సచిన్ టెండూల్కర్ ఒక క్రీడాకారుడు. క్రికెట్ అంటే ఆయనకు ప్రాణం. 40 యేళ్ళ జీవితంలో 30 యేళ్ళ నుండి క్రికెట్ ఆడుతున్న వ్యక్తి. పిన్న వయసులోనే జాతీయ జట్టులో స్ధానం సంపాదించి అద్భుతమైన టెక్నిక్ తో చేయి తిరిగిన బౌలర్లకు కూడా కొరకరాని కొయ్యగా మారిన బ్యాట్స్ మేన్. క్రికెట్ జీనియస్ గా భావించే డాన్ బ్రాడ్ మన్ చేత కూడా ప్రశంసలు అందుకున్న వ్యక్తి.
అన్నింటికన్నా మిన్నగా అనేక క్రికెట్ రికార్డులు ఆయన సొంతం. అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసింది ఆయనే. అత్యధిక వండే సెంచరీలు చేసిందీ ఆయనే. మొత్తం మీద వంద సెంచరీలు చేసిన రికార్డు ఆయన ఖాతాలోనిదే. అత్యధిక పరుగులు చేసింది, ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో కలిపినా అత్యధిక పరుగులు చేసిందీ ఆయనే. ఆల్ రౌండర్ పేరు రాకపోయినా, పైగా బౌలింగు లోనూ ప్రతిభ చూపాడు.
కానీ ఇవన్నీ క్రికెట్ కే పరిమితం. క్రికెట్ తప్ప అతనికి ఏమీ తెలియదు. క్రికెట్ కాకుండా అతను విశ్వాసంతో మాట్లాడింది కేవలం తన కుటుంబం గురించే. రాజ్యసభ సభ్యుడుగా కూడా అతను ప్రజల సమస్యల గురించి మాట్లాడే చొరవ తీసుకోలేకపోయాడు. మహా అయితే టెన్నిస్, ఫార్ములా వన్ తదితర క్రీడల్లోని దిగ్గజాలతో ఫోటోలు దిగాడు. వారిని మెచ్చుకున్నాడు.
ఇంతకు మించి సచిన్ చేసిందేమీ లేదు.
భారత రత్న ఎవరికి ఇవ్వాలి?
భారత రత్న పురస్కారం పొందడానికి నిర్దేశించిన నిబంధనల ప్రకారం అత్యున్నత జాతీయ సేవలు చేసి ఉండాలి. ఆ సేవలు కళా, సాహిత్య రంగాల్లో చేసి ఉండాలి. శాస్త్ర విజ్ఞాన రంగంలో ఘనకార్యం సాధించిన వారికి ఇవ్వొచ్చు. అతున్నత స్ధాయిలో ప్రజాసేవ చేసిన గుర్తింపు పొందినా భారత రత్న ఇవ్వవచ్చు.
ఇందులో క్రీడలు లేవు. 2011లో అప్పటి క్రీడల మంత్రి అజయ్ మాకెన్ సచిన్ టెండూల్కర్ కి భారత రత్న పురస్కారం ఇవ్వడానికి వీలుగా భారత రత్న నిబంధనలను సడలించాలని ప్రభుత్వాన్ని కోరారు. దానిని హోమ్ శాఖ వ్యతిరేకించింది. సచిన్ కి ఇవ్వాలంటే మొదట భారత హాకీ పితామహుడు ధ్యాన్ చంద్, షూటింగ్ క్రీడాకారుడు గగన్ నారంగ్, పరుగుల యంత్రం పి.టి.ఉష లకు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతూ అభ్యంతరం తెలిపింది.
ఏమయిందో ఏమో గాని డిసెంబర్ 2011 లో నిబంధనలను సడలించారు. ‘మానవ ప్రయత్నానికి (human endeavour) సంబంధించి ఏ రంగంలోనైనా అత్యున్నత ప్రదర్శన కనపరిస్తే భారత రత్న ఇవ్వొచ్చని సవరణ చేశారు. అంటే కళారంగం, సాహిత్య రంగం అని పేర్కొన్నట్లుగా క్రీడా రంగం అని పేర్కొనలేదు.
కళా, సాహిత్య రంగాలకు క్రీడా రంగానికి పోలిక లేదు. అవి రెండూ ప్రజా రంగాలు. ప్రజల నిత్య జీవితంతో అవి ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆ రంగాల్లో కృషి చేసినవారు మానవ పరిణామ వికాసం పైనే ప్రభావం చూపుతారు. ఉదాహరణకి శ్రీశ్రీ, సాహిత్యం, గద్దర్ పాట, వీరేశలింగం నాటకం, కొడవటిగంటి కధ … ఇత్యాదివన్నీ ప్రజా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రజలను ఉద్యమాల్లోకి కదిలించగల శక్తి కళకు, సాహిత్యానికి ఉంటుంది.
కానీ క్రీడ అలాంటిది కాదు. అది కేవలం మానసిక ఉల్లాసానికీ, శారీరక ఆరోగ్యానికీ మాత్రమే ఉపయోగం. దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోడానికి ఉపయోగమే గానీ, కేవలం క్రీడల వల్లనే సంబంధాలు మెరుగుపడిన దాఖలాలు లేవు. పైగా క్రీడా విరోధాలు సంబంధాన్ని ఇంకా చెరిపిన ఉదాహరణలు ఉన్నాయి. భారత్-పాక్ ల మధ్య ఉన్న చారిత్రక, భౌగోళిక-రాజకీయ వైరాన్ని క్రికెట్ దౌత్యం చల్లార్చటం అటుంచి కనీసం మెరుగుపరచను కూడా లేదు.
కనుక క్రీడలకు స్వాభావికంగానే ఆ పరిమితులు ఉన్నాయి.
అంతేకాకుండా క్రీడాకారులకు వ్యక్తిగత లక్ష్యమే ప్రధానం. వారి క్రీడా ప్రదర్శన వల్ల దేశ జట్టు గెలిచింది అన్న పేరు వస్తుందే తప్ప దేశానికి అనగా ప్రజలకు అదనంగా చేకూరే ప్రయోజనం సున్న. క్రీడాకారులు ఎంత గొప్పగా ఆడితే వారికి అన్నీ డబ్బులు రావచ్చు. వారి వల్ల జనాన్ని దోచుకునే కంపెనీలకు లాభమే గానీ జనానికి మాత్రం నష్టమే. సచిన్ చెబితే కోకో కోలా కంపెనీ మన నీళ్ళను మనకి తక్కువ ఖరీదుకు ఏమీ ఇవ్వదు. పైగా సచిన్ ఖర్చును కూడా కూల్ డ్రింక్ ఖరీదులో పిండుకుంటుంది.
రసాయన శాస్త్రవేత్త రావుగారి స్ఫూర్తితో మరింత మంది ప్రతిభావంతమైన శాస్త్రవేత్తలు తయారైతే దేశానికి ఎంతో ప్రయోజనం. కొత్త కొత్త పరికరాలు ఉత్పత్తి రంగాల్లో వాడడానికి తగిన ఆవిష్కరణలు వారు చేయగలరు. అదే సచిన్ స్ఫూర్తితో మరో వందమంది క్రికెట్ మెరికలు తయారైతే వారిలో 11 మందే (లేదా 15 మంది) జట్టులో ఉంటారు. వాళ్ళ వల్ల మళ్ళీ కంపెనీల పనికిమాలిన ఉత్పత్తులకే ప్రయోజనం గానీ దేశానికి ఏ ప్రయోజనమూ ఉండదు.
కాబట్టి క్రీడాకారులు భారత ప్రజలకు మనోల్లాసానికి మించి చేసే ప్రయోజనం ఏమీ లేదు.
ఈ అభిప్రాయాలతో మీరు ఏకీభవించాలని లేదు. కొత్త అభిప్రాయాలూ ఉంటే వాటిని కూడా ఇవ్వడానికి కింద ఒక ఆప్షన్ ఉంది. మీ అభిప్రాయాలు ఇవ్వండిక!
పోల్ పెడితే అయనే గెలుస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. సచిన్ ను వీరాభిమానులు ఓడనిస్తారా?
భారతరత్న ప్రజాసేవ చెసినవారికోసం ఉద్దేశించింది. అంతే గాని సొంత రికర్డుల కోసం పరితపించినవారి కోసం కదు . ఈ దేశంలో కసబ్ కి, సంజయ్ దత్‌కి లలూ ప్రసాద్కి కూడా అభిమానులు ఉన్నారు. అంత మాత్రం చేత వాళ్ళేం గొప్పోళ్ళు కాదు
Other ఆప్షన్ కింద ఇప్పటివరకు వచ్చిన అభిప్రాయాలివి:
-he played commercial games only
-all options are not correct. but sachin is aslo never eligible 4 BharathaRatna.
-he has been a great ambassador for india with his game and character.
-అవార్డులు, రివార్డులు అనవసర కార్య్రక్రమాలే. వాటితో ప్రజలకు వచ్చే ప్రయోజనాల్లేవు
అయిపోయిన పెళ్ళికి బాజాభజంత్రీలు ఎందుకు?
మరిన్ని ‘other’ అభిప్రాయాలు:
అది ఇస్తే ఇకపై జీవితాన్ని భారతరత్నగా దాన్ని నిలుపుకునేలా జీవిస్తాడు ?!
కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన…
అయిపోయిన పెళ్ళికి బాజాభజంత్రీలు ఎందుకు?
Those who earned fame by earning money are not eligible.
క్రికెట్ లో అనేక గొప్ప రికార్డులు సాధించాడు,వ్యక్తిగా కూడా ఉన్నతుడు,
He is not eligible as cricket involved with money and not represented in Olympic
He benefited and not the country. No need of the award.
What about Major Dhyan Chand
He deserve Bharata Ratna. Bharata Ratna is initially meant only for art and literature. Cricket is no different from any musical instrument like Shehanai or Sitar or CArnatic singing. Everything is a form of entertainment. The ultimate output of all these is elivating the happiness of a man.
1. He deserves this award as he inspired crores of people across the globe for 24 years with his game. Just imagine how many children he would have inspired. They
2. He will be in the top list who elevated the Indian cricket team to what it is now. Remember how bad Indian win rate was… before him.
3.He is clean..away from match fixing, betting and all other bad things surrounded.
4. Govt. did the right thing by awarding him, which gives a message to the society that being clean, consistent will pay back.
5. He has a huge number of fans ..more than any previous awardees like Gopinath Bordoloi, MS subbulakshmi who are not known to the mass of the people.
Frankly speaking, what did Latha Mangeshkar did for Country as described in your article? What Kamaraj and MGR did at country level? What’s so great that Rajiv Gandhi did to country that other non-Nehru family PMs couldn’t do?
Current generation is spending their time without any physical activity and this needs to be changed for health reasons. Giving Bharatratna to someone who helped the youth of the Nation to think of sports is not a bad policy. May be Sachin is not the front runner from Sports, but he is definitely in the race.