కొన్నది ఒక్క ఫస్ట్ క్లాస్ విమాన టిక్కెట్, తిన్నది 300 పూటలు


china_eastern_airlines

ఓ చైనీయుడి తెలివితేటలివి. ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ విమాన టిక్కెట్ కొని, అదే టికెట్ పైన 300 రోజులు ఫస్ట్ క్లాస్ ఉచిత భోజనం ఆరగించాడా పెద్ద మనిషి. కొన్నది ఒక్క ఫస్ట్ క్లాస్ టికెటే. కానీ ఆయన తిన్నది మాత్రం 300 భోజనాలు! అదెలాగో తెలిస్తే ఈర్ష్య కలగడం ఖాయం!

ఎకానమీ క్లాస్ టికెట్ కొన్నవారికి ఉచిత భోజనం పెడతారో లేదో తెలియదు గానీ ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నవారికి మాత్రం ఒక మృష్టాన్నభోజనాన్ని ఉచితంగా పెడతారట ఈస్ట్రన్ చైనా ఎయిర్ లైన్ వాళ్ళు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని అదే టికెట్ తో మళ్ళీ మళ్ళీ వచ్చి 300 రోజుల పాటు బ్రహ్మాండమైన భోజనం తిన్నాడు ఒక చైనా వ్యక్తి. ఆయన పేరేమిటో వార్తా సంస్ధలు చెప్పలేదు.

ఈస్ట్రన్ చైనా ఎయిర్ లైన్ కు చెందిన విమానంలో విదేశాలకు వెళ్లడానికి ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాడు. ఆ తర్వాత అదే టికెట్ ని మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకున్నాడు. విమానయాన సంస్ధలు ప్రయాణీకులని కాపాడుకోవడానికి ఒకవేళ ప్రయాణం వాయిదా పడితే అదే టికెట్ ను వాయిదా పడిన తేదీకి బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ సౌకర్యం ద్వారా ఆయన 300 సార్లు ప్రయాణం వాయిదా వేసుకున్నానని చెప్పి రీ-బుక్ చేశాడు.

విమానయాన సంస్ధ వారు ఇచ్చిన మరో సౌకర్యం ఏమిటంటే ప్రయాణం రద్దయితే/వద్దనుకుంటే టికెట్ సొమ్ము పూర్తిగా తిరిగి చెల్లించడం. కాబట్టి రీ-బుక్ చేసుకున్నా అదనంగా చెల్లించేదేమీ ఉండదు.

ఈ రెండు సౌకర్యాలను మన పెద్ద మనిషి చక్కగా ఎక్స్ ప్లాయిట్ చేశాడు. ఆ సౌకర్యం-ఈ సౌకర్యం అనీ, ఆ రాయితీ-ఈ రాయితీ అనీ చెబుతూ విమానయాన కంపెనీలు ప్రయాణీకులను ఆకర్షించడం, వారి ప్రయాణ అవసరాలని సొమ్ము చేసుకోవడం సహజంగా జరిగే, అందరికీ తెలిసిన ఎక్స్ ప్లాయిటేషన్.

కానీ మన గడుగ్గాయి మాత్రం వారి ఎత్తుగడని వారికే తిప్పికొట్టిన ఘనాపాటి అని అర్ధం అవుతూనే ఉంది.

ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాక షాంక్సీ రాష్ట్ర ఎయిర్ పోర్ట్ లోని వి.ఐ.పి లాంజ్ లోకి ప్రవేశించేవాడు. ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులకి ఇక్కడ ఉచితంగా భోజనం పెడతారు. లాంజ్ సిబ్బంది వచ్చినపుడు తన వద్ద ఉన్న ఫస్ట్ క్లాస్ టికెట్ ను దర్జాగా ఊపుతూ చూపడం ఆనక సుష్టుగా భోంచేసి బయటపడడం. ఇదీ ఆయన పాటించిన సూత్రం. భోజనం చేశాక విమానం ఎక్కకుండా తన టికెట్ ను మరో తేదీకి వాయిదా వేయించి చక్కా వెళ్లిపోయేవాడు. మళ్ళీ ఆ తేదీకి వచ్చి టికెట్ ని చూపడం, భోజనం చేయడం, ప్రయాణం వాయిదా వేయడం.

ఈ విధంగా 300 భోజనాల ఖరీదు విమాన టికెట్ ని మించిందో లేదో తెలియదు. మించే ఉండాలి. ఫస్ట్ క్లాస్ భోజనం అంటే మాటలు కాదు కదా! భోజనం ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటే ఆయన మళ్ళీ మళ్ళీ అక్కడే భోజనం చేస్తాడు!

ఒక సంవత్సర కాలంలో ఒకే టికెట్ 300 సార్లు రీ-బుక్ కావడం గమనించిన తర్వాతనే మానవాడి భోజన ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. గమనించిన వెంటనే ఈస్ట్రన్ చైనా ఎయిర్ లైన్స్ అధికారులు ఆయన్ని అడ్డుకుని తగాదా పడ్డారట. దానితో ఆయన టికెట్ వెనక్కి ఇచ్చేసి తన డబ్బు తాను తీసేసుకుని చక్కా వెళ్లిపోయాట్ట!

ఈ వ్యక్తి చేసిన పనికి తాము చర్య తీసుకోగల పరిస్ధితిలో లేమని ఈస్ట్రన్ చైనా ఎయిర్ లైన్స్ వాళ్ళు చెప్పారని ఔట్ లుక్ పత్రిక తెలిపింది. ఏం చేస్తారు? చట్టం ప్రకారం ఆయన చేసిన నేరం ఏమీ లేదు. నైతికంగా తప్పేగా అనొచ్చు. కానీ ఎయిర్ లైన్స్ కంపెనీలు చేసే అనైతిక దోపిడితో పోలిస్తే ఈయన చేసింది తప్పే కాదు. పైగా తగిన గుణపాఠం అయినా కావచ్చు.

ఈ సంగతి బైట పెట్టింది చైనా పత్రికలు కాదు. ‘క్వాంగ్ వా యిట్ పో’ అనే మలేషియా పత్రిక. ఈ వార్త దాదాపు ప్రతి జాతీయ, అంతర్జాతీయ పత్రికా ప్రచురించడం విశేషం. కానీ ఏ పత్రిక చూసినా ఒకటే సమాచారం, ఒకటే పదాలు, ఒకటే వాక్యాలు. ఔట్ లుక్ పత్రిక ఈ వార్తను బీజింగ్ డేట్ లైన్ తో ప్రచురించడం మరో విశేషం.

2 thoughts on “కొన్నది ఒక్క ఫస్ట్ క్లాస్ విమాన టిక్కెట్, తిన్నది 300 పూటలు

  1. భలేగా బుద్ది చెప్పాడు. ఆయనెవరో కానీ గుండెలు తీసిన బంటులా ఉన్నాడు. మన దగ్గరా….ఫ్రీగా ఆఫర్లు అంటూ ప్రకటించే కంపెనీలకు ఇలాగే బుద్ది చెబితే బాగుంటుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ

  2. Even Ram Jethmalani Cheated in Land Deal

    Former Union law minister and senior Supreme Court lawyer, Ram Jethmalani (91) has complained to the Chennai city police that a real-estate dealer has cheated him of Rs7 crore. Mr Jethmalani, and his two friends in Delhi, had approached a real-estate broker in Nungambakkam whom they had identified through a website. They asked him to show them properties in prime areas in the city. The man collected Rs7 crore from them under the pretext of paying an advance to a landowner, but never got the land registered on their names. Whenever Mr Jethmalani and his friends tried to ask for the money, the dealer would dodge and suggest a few other properties instead. Finally, when they insisted on getting the money back, he vanished.

    http://www.moneylife.in/article/even-ram-jethmalani-cheated-in-land-deal/36062.html

వ్యాఖ్యానించండి