రష్యాలోని వోల్వోగ్రాడ్ పట్టణ రైల్వే స్టేషన్ లో పట్ట పగలు ఆత్మాహుతి దాడి జరిగింది. ఒక మహిళా మిలిటెంటు తనను తాను పేల్చుకోవడంతో 16 మంది మరణించారని రష్యా టుడే పత్రిక తెలిపింది. మరో 37 మంది గాయపడ్డారని, వారిలో 8 మంది పరిస్ధితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళ పేరు ఒక్సానా అస్లనోవా అని అనధికార వర్గాలను ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది. మరణాల సంఖ్యను రష్యా పరిశోధనా సంస్ధ ధృవీకరించింది.
వోల్గోగ్రాడ్ రైల్వే స్టేషన్ ఆత్మాహుతి దాడి దృశ్యాన్ని అక్కడి సి.సి.టి.వి కెమెరా రికార్డు చేసింది. సదరు వీడియోను కింద చూడవచ్చు.
ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళ గతంలో రష్యా భద్రతా బలగాలకు తెలిసిన వ్యక్తే అని పత్రికల వార్తలను బట్టి తెలుస్తోంది. ఆమె భర్త కూడా మిలిటెంటేనని, అతన్ని రష్యా భద్రతా బలగాలు చంపేశాయని ఆర్.టి తెలిపింది. ఆ తర్వాత సదరు మహిళ పెళ్లాడిన మరో మిలిటెంటును కూడా భద్రతా బలగాలు కాల్చి చంపారని పత్రిక తెలిపింది. ఇక ఆ మహిళ ఆత్మాహుతి దాడికి సిద్ధపడడానికి మరో కారణం ఉంటుందా?
ఆత్మాహుతి దాడిని టెర్రరిస్టు దాడిగా రష్యా ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం గం. 12:45 ని.లకు జరిగిన ఈ పేలుడుకు పాల్పడిన సంస్ధ పేరు తెలియలేదు. ఇనుప తుక్కు కూరిన పేలుడు పదార్ధాలను పేలుడులో వినియోగించారని దానితో ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించిందని రష్యా ప్రభుత్వ జాతీయ టెర్రరిస్టు వ్యతిరేక కమిటీ ప్రతినిధి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపాడు. పేలని ఎఫ్-1 గ్రెనేడును సంఘటనా స్ధలంలో కనుగొన్నామని ఆయన తెలిపాడు.
వోల్గోగ్రాడ్ లో గతంలోనూ పేలుళ్ళు జరిగాయి. దక్షిణ రష్యాలోని ఈ నగరంలో గత అక్టోబర్ లోనే ఒక బస్సులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 6 గురు మరణించగా 30 మంది గాయపడ్డారు. ఈ పేలుడులో కూడా ఒక మహిళనే బాధ్యురాలిగా గుర్తించారు. టెర్రరిస్టు నేత నైడా ఆసియలోవ ఈ బస్సు బాంబు వెనుక ఉన్నాడని రష్యా ప్రకటించింది. తాజా పేలుడుకు పాల్పడిన మహిళ ఆసియలోవకు సన్నిహితురాలని లైఫ్ న్యూస్ టి.వి ని ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది.
పేలుడు ధాటికి మృత దేహాలు చెల్లా చెదురయ్యాయి. కొన్ని మృత దేహాలు గుర్తు పట్టలేని విధంగా తునాతునకలయ్యాయని తెలుస్తోంది. పేలుడు అనంతరం మంటలు చెలరేగినప్పటికీ అగ్నిమాపక దళాలు వెంటనే వాటిని కట్టడి చేశారు. పోలీసులు, బాంబు దళాలు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ కు చేరుకుని దిగ్బంధనం కావించారు.
దట్టంగా పొగమంచు అల్లుకుని ఉండడం వలన విమానం కూలిపోయి ఉండవచ్చని స్టేషన్ చుట్టుపక్కల వారు భావించారని వార్తా సంస్ధలు తెలిపాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ పేలుడుపై విచారణకు ఆదేశించారు.
వోల్గోగ్రాడ్ మాస్కోకు దక్షిణంగా 900 కి.మీ దూరంలోనూ ఉత్తర కాకసస్ ప్రాంతానికి ఉత్తరంగా 650 కి.మీ దూరంలోనూ ఉన్న పట్టణం. ఉత్తర కాకసస్ ప్రాంతం టెర్రరిస్టులకు నిలయం అని బి.బి.సి తెలిపింది. 2014 వింటర్ ఒలింపిక్స్ మరో 6 వారాల్లో రష్యన్ నగరం సోచిలో జరగనున్నాయి. సోచి వింటర్ ఒలింపిక్స్ ను ఆటంకపరుస్తామని ఇప్పటికే అనేక సార్లు టెర్రరిస్టుల నుంచి బెదిరింపులు వచ్చాయని రష్యా ప్రభుత్వం వివిధ సందర్భాల్లో చెప్పింది.
సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ కు మద్దతు ఇవ్వడం మానుకుంటే సోచి ఒలింపిక్స్ పై దాడులు చేయకుండా టెర్రరిస్టులను కట్టడి చేయగలమని సౌదీ అరేబియా ప్రభుత్వం రష్యాకు బేరం పెట్టిన విషయం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. సౌదీ అరేబియా పోషణలో ప్రపంచ వ్యాపితంగా అనేక ఉగ్రవాద సంస్ధలు పని చేస్తున్నాయి.
చెచెన్యాలో సైతం తమ అదుపాజ్ఞల్లో పని చేసే టెర్రరిస్టు సంస్ధలు ఉన్నాయని సౌదీ అరేబియా పాలకులు రష్యాకు చెప్పారని, అయితే సౌదీ బెదిరింపులకు పుతిన్ బెదరలేదని అంతర్జాతీయ విశ్లేషకులు గతంలో తెలిపారు. సోచి ఒలింపిక్స్ ఆటలను జరగకుండా అడ్డుకోడానికి శక్తినంతా ఉపయోగించాలని చెచెన్ తిరుగుబాటు నాయకుడు డోకు ఉమరోవ్ గత జులై లో పిలుపు ఇచ్చిన సంగతి గమనార్హం. సౌదీ బెదిరింపులు నిజమే అని భావించవచ్చా అన్నది ఇప్పటివరకు పత్రికలు ధృవీకరించలేదు.








Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: రష్యాలో ఆత్మాహుతి దాడి, 16 మంది దుర్మరణం | ugiridharaprasad
రష్యా ఆత్మాహుతి దాడికి పాల్బడటం కడు శోచనీయం. ఇక మిగత దేశాలు గురించి ఆలోచించడం అనవసరం.
http://www.theage.com.au/comment/snowden-revelations-only-the-beginning-20131229-301j6.html
http://www.gaylaxymag.com/latest-news/muslim-political-party-plasters-madurai-with-posters-seeking-death-penalty-for-homosexuals/
Feeling US snub, Saudis strengthen ties elsewhere
http://m.ndtv.com/article/world/feeling-us-snub-saudis-strengthen-ties-elsewhere-464686
Saudi Arabia to give Lebanon $3-billion to strengthen national army, buy French weapons
http://m.theglobeandmail.com/news/world/saudi-arabia-to-give-lebanon-3-billion-to-strengthen-national-army-buy-french-weapons/article16123166/?service=mobile
http://www.telegraph.co.uk/news/worldnews/europe/russia/10544617/Vladimir-Putin-vows-total-annihilation-of-terrorists-after-Volgograd-bombings.html