గుత్తేదారులకు అ’ధనం’ చెల్లిద్దాం -కత్తిరింపు


కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ వీరాలాపాలు వల్లిస్తూ కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఒంటరి యోధుడిలా జనం ముందు నిలబడ్డ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన అప్పజెప్పడానికి సిద్ధపడుతున్న వైనం ఇది. ముఖ్యమంత్రి చర్యలను ఆర్ధిక శాఖ అభ్యంతరం చెబుతున్నా వినకుండా 15 నుండి 20 వేల కోట్ల వరకు కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పజెప్పే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారని, ఆర్ధిక శాఖ అభ్యంతరాలను నివృత్తి చేసే సమావేశం సోమవారం జరగనుందని ఈ నాడు పత్రిక సమాచారం.

మీరే చూడండి. (బొమ్మపై క్లిక్ చేస్తే పెద్ద సైజులో చూడొచ్చు.) ఈ వార్త ఆదివారం (జనవరి 26) ఈనాడులో ప్రచురితం అయింది.

Contractors

రాజ్యాంగం సంగతి తర్వాత. ముందు జనం డబ్బును కాపాడడానికి సి.ఎం సిద్ధపడితే అదే పదివేలు కాదా!

సవాలక్ష పేర్లతో కాంట్రాక్టర్లకు ప్రజాధనం కట్టబెట్టి ఆ తర్వాత వారి నుండి పర్సెంటేజీలు వసూలు చేసే అవినీతి కార్యం మొదట మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టింది. అసలు ప్రాజెక్టులు మొదలు పెట్టకుండా కాలవలు తవ్వి, మట్టి పనులు చేసి వేలాది కోట్లు కాజేసిన పుణ్యాన్ని కాంగ్రెస్-ఎన్.సి.పి నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంది. ఈ దోపిడీ పద్ధతి అక్కడి నుండి ఆంధ్ర ప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వరకు విస్తరించి చివరికి మన రాజ్యాంగబద్ధ సి.ఎం దాకా పాకిందన్నమాట!

4 thoughts on “గుత్తేదారులకు అ’ధనం’ చెల్లిద్దాం -కత్తిరింపు

  1. పింగ్‌బ్యాక్: గుత్తేదారులకు అ’ధనం’ చెల్లిద్దాం -కత్తిరింపు | ugiridharaprasad

  2. రాజ్యాంగబద్ద సీఎం…హ హ్హ హ్హ… భలే పేరు పెట్టారు. వీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ ఆ కోణంలో నుంచి చూస్తే చాలా చోట్ల పట్టుబడటం ఖాయం.
    సీల్డ్ కవర్ ద్వాారా…..వచ్చిన వారు కదా….

  3. తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు సుముఖంగా కేంద్రం చర్చలు పెట్టినప్పటినుంచి (లేకుంటే కిరణ్ సీ.ఎం. ఐనప్పటినుంచి) ఇప్పటివరకు కిరణ్‍కుమార్ రెడ్డి ఎన్ని అక్రమ జీ.వో.లు విడుదల చేశారో, ఎన్నెన్ని ఇలాంటి దగుల్బాజీ పనులు చేశారో, ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడో, ఎంత వాటా పుచ్చుకున్నాడో…అన్నీ కేంద్రమే ఒక నిజ నిర్ధారణ కమిటీని వేసి, నిజాల్ని నిగ్గుతేల్చాలి. ’ఇంత గొప్ప రాజ్యాంగబద్ధ సీఎం మనకు దొరికాడ” అని ఆంధ్రప్రజలు మురిసిపోతారు. నెత్తినెక్కించుకుంటారు’!

    జై తెలంగాణ! జై జై తెలంగాణ!

    నా తెలంగాణ కోటి రత్నాల వీణ
    ratnaalaveena.blogspot.in

వ్యాఖ్యానించండి