టఫ్ గై: ఆడా మగా, ముసలి ముతక తేడాయే లేదు -ఫోటోలు


ఇంగ్లండ్ లోని పెర్టన్ లో జరిగే పోటీలివి. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పోటీ అని కూడా దీన్ని చెబుతారట. అత్యంత కఠినమైన పరీక్షల్ని పెట్టే ఈ పోటీ ప్రతి సంవత్సరం జరుపుతారని తెలుస్తోంది. చిత్రం ఏమిటంటే ప్రతేడూ వేలాది మంది ఇందులో పాల్గొనడం. ఆడా, మగా; ముసలి, ముతకా అన్న తేడా లేకుండా ఈ పోటీల్లో పాల్గొనడం నిజంగా అబ్బురమే.

అబ్బురం ఎందుకో ఈ ఫోటోల్ని చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ పోటీల నుండి బైటపడ్డవారు ఖచ్చితంగా ఏదో ఒక సమస్యతో బైటికి రావడం ఖాయం. చూడబోతే భూమి మీద ఎన్ని కష్టాలైతే ఉన్నాయో అన్నీ ఈ పోటీలో ఎదుర్కుంటారులాగుంది. లేకపోతే ఇన్ని పరీక్షలా? ఆ జాబితా చూడండి:

ముళ్ళ కంచెలు (barbed wire), కత్తి కోతలు, చర్మం గీకుడు (తోలు తీయడం అన్నట్లు), కాలిన గాయాలు, డీ హైడ్రేషన్ (దప్పికతో అలమటించడం), హైపోధర్మియా (శరీరం మామూలుగా పని చేయగల ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో బతికినప్పుడే కలిగే ప్రభావం), ఏక్రో ఫోబియా (ఎత్తైన చోట్లకు వెళ్లాల్సి రావడం వల్ల కలిగే భయం), క్లాస్ట్రోఫోబియా (చాలా ఇరుకైన చోట్ల ఎటూ వెళ్లడానికి మార్గం లేని స్ధితిలో పుట్టే భయం), విద్యుత్ షాక్ లు, నరాలు మెలిపెట్టడం, శరీర భాగాలని మెలి తిప్పడం, కీళ్ల నుండి ఎముకలు తొలిగిపోవడం, ఎముకలు విరిపోవడం…. ఇవన్నీ ఈ పోటీల్లో పాల్గొనేవారు ఎదుర్కొనే పరీక్షలే.

అంటే దాదాపు ప్రాణాల్నే ఫణంగా పెడుతున్నట్లే. ఇన్ని పరీక్షలని తెలిసి తెలిసి ఎదుర్కోవడం నిజంగా అబ్బురం కాదా మరి! ముఖ్యంగా ఈ పోటీల్లో పెద్దవాళ్ళు, మహిళలు కూడా పాల్గొనడం మహా ముచ్చటగా ఉంది. ఈ టోర్నీ ఆర్గనైజర్ బిల్లీ విల్సన్ ప్రకారం 1987 నుండి జరిగుతున్న ఈ పోటీల్లో ఇంతవరకూ ఎవ్వరూ చివరిదాకా నిలబడలేదట. ప్రతేడూ జనవరి చివర వణికించే చలిలో జరిగే ఈ పోటీల్లో మొత్తం 25 ఆటంకాలు అధిగమించాలి.

దూకాలి, జారాలి, వణకాలి, పాకాలి, వొళ్ళు కాల్చుకోవాలి, చర్మం చీరిపోవాలి, కీళ్ళు తొలిగిపోవాలి, ఎముకలు విరిగిపోవాలి, నరాలు నలిగిపోవాలి… ఇవన్నీ అయితేగాని పోటీ పూర్తికాదు. ఇందులో పాల్గొనేవారు పోటీకి ముందు చావు సంతకం చేయాలిట. అంటే చచ్చినా నిర్వాహకుల బాధ్యత లేదని సంతకం చేయాలి. (ఇంతదనుక ఒక్కరు చనిపోయారు. 2000లో హైపోధర్మియా వల్ల) ఐనా అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో పాటు అనేక దేశాల నుండి ప్రతి యేడూ 5,000 మందికి పైనే ‘టఫ్ గై’ పోటీల్లో పాల్గొంటారట! బాప్ రే, గట్టి పిండాలే మరి!!!   

Photos: The Atlantic

 

One thought on “టఫ్ గై: ఆడా మగా, ముసలి ముతక తేడాయే లేదు -ఫోటోలు

వ్యాఖ్యానించండి