లగడానంద స్వామి -టి.వి9 సెటైర్ (వీడియో)


వెక్కి వెక్కి ఏడ్చి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న దరిమిలా లగడానంద స్వామిగా అవతరించిన రాజగోపాల్, ఆఫీసుల్లో నిద్ర చెడగొట్టడమే కాకుండా సోనియా శివుడి వద్ద షిండే నందిచే తన్నించుకున్న అశోక్ బాబు, లాస్ట్ బాల్ లేదు, వేస్ట్ బాల్ మాత్రమే అంటూ బాల్ జేబులో పెట్టుకొని పోయిన కిరణ్ కుమార్ రెడ్డి… ఇత్యాది సెటైర్లతో టి.వి9 ప్రోగ్రామ్ ‘బుల్లెట్ న్యూస్’ మహా వినోదం పంచింది.

తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. బహుశా తెలంగాణ ఉద్యమం పైన టి.వి9 రూపొందించిన గొప్ప ప్రోగ్రామ్ ఇదే కావచ్చు. ఫిబ్రవరి 19 మధ్యాహ్నం ప్రసారమయింది.

4 thoughts on “లగడానంద స్వామి -టి.వి9 సెటైర్ (వీడియో)

  1. ప్రసారమాధ్యమాలు వాణిజ్యపరంగా మదమెక్కిన వినోద సాధనాలు. రాజకీయాలంటే ఇక కల్లు తాగిన కోతి. ప్రేక్షకుల ముందు వారి ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించి స్వయం మిధునంలో పులకిస్తారు, ప్రేక్షకులు తిలకిస్తారు. ఒక కంటితో చూసి మరో కంటితో జారవిడుస్తారు కానీ ఒంటికి పట్టించుకునే కాలం పోయింది. ఇటీవల కొన్ని మాధ్యమాలు వారి సిబ్బందితో వెర్రి కార్యక్రమాలు రూపొందించి ప్రెక్షకులలో అజ్ఞానానికి ఊపిరిపోస్తున్నాయి. నోట్లకట్టలు వారి ముందుంచి నోళ్ళువెళ్ళబెట్టుకుని కళ్ళప్పగించే స్థాయికి ప్రేక్షకులను దిగజార్చాయి.

  2. తెలంగాణ వ్యతిరేకులను విమర్శిస్తే ఉద్యమంపైన గొప్ప ప్రోగ్రామ్ అయిపోయిందా! చవకబారు విశ్లేషణ

  3. టి.వి9 ఛానెల్ తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను ఎన్నడూ గౌరవించలేదు. మెరుగైన సమాజం కోసం అని చెప్పుకుంటూ యధాతధ పరిస్ధితి సంరక్షణకు పాటుపడింది. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎ.పి.ఎన్.జి.ఒ ఉద్యమ ఓటమిగా రెచ్చగొట్టిన ఛానెల్, తెలంగాణ వ్యతిరేకులపైన, అది కూడా తాను ఎప్పుడూ నెత్తిన పెట్టుకునే లగడపాటి పైన సెటైర్ వేయడం గొప్ప ప్రోగ్రాం కాదా మరి. ఆ గొప్పతనం అన్నది విమర్శించినందుకు కాదు. విమర్శించక తప్పని పరిస్ధితిలో తాను ఉన్నానని సిగ్గువిడిచి చాటుకున్నందుకు.

  4. అయినా లగడానంద స్వామి గురించి మరీ పొగిడి పొగిడి వ్యాఖ్యా (వ్యంగంగా) నించిన సటైర్‌ చాలా బాగుంది- సమైక్యం సమైక్యం అని ఇప్పుడు అనైక్యం అనైక్యం అనటం

వ్యాఖ్యానించండి