ఉత్తర ప్రదేశ్ స్వామీజీ శోభన్ సర్కార్ వారి 1000 టన్నుల బంగారం కల చివరికి ‘కలే’ అని తేలిపోయింది. ఉన్నావ్ తవ్వకాల్లో మట్టి తప్ప మరొకటి లేదని చెబుతూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఐ) వారు తవ్వకాలు నిలిపివేసి వెళ్ళిపోయారు. కొన్ని చారిత్రక పదార్ధాలు బైటపడినప్పటికి అవన్నీ 18 వ శతాబ్దం నాటివేననీ, అంతకు ముందువి ఏమీ లేవనీ ఎ.ఎస్.ఐ తేల్చేసింది.
ఆ విధంగా ఎ.ఎస్.ఐ తన ఒకటిన్నర శతాబ్దాల ఘన చరిత్రను ఒక స్వామీజీ కలకు అప్పనంగా అర్పించేసింది. కళ్ళు మూసుకుని గుడ్డిగా స్వామీజీ వెంట నడిచి పేరు ప్రతిష్టలను కోల్పోయినంత పని చేసింది. గుడ్డిలో మెల్లగా యేళ్ళ నాటి బంగారం నిధుల పుకార్లను నిజం కాదని రుజువు చేయగలిగింది. కానీ దానితో పోలిస్తే ఎ.ఎస్.ఐ ఫణంగా పెట్టిన పేరు ప్రతిష్ట లే చాలా ఎక్కువ.

One who digs burrows won’t fall in his own burrow but he leads others to fall in to it.
సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద రాలుతుందనే సామెత అక్షరాల ఈ విషయం నిరూపించింది. రాహుల్ కు రాహువు పట్టి పీడిస్తోంది. రాబోయే ఎన్నికలలో కూడా ఇలా సన్నాసి నమ్మకాలు పెట్టుకుంటే ఎన్ని కల్లలు చివరకు మిగులుతాయి.