ది హిందు పత్రిక నుండి నరేంద్ర మోడీకి వచ్చిన ప్రశంసా ఇది?
ప్రధాన మంత్రి పీఠం అధిరోహించేవైపుగా ప్రయాణం చేస్తున్న నరేంద్ర మోడి తన దారిలో ఎదురవుతున్న చిక్కు మూడులను అవలీలగా అధిగమించారని ఈ కార్టూన్ సూచిస్తోంది.
తాడు మీద నడవడం చిన్న చిన్న సర్కస్ విద్యలు ప్రదర్శించేవారు చాలా తేలికగా ప్రదర్శించే విద్య. నరేంద్ర మోడి కేవలం తాడు మీద నడవడమే కాదు, తా తాడుపైన తల కిందులుగా కూడా నడిచి చిక్కు మూడులను అధిగమించారని కార్టూన్ సూచిస్తోంది.
సిట్ దర్యాప్తులో భాగంగా మోడి తమ ముందు హాజరు కావడమే తమ విజయంగా సిట్ అధిపతి ఆర్.కె.రాఘవన్ ప్రకటించుకుంటే, సిట్ విచారణను పూర్తి చేయడం తన విజయంగా మోడి చెప్పుకున్నారు. కంటక ప్రాయం అయిన సంజీవ్ భట్ సాక్ష్యాన్ని, పోలీసు ఉన్నతాధికారి శ్రీ కుమార్ సాక్ష్యాన్ని ‘విశ్వసనీయం కావు’ అని సిట్ బృందం కొట్టేసిన తర్వాత సిట్ విచారణ ఎదుర్కోవడం మోడీకి సులువు కాక ఇంకెలా ఉంటుంది?
విచారణ చేయకముందే మోడి దోషిత్వం లేదా నిర్దోషిత్వం పై ఒక నిర్ణయానికి వచ్చేసిన సిట్ విచారణ మోడీకి పరీక్ష కాగలదా? నేరాన్ని నిస్పాక్షికంగా విచారించడానికి పూనుకోవడానికి బదులుగా ఆ నేర భారం నుండి నిందితుడిని తప్పించడానికే తమను నియమించారా అన్నట్లుగా విచారణ సాగించిన ఆరోపణలు సిట్ ఎదుర్కొంది. అలాంటి దర్యాప్తు బృందాన్ని మోసే లగ్జరీ దక్కేది కొందరికే. బిగుసుకుపోయిన దోపిడీ యంత్రానికి కందనంగా మారడానికి సిద్ధపడితే ఈ దేశంలో అందుబాటులోకి వచ్చే లగ్జరీలు బోలెడు.
వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నీ మాసిపోయాక, మాసిపోవడానికి నిరాకరించిన సాక్ష్యాలను విశ్వసనీయం కాదని కొట్టిపారేశాక దర్యాప్తు బృందం పని ఇంకా సులువు కాలేదా?
మోడి లాంటి పాలకులు ఇప్పుడు చాలా మందికి కావాలి. భారత వనరులను బొక్కడానికి వీలయిన విధానాలను దూకుడుగా అమలు చేసే పాలకులు విదేశీ బహుళజాతి కంపెనీలకు కావాలి. పి.వి.నరసింహారావు, వాజ్ పేయి ల తరహాలో కుదురుగా ప్రభుత్వాల్ని నడిపగల చతురులు స్వదేశీ, విదేశీ ధనిక వర్గాలకు ఇప్పుడు కావాలి. అలాంటి చతురుడిని వారు గుజరాత్ ముఖ్యమంత్రిలో చూడగలుగుతున్నారు. పదేళ్ళకు పైగా గుజరాత్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు వారికి ఆ నమ్మకాన్ని ఇచ్చాయి.
కాబట్టి చిక్కు ముడులు అనివార్యంగా వాటంతట అవే విడిపోతాయి. అందుకు తగిన ఏర్పాట్లను ధనిక వర్గాలు వ్యవస్ధలో ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్, బి.జె.పి ల వైరం జనానికి గానీ ఆ పార్టీల నేతలకు కాదు. వారి తగాదా ఏమన్నా ఉంటే అది అధికారం కోసమే. అధికారం అంటూ ఒకరికి దక్కాక ఇక అందరూ ఒకటే.
మోడి సాగిస్తున్న అద్భుతమైన తాడు నడకలో చిదంబర రహస్యం ఇదే మరి!

http://m.moneycontrol.com/news/politics/chidu-pranab-have-leftdebt-time-bomb-for-next-govt_1016729.html?topnews=1
http://www.forbes.com/sites/meghabahree/2013/08/19/top-indian-companies-burdened-with-debt/
నువ్వు, నీ ఎధవ లాజిక్కులూ.., జనాలను మరీ వి.పి. లనుకుంటారే మీరు. అయినా మీరు మారాలి బాసు. ఈరోజుల్లో చరిత్ర తెలియంది ఎవరికి. మీకు తెలియదని కాదు, ఎవడిష్టం వచినట్టు వాడు వక్రీకరించినా, ఏది నిజమో పోల్చుకునేంతగా జనం, ముఖ్యంగా యువత ఎదిగారు. తమరు ఇకనైనా గమనించాలి మరి. జరిగిన, జరుగుతున్న, దేశం ఎదుర్కుంటున్న సమస్యలు నేను 100 చెప్తాను. అవి నువ్వెందుకు ప్రస్తావించడం లేదో, లేదా మిగిలిన మీడియా ప్రచురిస్తున్నా నువ్వెందుకు ఇక్కడ వక్రీకరిస్తున్నావో చెప్పాలి. నువ్వూ, నీ సోషలిజం మెంటాలిటీ. నీ సోషలిజం జనాల్ని విలువలు, పద్ధతులు లేని పనిముట్లు గానే చేస్తుంది. తగుదునమ్మా అని మావోయిష్టు నీతి సూత్రాలు చెప్పే నువ్వు ప్రపంచంలో ధనికుడైన రాజకీయ నాయకుడెవరో చెప్పగలవా. దమ్ముంటే దీన్ని ప్రచురించి నాతో డిబేట్ కి రా. ఇక్కడున్న 10 మందిలో కనీసం ఒక్కరు కూడా నీలాంటి వారికి ఆకర్షితులు కాకూడదనే నా తాపత్రయం.
నువ్వూ నీ చచ్చు సవాళ్లూ! పది మంది సంగతి తర్వాత, ముందు నీ సంగతి చూడు. తమరు ఇప్పటికే వి.పి ఐపోయారు. తమరే ఇంకా గుర్తించలేదు పాపం!
బ్లాగు రాతలకే ఆకర్షితులయ్యె పనైతే నీలాంటివాళ్ళకు స్ధానం ఉంటుందా అసలు? యువత ఎదిగారని ఒక పక్క చెబుతూ అదే నోటితో నా రాతలకు ఆకర్షితులు కాకూడదని తాపత్రయపడుతున్నానంటూ విరుద్ధంగా రాయడం ఏమిటి? నువ్వు ఏం రాశావో నీకన్నా అర్ధం అయ్యిందా?
రాతల్లో కనీస సంస్కారం చూపలేనివాడివి డిబేట్ ఎలా చెయ్యగలవు? అది నీ వల్ల కాదు. ఇంకా నాలుగు కారు కూతలు కూసి అదే డిబేట్ అంటావు అంతే. సమస్యలు నువ్వు వంద చెబితే ఏంటి, వెయ్యి చెబితే ఏమిటి? కోట్ల బడ్జెట్ తో నడిచే మీడియాకీ, ఖాళీ సమయాల్లో రాసే బ్లాగ్ కీ తేడా కూడా గుర్తించని అజ్ఞానం నీది. అందులోనే పడి దొర్లు. నాకేం అభ్యంతరం లేదు. చర్చ చేయాలనుకుంటే కాస్త మర్యాదగా రాయి. చర్చిద్దాం. నీ బుర్రలో ఉన్నదే నేను రాయాలంటే కుదర్దు. నీలాంటి ప్రబుద్ధులు ఇంకా దొరకొచ్చు. అక్కడికెళ్లి నీ తుత్తి తీర్చుకో.
నేను రాయదలుచుకున్నవే ఈ బ్లాగ్ లో రాస్తాను. ఇష్టం ఉంటే చూడు, లేకపొతే పక్కకు వెళ్లిపో. దమ్మూ, గిమ్మూ అని మళ్ళీ తిక్క రాతలు రాయకు.
http://m.firstpost.com/business/rajans-hidden-memo-crony-capitalism-under-upa-has-worsened-1315715.html?page=1
http://www.theguardian.com/world/2014/jan/01/united-nations-too-christian-report
http://www.theguardian.com/media/2014/jan/02/julian-assange-surveillance-thought-for-the-day-wkileaks-pj-harvey