పుడమి వేడికి తల్లడిల్లిన ఇంధ్ర ధనుస్సు
ఓజోన్ గొడుగు లేక నీటి మడుగున దాగిందా?
నీటి మడుగున దాగిన ఇంద్రచాపం
రంగుల వేళ్ళు చాచి ఊపిరి కోసం ఉపరితలాన్ని చేరుతోందా?
నీటి గర్భం చీల్చుకున్న రంగుల ఉమ్మనీరు
కొత్త ఊపిరి రాకను చాటుతోందా?
హ్రదయ జలధిని వీడిన భావ తరంగం
ఆనంద నాట్యంతో అంచులు దాటి పొర్లుతోందా?
గుండె గుండం పేలిపోయి విలయ గండం ప్రకటిస్తోందా?
జ్ఞానం కూరిన మెదడు మందుగుండు హాఛ్ మని తుమ్మిందా?
దీర్ఘ నిద్రను వీడిన బొచ్చు పురుగు
రంగుల కోక తొడిగి వొళ్ళు విరుస్తోందా?
… … … …
… … … …
ఈ కింది వీడియోను, ఫోటోలను చూశాక నా మనసులో మెదిలిన వరుస భావాలివి.
***
మార్క్ మాసన్ అనే ఒక బ్రిటిష్ దేశస్ధుడు నీటి అడుగున సృష్టించిన వర్ణ చిత్రాలు బాగా పాపులర్(ట!) నీటి మడుగుల్లో రంగులు దట్టించి నియంత్రిత పేలుళ్లు జరపడం ద్వారా ఒకదానికొకటి రాసుకుంటూ, కలుసు కుంటూ, దూరిపోతూ, బైటపడుతూ విన్యాసాలు చేసే రంగుల మేఘాలను సృష్టించడం ఒక కళగా ఈయన అభివృద్ధి చేసినట్లు కనిపిస్తోంది.
“ఈ కళ ఎంత పాపులర్ అంటే బ్రిటిష్ రాణి డైమండ్ జూబిలీ ఉత్సవాలకు బ్యాక్ డ్రాప్ గా ప్రదర్శించినంత” అని డిజైనర్ బరస్ట్ అనే వెబ్ సైట్ చెబుతోంది. బ్రిటిష్ రాణి డైమండ్ జూబిలీ ఉత్సవాల సందర్భంగా సర్ పాల్ మెక్ కార్టినీ అనే పెద్దాయన బకింగ్ హామ్ ప్యాలస్ వద్ద ప్రదర్శన ఇవ్వగా, ఆ ప్రదర్శనకు స్టేజీ వెనుక బ్యాక్ డ్రాప్ గా ఈ రంగుల మిశ్రమ పేలుళ్ళ వీడియోను ఎంచుకున్నారని ఈ వెబ్ సైట్ సమాచారం. దీనిని Aqueous Rainbow Skies అని వెబ్ సైట్ పేరు పెట్టింది.
అదో సమాచారం అయితే కావచ్చు గానీ, ఈ వీడియో, ఫోటోలు చూశాక వివిధ రకాల భావాలు మనల్ని చుట్టేయడం తప్పనిసరి. ఫోటోలు ఒక క్షణకాల దృశ్యాన్ని మాత్రమే చూపుతాయి. కింద ఉన్న వీడియోను కూడా చూడగలిగితే విచిత్రమైన, చెప్పలేని భావాలు ఖచ్చితంగా పుడతాయి. ఆ భావాలకు మనం అక్షర రూపం ఇవ్వగలగడమే ఇక మిగులుతుంది. ఇవ్వకపోయినా ఫర్వాలేదు. అసలా భావాలను ఒకసారి తట్టి చూసినా చాలు.
‘ఏముండక్కడ, ఓ అరడజను రంగులు పొగలాగా తేలుతూ కనిపిస్తున్నాయి, అంతేగా, అంటారా?’ అయితే చెప్పేదేమీ లేదు.









`చాలా బాగుంది` అనే మాట చాలా చిన్నది.
ధన్యవాదాలు వర్మ గారు!
Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: ఇంద్రధనుస్సు పారిపోయి నీటి మడుగున దాగిందా? | ugiridharaprasad
పోటీ పడుతోంది, నింగి లోని ఇంద్ర ధనుస్సు తో,
నీటిలోంచి లేచిన ‘మానవ మేధస్సు’ !
Wow! That’s another thought.
నీటి అడుగున సృష్టించిన రంగులపై మీ కవితాత్మక స్పందన చాలా బాగుంది!
ఇంకా రాలేదేమిటి చెప్మా అనుకుంటున్నాను. వచ్చేశారా వేణు గారూ! ధన్యోస్మి.
నీటి గర్భం చీల్చుకున్న రంగుల ఉమ్మనీరు
కొత్త ఊపిరి రాకను చాటుతోందా?…….. చాలా అద్భుతంగా చెప్పారు శేఖర్ గారు. మీ ఊహా శక్తికి జేజేలు.
మనసులోని వేల ఆలోచనల కలబోతలా
మష్తిష్కంలోని అనంత భావాల సంఘర్షణలా…..
కారు చీకటిని చీల్చుకుంటూ….వచ్చే సరికొత్త ఉషోదయంలా…….
అయబాబోయ్…నాక్కుడా కవిత్వం జబ్బు సోకిన లక్షణాలు కనిపిస్తున్నాయి.
కదూ!