అరవింద్ కేజ్రీవాల్ పని తీరు (వర్కింగ్ స్టైల్) పైన సున్నితమైన విమర్శ ఈ కార్టూన్.
CLEANING OF AUGEAN STABLES అనే ఆంగ్ల వాడుకను కార్టూనిస్టు ఇందులో వినియోగించారు.
ఆజియన్ అనే ఆయన గ్రీకు పురాణాల్లో ఒక రాజు. ఆయన వద్ద స్వర్గం నుండి ప్రసాదించబడిన పశు సంపద భారీగా ఉండేదిట. భారీ సంఖ్యలో ఉన్నందున వాటి విసర్జనాలు కూడా పెద్ద మొత్తంలో ఉండేవి. అందువలన ఆయనగారి పశువుల కొట్టాన్ని శుభ్రం చేయడం ఎవరికైనా అసాధ్యం.
హెర్క్యూలియస్ అనే యోధుడిని పరీక్షించడానికి 12 రకాల పనులు చేయాలని ఆదేశించినట్లు గ్రీకు పురాణాలు చెబుతాయి. ఆ పన్నెండులో 5వ పని ఆజియన్ పశువుల కొట్టాన్ని సమూలంగా శుభ్రం చేయడం. అందుకు ఒక్క రోజు మాత్రమే ఆయనకి ఇవ్వబడుతుంది. దాన్ని ఆయన పూర్తి చేస్తాడు. అది వేరే విషయం.
అత్యంత దుర్గంధ పూరితమైన, భారీయైన, అసాధ్యమైన పనిని అప్పగిస్తే దానిని “Cleaning of Augean Stables” గా చెప్పడానికి ఈ కధ మూలం.
అరవింద్ కేజ్రీవాల్ తలపెట్టిన (లేదా అప్పగించబడిన) కార్యం కూడా అలాంటిదే. అవినీతితో ఆమూలాగ్రం కుళ్ళిపోయిన వ్యవస్ధ నుండి అవినీతిని తుడిచి పెట్టడం అంటే ఆజియన్ పశువుల కొట్టాన్ని శుభ్రం చెయ్యడంతో సమానమని కార్టూనిస్టు పోల్చారు.
అయితే ఆ పనిని కేజ్రీవాల్ తనదైన స్టైల్ లో చేస్తున్నారని కార్టూనిస్టు విమర్శ. ఆ స్టైల్ ఎలాంటిదంటే, దానివల్ల కొట్టం శుభ్రపడడం అటుంచి పశువులే చస్తున్నాని విమర్శిస్తున్నారు. ఒక ఫిరంగి సాయంతో పశువుల కొట్టం పూడ్చితే ఏమవుతుంది? కొట్టం శుభ్రపడడం ఏమో గానీ పశువులు చచ్చిపోతాయి. అరవింద్ పనితీరు అలా ఉండని కేశవ్ విమర్శ!
నేను దీనితో ఏకీభవించడం లేదు. ఇప్పటిదాకా ఆయన తీసుకున్న చర్యలన్నీ అవసరమే అని నా అభిప్రాయం. ఆయన ఉద్దేశ్యం, లక్ష్యం గురించి నేను చెప్పలేను గానీ, ఆయన తీసుకున్న చర్యలు ప్రతిపాదిత లక్ష్యాన్ని చేరితే గనుక అవి నిస్సందేహంగా ప్రజలకు లాభం చేకూర్చుతాయి.
అయితే అరవింద్ తలపెట్టిన కార్యం Cleaning of Augean Stables తో సమానం అన్న పోలిక మాత్రం నిజమే.

కేజ్రీవాల్ దూకుడు మహా అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల దాకా కొనసాగుతుంది. ఆ తరువాత తుస్సుమనడం ఖాయం అని నేననుకుంటాను.
Nice :-)
అస్త్ర సన్యాసం చేసేశాడు