ఆంధ్ర జ్యోతి (ఆదివారం) నుండి
***
ఉరిశిక్ష పడిన ఖైదీని ఉరికంబం ఎక్కించారు. ముసుగు తొడగబోతుంటే వద్దన్నాడు ఖైదీ.
“ముసుగేసుకోకపోతే భయమేస్తుంది” అన్నాడు తలారి.
“నీకా?” అడిగాడు ఖైదీ.
“కాదు. నీకు”అన్నాడు తలారి.
ఖైదీ నవ్వాడు. ” నా ఆఖరి శ్వాసదాకా ఈ దరిద్రగొట్టు అవకతవక కంగాళీ ప్రపంచాన్ని చూడనీ. బాగా గుర్తు పెట్టుకోవాలి. పొరపాటున మళ్లీ ఈ భూమ్మీద పుట్టి ఛస్తానేమో. అలా జరక్కూడదని కళ్లు తెరిచే ప్రార్థించుకుంటా” అన్నాడు.
తలారికి ఏం అర్థం కాలా. తల గోక్కుంటూ తాడు అతని కంఠానికి ఎడ్జెస్ట్ అయేలా సరిచేసి చక్రం దగ్గరికి వెళ్లి జైలర్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు.
జైలర్ టైమ్ చూసుకున్నాడు. ఇంకా రెండు నిమిషాలు ఉంది. పక్కన జైలు సిబ్బంది, మేజిస్ట్రేటు, డాక్టరు ఉత్కంఠగా చూస్తున్నారు. వారిలో చాలామందికి ఉరితీతను ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి.
ఇంకా నలభై సెకండ్లుంది. ఇంతలో “సార్! జైలర్ సాబ్!” అంటూ పెద్దకేక.
జైలు ఆఫీసు క్లర్కు వగర్చుతూ పరుగెత్తుకుంటూ వచ్చాడు.
“సార్! మీకు మోస్ట్ అర్జంట్ మెసేజ్”అని అరిచాడు.
జైలర్ అయోమయం గా చూసాడు. సుప్రీం కోర్టులో స్టే వచ్చిందేమో! ప్రెసిడెంటు చివరిక్షణంలో ఉరిశిక్షను రద్దు చేసారేమో! ఎన్ని సినిమాల్లో చూడటం లేదు ఇలా ఆఖరు క్షణంలో రద్దు కావటం?
క్లర్కు ఇచ్చిన మెసేజిని చదువుకుని, ఉరికంబం మీద నిల్చున్న ఖైదీ దగ్గరికి వెళ్లి ఏదో అడిగాడు. ఖైదీ అడ్డంగా తలూపాడు. వెంటనే జైలర్ తలారికి సైగ చేసాడు. అతనొచ్చి తాడు తీసేసాడు.
జైలర్ గంభీరంగా నడుచు కుంటూ వచ్చాడు. అందరూ ఆత్రంగా అడిగారు -ఏమయిందని.
జైలర్ చెప్పాడు. “ఈ ఖైదీకి ఆధార్ కార్డు లేదుట. అది ఉంటే గానీ ఉరిశిక్షకు అర్హుడు కాదుట. ఈ పద్ధతి అరగంట కిందే అమల్లోకి వచ్చిందట”.
***
ఈ కధ మిగతా భాగం కోసం కింద లింక్ లోకి వెళ్ళి చూడండి.

ఖైదిని అడిగినందుకు ఉరి తప్పింది, అదే తలారిని అడిగివుంటే ఆ వురితాడు తలారి తలకు చుట్టుకునేది. ఎందుకంటే ఆధార్ కార్డ్ లేని వాడు ఎందులకు కొరగాడు. విధి నిర్వాహణ ఉరితీత అతనిని విధివంచితుడిగా మార్చేది. ముష్కర సామ్రాజ్యంలో కోతిచేష్టలకు విలువేది?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో పోస్టు మార్టం చేసుకుంటామని సోనియా, రాహుల్ చెప్పారు గానీ వాళ్లకింకా అసలు సీక్రెట్ అర్థం కాలేదు.
ఈ ఆధార్ కష్టాలు తట్టుకోలేకే జనం కాంగ్రెస్ పార్టీని ఓడించారు. అదే కాంగ్రెస్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఒకటే మార్గం.
అందరికీ ఉచితంగా ఇంటిటికి తిరిగి ఆధార్ కార్డు ఇస్తే సరి. కచ్చితంగా గెలుస్తారు. నిఝం. కావాలంటే ఆధార్ కార్డు మీద ఒట్టు.