తమ్ముడూ పవనూ, నీ కాల్మొక్త!


Pavan Kalyan

ప్రముఖ జర్నలిస్టు జి.ఎస్.రామ్మోహన్ గారి ఫేస్ బుక్ ఖాతా నుండి దీన్ని సంగ్రహించాను. కొత్త ఓట్ల బిచ్చగాడు పవన్ కళ్యాణ్ గారి సర్కస్ ఫీట్లను సంక్షిప్తంగా వివరిస్తోంది.

*********

తమ్ముడూ పవనూ,

ఏమన్నా జేస్కో, ఎవురితోనన్నా కలువ్‌, నీ ఇష్టం. కానీ చే బొమ్మ పక్కన మాత్రం మోదీని పెట్టమాకయ్యా! నీకు పుణ్యముంటది.

బాంచెన్‌ నీ కాల్మొక్త! భగత్‌ సింగ్‌ పక్కన కూడా వద్దయ్యా!

పాటలెన్నైనా పాడుకో! గబ్బర్‌ సింగ్‌ పాటలే పాడుతవో, గద్దర్‌ పాటలే పాడుతవో నీ ఇష్టం.

నీకు ఊపు కావాల, ఉత్సాహం కావాల, చేతులు కాళ్లూ ఊపుకోవడానికి రిథమ్‌ కావాల, పాడుకో. జల్సా జేస్కో. ఏమన్నా జేస్కో.

ఆ పుటవా మాత్రం, ఆ మోదీ పుటవా మాత్రం ఆళ్ల పక్కన పెట్టమాకు బాబయ్యా! బాంచెన్‌ నీ కాల్మొక్త.

*********

“బుజ్జి పిల్ల – తెల్ల పిల్ల” పేరుతో జి.ఎస్.రామ్మోహన్ గారు సారంగ వెబ్ పత్రికలో ఒక విమర్శ రాశారు. పెట్టుబడి ప్రవేశపెడుతున్న సాంస్కృతిక పతనంలోని ఒకానొక కోణాన్నిఒక సినిమాలో పాట ఆధారంగా చక్కగా వివరించారు. కింద ఇచ్చిన లింక్ లోకి వెళ్ళి ఆ వ్యాసాన్ని చదవొచ్చు.

బుజ్జి పిల్ల తెల్ల పిల్ల

3 thoughts on “తమ్ముడూ పవనూ, నీ కాల్మొక్త!

  1. గువేరాని కొందరు Carnicero de La Cabaña (butcher of the cabin) అని పిలిచారు. ఇదెలా జరిగిందో వివరించగలరా?

  2. విశేషజ్ఞ గారూ

    లా కబానా అనేది క్యూబాలో ఒక జైలు. క్యూబాలో బాటిస్టా నియంత్రుత్వ ప్రభుత్వాన్ని కూల్చేశాక ప్రజల్ని కాల్చుకు తిన్న మిలట్రీ జనరల్స్, భూస్వాములు, ఇతర రియాక్షనరీ ఎలిమెంట్స్ ని ఆ జైలులో వేశారు. జనంపై తీవ్ర హింస ప్రయోగించినవారికి మరణ శిక్షలు అమలు చేశారు. ప్రభుత్వంలో గువేరాకు అప్పగించిన బాధ్యతల రీత్యా ఈ మరణ శిక్షల్లో కొన్ని ఆయన హయాంలో జరిగాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని అమెరికా, ఐరోపా పశ్చిమ మీడియా గువేరాకి ఆ పేరుతో పిలుస్తూ సంతృప్తి పడతాయి. గువేరాను వెంటాడి వెతికి వెతికి పట్టుకుని చంపింది అమెరికాయే. అమెరికా మద్దతుతో నడుస్తున్న నియంతలకు వ్యతిరేకంగా నిలబడ్డ చే గువేరాను అప్రతిష్ట పాలు చేయడం అమెరికా అవసరం. మావో, పోల్ పాట్, స్టాలిన్ లకు వ్యతిరేకంగా చేసిన దుష్ప్రచార పద్ధతులనే గువేరాపైన కూడా ప్రయోగించారు. అంతకు మించి అందులో మర్మం ఏమీ లేదు.

  3. సాంరాజ్య వాద దుర్మార్గులకంటె అత్యంత దారునంగా యువత మనస్తత్వాలను కలుషితంచేసి సొమ్ము చేసుకుంతునా వారు సెలబ్రిటీలు. ఈ సెలబ్రిటీలను ఎందుకైనా వాడుకునేది రాజకీయ నాయకులు.
    ఈ కింది లింక్‌ చధవండీ.
    https://www.facebook.com/arun.sagar.9440

వ్యాఖ్యానించండి