నిర్బంధ ఓటింగు–అద్వానీ మరియు మోడి -కార్టూన్


Compulsory voting

సుప్రీం తీర్పు ప్రకారం ఓటింగ్ మిషన్ లో ‘None Of The Above’ (NOTA) బటన్ ను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరూ నచ్చకపోతే NOTA మీట నొక్కాల్సి ఉంటుంది. కానీ NOTA ఓట్లు లెక్కించరాదని తీర్పులో పేర్కొన్న దృష్ట్యా ఈ మీటకు విలువ లేకుండా పోయింది, అది వేరే సంగతి!

NOTA మీట ప్రవేశ పెడుతున్నారు కాబట్టి నిర్బంధ ఓటింగ్ ని అమలు చేయాలని నరేంద్ర మోడి ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల్ బూతుకి వచ్చి ఓటు వేసే విధంగా చట్టం తేవాలన్నది మోడి ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను బి.జె.పి అగ్ర నాయకులు అద్వానీ కూడా ఆమోదించేశారు.

మోడి ప్రధాని అభ్యర్ధిత్వాన్ని అద్వానీ తీవ్రంగా ప్రతిఘటించిన సంగతి తెలిసిందే. మోడి తన కాళ్ళకు నమస్కారం చేస్తున్నా పట్టించుకోకుండా వేరే దిక్కు చూసే స్ధాయిలో అద్వానీ వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడిప్పుడే మోడిని పొగుడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ అందులో పూర్తి ఆమోదం కనిపించడం లేదని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. వేరే సందర్భంలో ఒకటీ, రెండూ పొగడ్తలు ఇచ్చినా ప్రధాని అభ్యర్ధిత్వానికి మోడి సరైన వ్యక్తే అని స్పష్టంగా ఆయన ఇంకా చెప్పలేదు.

అలాంటి అద్వానీకి ఇ.వి.ఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్) లో “NONE OF THE ABOVE” మీట బదులు “NAMO OF THE ABOVE” అని పొరపాటున ప్రచురిస్తే ఎలా ఉంటుందా అని కార్టూనిస్టు ఊహించారు. నిర్బంధ ఓటింగు ప్రతిపాదన విషయంలో మోడీకి మద్దతు ఇచ్చిన పాపానికి అద్వానీ ఓటింగ్ కు వెళ్ళక తప్పదు. తీరా అక్కడికి వెళ్ళి “ఎవరూ (మోడీ కూడా అని చదువుకోవాలి) పనికిరారు” అన్న మీటకు బదులు “పై వారిలో మోడి ఒక్కరే సమర్ధుడు” అన్న మీట ప్రత్యక్షం అయితే అద్వానీ పరిస్ధితి ఏమిటి?

2 thoughts on “నిర్బంధ ఓటింగు–అద్వానీ మరియు మోడి -కార్టూన్

  1. వృద్ధాప్యానికి పదవి సారూప్యతకు సహస్రం తేడా. పదవీ పగ్గాలకు కళ్ళెం వేయాలంటే నమో నమః తప్పదు.

వ్యాఖ్యానించండి