సిన కమ్యునిస్టు పార్టీలు వాటిల్లొనే కల్సిపొయాయి.
pawan modi ni kalavadame kada me e kopam ki kaarannam ?? che ni antha ga avamana pariche panulu inka pawan emi cheyyaledhu ani na opinion…may be konni chinna chinna mistakes evaina chesi undavchu….adhi sahajam…
pk dont have a clarity of mind, may be first of this kind who trying to mix communism with fascism. how can he meet modi and same time use che pics. confused guy. some one go and teach him
కొంత మంది మహాత్ముల గూర్చి తెలుసుకోకుండా మాట్లాడటమూ, వారిని విమర్శించటమూ మన దేశములో ఉన్న దౌర్భాగ్య స్థితి.కానీ చెగువేరా గూర్చి చాలా మందికి తెలియదు.వెసవిలో రుమాలు వాడినంత సులబంగా , విప్లవం అంటే ఆయన పేరు వాడటం అలవాటైంది.
మిత్రులు కొన్ని సందర్బాలలో చె.గారి గూర్చి పోస్త్స్ పెట్టినా అందరూ, చదవరు