సుడిగాలి పవర్ అమెరికాలోనే చూడాలి -ఫోటోలు


సుడిగాలి గురించి వినడమే గాని మనకి పెద్దగా తెలియదు. ఎందుకంటే అది మన వాతావరణం లక్షణం కాదు. అమెరికా సుడిగాలి విధ్వంసాలకు పెట్టింది పేరు. అక్కడ సుడిగాలిని టోర్నడో అనీ ట్విస్టర్ అనీ పిలుస్తారు. ఆకాశం నుండి నేలకు నిచ్చెన వేసినట్లు కనిపించే సుడిగాలి అందుబాటులోకి వచ్చే ప్రతి వస్తువును లోపలికి లాక్కుంటూ క్షణాల్లో పెను ఉత్పాతాలను సృష్టించి పోతుంది.

పెద్ద పెద్ద కార్లు, బస్సులతో సహా వందల మీటర్ల మేర విసిరికొట్టేస్తుంది. తరచుగా చెట్లను సమూలంగా పెకిలించివేస్తుంది. ఇళ్ల పైకప్పులను తనకు అత్యవసరం ఐనట్లుగానే చక్కగా పట్టుకుపోయి మొండిగోడలను మాత్రమే మిగుల్చుతుంది. ఒక్కోసారి గోడలూ మిగలవు. కొన్నిసార్లు అంతకుముందు నిర్మాణాలను వింత వింత కళాకృతులుగా మార్చిపోతుంది. ఈ విన్యాసాలను కింద ఫొటోల్లో చూడవచ్చు.

మొదట కొన్ని ఫోటోల్లో టోర్నడో ఎలా ఉంటుందో చూడవచ్చు. ఇక్కడ చూడ్డానికి కాస్త మొయినంగా కనిపిస్తోంది గానీ మామూలుగా అయితే టోర్నడోను చూస్తేనే గుండెలు ఆవిసిపోతాయి. ఆ తర్వాత ఫోటోలు వాటి పాదముద్రలు. గత ఆదివారం, నవంబర్ 17 తేదీన, సంభవించిన టోర్నడోలు అమెరికాలో 12 రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించాయి. 12 టోర్నడోలు భూమిని తాకాయని కొన్ని పత్రికలు చెప్పగా వీటి సంఖ్య 81 అని మరికొన్ని తెలిపాయి. వీటిలో కొన్ని టోర్నడోలు గంటకు 190 మైళ్ళ వేగంతో పెనుగాలులు సృష్టించాయి.

బోస్టన్ పత్రిక ఈ ఫోటోలు అందించింది.

2 thoughts on “సుడిగాలి పవర్ అమెరికాలోనే చూడాలి -ఫోటోలు

  1. పింగ్‌బ్యాక్: సుడిగాలి పవర్ అమెరికాలోనే చూడాలి -ఫోటోలు | ugiridharaprasad

వ్యాఖ్యానించండి