బీహార్: మోడి ర్యాలీ స్ధలిలో బాంబు పేలుళ్లు


పాత మిత్రుడి రాష్ట్రాన్ని పలకరించడానికి వెళ్ళిన నరేంద్ర మోడిని బాంబు పేలుళ్లు ఆహ్వానించాయి. పాట్నాలో మోడి ప్రసంగించవలసిన వేదిక వద్దనే వరుసగా 6 బాంబు పేలడంతో ఐదుగురు చనిపోగా అరవై మందికి పైగా గాయపడ్డారని పత్రికలు చెబుతున్నాయి. పేలుళ్ళ పట్ల మోడి విచారం వ్యక్తం చేయగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రధాన మంత్రి ఆయనకు ఫోన్ చేసి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పాలక జనతా దళ్ (యు) మంత్రులు పేలుళ్ళ వల్ల లాభం పొందేది ఇంకెవరు? అని ప్రశ్నిస్తూ పరోక్షంగా బి.జె.పిని వేలెత్తి చూపుతున్నారు.

నిఘా సంస్ధల వైఫల్యమే పేలుళ్లకు కారణమని బి.జె.పి నాయకురాలు సుష్మా ప్రకటించడం విశేషం. పేలుళ్లు జరగకుండా అరికట్టడంలో నిఘా సంస్ధల వైఫల్యం ఉంటుంది, నిజమే. కానీ ఏకంగా పేలుళ్లకే నిఘా సంస్ధలు ఎలా కారణం అవుతారో అంతుబట్టని విషయం. పేలుళ్లు జరిగినప్పుడల్లా రాజకీయ నాయకులు, పాలకులు తరచుగా అనాలోచితంగా అనే మాట ఇది. ముఖ్యుల పర్యటనలకు అన్ని విధాలా భద్రతా చర్యలు తీసుకోవలసిన బాధ్యత భద్రతా సంస్ధల పైన ఉంటుంది. వారు ఎన్ని చర్యలు తీసుకున్నా జరగకూడని ఘటన జరిగితే వారు సరిగ్గా చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారని అర్ధం. కానీ వారి వైఫల్యమే పేలుళ్ళకి కారణం అని ఎలా అనగలం?

ది హిందూ పత్రిక ప్రకారం బి.జె.పి ప్రధాన మంత్రి అభ్హ్యర్ధి నరేంద్ర మోడి ప్రసంగించాల్సిన వేదికకు సమీపంలోనే ఐదు పేలుళ్లు జరిగాయి. విచిత్రం ఏమిటంటే ఈ పేలుడుకు కొన్ని గంటల ముందే పాట్నా రైల్వే స్టేషన్ లో కొత్తగా కట్టిన టాయిలేట్ లో నాటు బాంబు పేలింది. అయినా సభా స్ధలంలో తనిఖీలు జరగకపోవడం ఎలా అర్ధం చేసుకోవాలి? ఈ బాంబు పేలిన తర్వాత బి.జె.పి నాయకులు ‘ఏమి లేదు, ఏమీ జరగలేదు. కారు టైరు పేలింది అంతే’ అని సభకు హాజరైన జనానికి సర్ది చెప్పారట. మరి కొద్ది గంటల తర్వాత వేదిక వద్దనే వరుసగా ఐదు బాంబులు పేలాయి. టాయిలేట్ లో బాంబు పేలినా, టైర్ పేలుడు అని సర్ది చెప్పి జనాన్ని అక్కడి నుండి కదలకుండా చేసిన బి.జె.పి నాయకులను 5గురి మరణానికి (పాక్షికంగా) బాధ్యులను చేయొచ్చా?

నిజానికి భద్రతా బలగాలను తప్పు పట్టడం తొందరపాటు అవుతుందేమో. ఎందుకంటే రైల్వే స్టేషన్ లో బాంబు పేలిన తర్వాత పోలీసులు అక్కడికి పరుగెట్టుకొచ్చారు. రైల్వే స్టేషన్ ను జల్లెడ పట్టి పేలని రెండు బాంబులను నిర్వీర్యం చేశారు కూడా. పేలని బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో ఒక పోలీసు అధికారి గాయపడ్డారు కూడాను. రైల్వే ఎస్.పి ఉపేంద్ర కుమార్ ఈ విషయాలు చెప్పారని పత్రికలు తెలిపాయి.

పాట్నా లోని గాంధీ మైదాన్ లో నరేంద్ర మోడి ర్యాలీ జరగాల్సి ఉండగా పేలుళ్లు సంభవించాయని, ఇవి తక్కువ తీవ్రత కలిగినవని కేంద్ర హోమ్ కార్యదర్శి అనిల్ గోస్వామి చెప్పారని పి.టి.ఐ తెలిపింది. సభా వేదికకు పశ్చిమాన ఉన్న ఒక సినిమా హాలు వద్ద ఒక బాంబు పేలగా మరో బాంబు వేదికకు సమీపంలో పేలిందని చెబుతున్నారు. నరేంద్ర మోడి ఒక పక్క ప్రసంగిస్తుండగానే పేలుళ్ళ పొగలు గాలిలో తేలుతూ కనిపించాయని పేలుళ్లు జరిగినప్పటికి మోడి కార్యక్రమం యధావిధిగా జరిగిపోయిందని తెలుస్తోంది.

పేలుళ్లను యధావిధిగా అనేకమంది ఖండించారు. ప్రధాని మన్మోహన్ బీహార్ సి.ఎం కు ఫోన్ చేసి విచారణ వేగిరం చేయాలని కోరారు. కేంద్ర హోమ్ శాఖ తమకు వెంటనే నివేదిక ఇవ్వాలని బీహార్ ప్రభుత్వాన్ని కోరింది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ (ఎన్.ఐ.ఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్.ఎస్.జి) లకు చెందిన బృందాలను పాట్నాకు తరలించింది. “ఇది టెర్రరిస్టు దాడో, లేక రాజకీయ కుట్రో నేను ఇప్పుడే చెప్పలేను. విచారణలోనే ఆ విషయం తేలాలి” అని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్ సింగ్ అన్నారని ది హిందు తెలిపింది.

జనతాదళ్ (యు) నాయకులైతే ఈ విషయాన్నే ఇంకొంత నాటుగా చెప్పారు. ఆ పార్టీ నాయకుడు సబీర్ అలీ ప్రకారం పాట్నా పేలుళ్లలో రెండు భాగాలు ఉన్నాయి.

ఒకటి: “పేలుళ్లను మేము గట్టిగా ఖండిస్తున్నాం. ఈ దుర్ఘటన వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదు.”

రెండు: దీని నుండి లాభం పొందేదీ ఎవరు? పేలుళ్లు జరిగిన సమయాన్ని బట్టి ఎవరు లబ్ది పొందుతారు?”

అయితే బి.జె.పి వాళ్ళే దీనికి బాధ్యులా అన్న ప్రశ్నకు ఆయన,

“పరిస్ధితులే అనేక విషయాలు చెబుతున్నాయి. విచారణ ముగిసే లోపు ఎవరినీ వేలెత్తి చూపడం లేదు. కానీ చూస్తున్నారుగా, పరిస్ధుతులే అనేక విషయాలు చెబుతున్నాయి” అన్నారాయన.

రాజ్యసభలో బి.జె.పి ఉపనాయకుడు రవి శంకర్ ప్రసాద్ పాట్నాలో ఉన్నారు. పేలుళ్లపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సరే, ఈ డిమాండ్ ఎలాగూ తప్పదు. ఆయన చెప్పిన మరో సంగతి, ఎనిమిది నెలల క్రితమే ఈ కార్యక్రమం ఖరారయినా రాష్ట్ర పోలీసులు తగిన భద్రతా చర్యలు తీసుకోలేదట! ప్రసాద్ ఆరోపణలను పరిశీలించడం అవశ్యం.

ప్రసాద్ ప్రకారం ఎనిమిది నెలల ముందే పాట్నాలో మోడీ సభ ఖరారయింది. అంటే ఇది అక్టోబర్ ఆఖరి వారం కాబట్టి ఫిబ్రవరి ఆఖరి వారంలో మోడి పర్యటన ఖరారయి ఉండాలి. అప్పటికి జె.డి(యు), బి.జె.పి ఒకే గూటి పక్షులుగా కాపురం చేస్తున్నాయి. బి.జె.పి కూడా బీహార్ ప్రభుత్వంలో భాగస్వామి. ఈ రెండు పార్టీలు కలిసి ఉండగా మోడి బీహార్ పర్యటనకు నితీశ్ కుమార్ ఎన్నడూ ఒప్పుకోలేదు. ఎన్నికల ప్రచారానికి కూడా మోడిని ఆయన రానివ్వలేదు. అలాంటిది అప్పుడే మోడి పర్యటన ఎలా ఖరారయింది?

పోనీ నితీశ్ కి తెలియకుండా ఖరారయింది అనుకుంటే దానికి నితీశ్ ప్రభుత్వం బాధ్యురాలు కాదన్న వాదన వస్తుంది. ఎనిమిది నెలల ముందే అనడంలో ప్రసాద్, భద్రతా బాధ్యతలను కాలం పైన పెట్టారు. ఆ కాలంలో బి.జె.పి కూడా ప్రభుత్వంలో భాగస్వామి కనుక జరిగిన ఘటనకు బి.జె.పి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

రెండు పార్టీలు విడిపోయాక పేలుళ్లకు పధక రచన జరిగింది అనుకుంటే అప్పుడు మళ్ళీ జె.డి (యు) నాయకుడు సబీర్ ఆలీ వాదన ముందుకు వస్తుంది. ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడి రాజకీయ ర్యాలీకి ముందు పేలుళ్లు జరిగాయి కాబట్టి ఆ పేలుళ్ళ వలన ఎవరు లాభం పొందుతారు అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. మరోవైపు ఎవరికి నష్టం అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం అంత కష్టం ఏమీ కాదు. కాబట్టి ఎలా చూసినా పేలుళ్లలో కాస్తో, కూస్తో బి.జె.పి బాధ్యత వచ్చి చేరుతోంది.

బహుశా ఈ కారణాల వల్లనేనేమో పేలుళ్ల గురించి నరేంద్ర మోడి తీవ్రమైన ఆరోపణలు ఏమీ చేయలేదు. కేవలం విచారం ప్రకటించి ఊరుకున్నారు. బి.జె.పి నాయకులు కూడా భద్రతా సంస్ధలను వేలెత్తి చూపారు గానీ రాజకీయ ఆరోపణలు చేయడానికి ధైర్యం చేయలేదు.

ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రకారం నరేంద్ర మోడి సభా స్ధలికి వచ్చాక కూడా ఒక బాంబు పేలింది. కానీ ఎవరూ సభకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించలేదు. బాంబు పేలిన సమయానికి బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ప్రసంగిస్తున్నారని, ఆ తర్వాత మోడి ప్రసంగించారని ఒక పక్క ప్రసంగాలు జరుగుతుండగానే మరో పక్క బాంబులు పేలాయని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. అయితే “ఎవరూ టపాలు పేల్చోద్దు” అని సభా నిర్వాహకులు మైకుల్లో ప్రకటిస్తుండడంతో పేలింది టపాసులే అని ఫస్ట్ పోస్ట్ విలేఖరి కూడా అనుకున్నారట. మోడి ప్రసంగం ముగిసి అందరూ వెళ్లిపోతుండగా గాయపడిన వారిని మోసుకు రావడం చూశాకనే పేలింది బాంబులని ఫస్ట్ పోస్ట్ విలేఖరికి అర్ధం కాలేదట!

ఏమిటీ విచిత్రం?

17 thoughts on “బీహార్: మోడి ర్యాలీ స్ధలిలో బాంబు పేలుళ్లు

 1. Sai bhargav, Mind your language. I warned you several times already. This is the last warning and there will be none further. You are not expected to scold others with a mere reason that you don’t like their reasoning. Try to correct your extremist, and of course hindu supremacist, language and maintain civility. Otherwise… well, you know what fallows.

 2. @Prasad, Can you tell me where did I scold some one in this article?

  So people did not die because of bomb blasts. They died because of police failure!? Just check the article and it is what I discussed.

  Why did BJP kept organising the rally, when people were dying? For the sake of preventing people becoming panic (actually they didn’t want to cancel the rally) should they allow people to be killed in further bombing?

  If you like BJP, like it, support it, join it… you do whatever you like. I don’t have any problem. But that doesn’t mean that everybody should like it because you like it. That doesn’t mean that it’s actions should not be criticised at all. If you don’t want to see criticism, just don’t see it. I will keep on criticise whatever to be criticised. There is no doubt about it.

 3. well, what if someone calls victim as culprit ? 5 people died , many injured. atleast without showing any sign of condolence you write an article which is ambiguous and telling indirectly as if bjp conspired all this. is it correct ? i questioned it through my comment and you confirmed and scolding me as extremist, supremacist and warning me!!! in many articles you criticized bjp, modi with even severe intensity then i criticized your article now. if you criticize modi it comes under criticism , but i do same it is SCOLDING. why double standards?? just tell me that ” i dont allow criticism of my articles” then i will not comment next time
  Tehseen Akhtar, the right hand of arrested Indian Mujahideen (IM) founder leader Yasin Bhatkal, has emerged as the mastermind of Patna serial blasts. the bomb used is very much similar to bodhgaya blasts (low intensity ones). patna police squeezed bomb making stuff, osama bin laden books etc from his house. unexploded bomb placed under the dias of modi is also detected.

 4. Victim as culprit? Good joke! Try to answer questions posed above.

  Victimisation of tens of karsevaks is answered with victimisation of hundreds of innocent muslims. Common people from both sides had been vitctimized. But who did get the fruits? Who achieved 10 years of CM-giri (and counting) and nomination for PM-giri?

  Just listen to your heart and soul. If you can do so, it makes you realize where actually is the truth, unless you resist it.

  Or, should I comfort myself that you don’t have such heart? Because, I remember you justifying Gujarath carnage in the name of action-reaction theory, as did Mr. Modi, our would be PM. I remember you justifying the brutal killings of Miyanmar muslims by non-violent Buddhists, readily accepted and assymilated into the great secular Hindu supremacists!

  What did you write? It is still there. “Shame on you”… is it critical of my article? You dare to say something about an ideology even if you know nothing agbout it. Is there any ideology in this article? No man, there is no ideology. There is only some circumstencial analysis and there are some facts of who said what. You decide this is marxist ideology. If you do not know something, better not talk about it. If you know it, learn to present it properly.

  Moreover, Hindu supremacism is an ideology. It is an extreme ideology which you possess in no unambiguous manner as I wrote in the preceding paragraph.

  Yes! It was ambiguous. Why, because the actual story is not out. Still there are no proofs. There is not yet any investigation, nor any evidence linking the arrested persons to the actual crime. And yet you decided everything because it suited your beliefs and supremacist ideology.

  Did I say BJP placed bombs? A big NO! Did I say Modi did it? Even bigger NO! What I said is so-and-so person said so-and-so. And I said BJP should take responsibility for pacifying people where they were actually in danger of being killed in blasts. News papers said there was a bomb blast even after Modi had left the venue. As you said there was a bomb under the venue. So why did BJP continue with the rally even when there was a bomb blast at the railway station hours before Modi arrived? Don’t you see any responsibility on the part of BJP? Just think.

  So, somebody keeps Bin Laden’s books and photos in his house/room/hideout/whatever and comes straight away to Modi’s rally and places crude bombs and explode them and then remains there unmoved?! If you want to believe these cock & bull stories, you can do so. I’ve no problems. But please never blame others for not beliving such nonsense that cannot satisfy even commonsense.

  BJP is a political party. It proposes certain ideology to the Indian masses. Modi is one of it’s leaders. So they are prone to criticism. And if you want to critise my articles just do it. But what you generally do is scolding people personally leaving aside the issue in question. You think that there is plenty of logic in what you produce which actually is hatred. Nothing but hatred. Whatever you dislike, no matter they are persons, groups, religions… you simply hate it. You simply spew venom on what you oppose and try to convince others that it is criticism. You do copy and paste jobs and convince me it is criticism.

  I’m really fed up with you. Sorry!

 5. మోడి ర్యాలిలో పేలుళ్ళు “యాద్రుఛ్ఛికం”- వృశ్చిక(దిగ్గి దా) వ్యాఖ్య!
  పేలుళ్ళు యాద్రుఛ్ఛికం మాటెలావున్నా కాంగ్రెస్ (యు.పి.ఎ.ప్రభుత్వ) పార్టీ పతనానికి విషపు వ్యాఖ్యలను విరజిమ్మి విర్రవీగుతున్న వృద్ధ వృశ్చికం దిగ్విజయ్. పెదాలలో పదాలు అర్ధాలకు బదులు అనర్ధాలను తెచ్చిపెట్టి రాబోయే ఎన్ని కలలో రాహుల్ ను హుష్ కాకీ! చెయ్యడం ఖాయం. పాము తన గుడ్లను తానె మింగినట్లు దిగ్గిదా కూడా కాంగ్రెస్ కు శల్యసారధ్యం వహించి అభాసుపాలు చేస్తున్నాడు.

 6. @Vijay Sekhar
  మీరు అంత తీవ్రంగా హెచ్చరించాల్సినంత అసభ్యంగా మిత్రుడు సాయి భార్గవ్ ఏమి మాట్లాడారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జరిగిన సంఘటనను మీకు ఇష్టం ‘వచ్చిన’ రీతిలో వండి వారిస్తే, చదివేవారు అనుమానపు దృక్కోణంలో చూసి, మీరు ‘అనుకున్న’ రీతిలో నమ్ముతారని భావించటం నా దృష్టిలో మూర్ఖత్వంతో సమానం. కాంగ్రెస్ మరియు భాజపా వారి మాటలను మీకు నచ్చిన రీతిలో అన్వయించడం వలెనే పైన మిత్రులు కాని, నేను కాని ఇలా భావిస్తున్నాం. మీరేమో ఇందులో మీ వర్ణనేమి లేనట్టు, జాతీయ మాద్యమంలో చెప్పిన విషయాలనే పుసగుచ్చి చెప్తున్నట్లు విశదీకరించారు. ఫై వ్యాసంలో మీ చాతుర్యాన్ని ఇక్కడ పరిశీలించండి…

  1) పేలుళ్లు జరగకుండా అరికట్టడంలో నిఘా సంస్ధల వైఫల్యం ఉంటుంది, నిజమే. కానీ ఏకంగా పేలుళ్లకే నిఘా సంస్ధలు ఎలా కారణం అవుతారో అంతుబట్టని విషయం.

  నేను: ‘నిఘా సంస్థల వైఫల్యమే పేలుళ్ళకి కారణం’ అన్న సుష్మ మాటలకు.., ‘ఏకంగా పేలుళ్లకు నిఘాసంస్థలే కారణం’ అన్న మీ వర్ణనకు ఎంత వ్యత్యాసం.

  2) ముఖ్యుల పర్యటనలకు అన్ని విధాలా భద్రతా చర్యలు తీసుకోవలసిన బాధ్యత భద్రతా సంస్ధల పైన ఉంటుంది. వారు ఎన్ని చర్యలు తీసుకున్నా జరగకూడని ఘటన జరిగితే వారు సరిగ్గా చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారని అర్ధం. కానీ వారి వైఫల్యమే పేలుళ్ళకి కారణం అని ఎలా అనగలం?

  నేను: భద్రతా సంస్థలు అన్ని చర్యలు తీసుకొని ‘జరగకూడని ఘటన’ జరిగితే మీ ప్రకారం వారిది తప్పు కాక పోవచ్చు, కానీ ఒకే మైదానంలో బహుళ సంఖ్యలో విస్పొటనాలు జరగడం, పేలని బాంబులు దొరకడం మరియు ఇవి బయట కూడా జరగడం. ఇప్పుడు ఒకసారి పై మీ ప్రశ్నను మీరు చదువుకోండి.

  3) ఈ బాంబు పేలిన తర్వాత బి.జె.పి నాయకులు ‘ఏమి లేదు, ఏమీ జరగలేదు. కారు టైరు పేలింది అంతే’ అని సభకు హాజరైన జనానికి సర్ది చెప్పారట. మరి కొద్ది గంటల తర్వాత వేదిక వద్దనే వరుసగా ఐదు బాంబులు పేలాయి. టాయిలేట్ లో బాంబు పేలినా, టైర్ పేలుడు అని సర్ది చెప్పి జనాన్ని అక్కడి నుండి కదలకుండా చేసిన బి.జె.పి నాయకులను 5గురి మరణానికి (పాక్షికంగా) బాధ్యులను చేయొచ్చా?

  నేను: భాజపా నాయకులు ఆ సమయంలో టపాసులూ, టైర్లు పేలిన సంబరాలు అని చెప్పి ఎవరినీ కదలనివ్వలేదు. అలా కాకుండా వేరే విధంగా చెప్పినట్లయితే భాయోత్పాతులు అయిన ప్రజలు పరుగులు పెడితే లక్షల మందిని అదుపు చేయడం ఎవరితరం మరియు జరిగే తొక్కిసలాటలో మరణించే వేల ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యులు. ఒకసారి పై మీ ప్రశ్నను చూడండి.

  4) ప్రసాద్ ప్రకారం ఎనిమిది నెలల ముందే పాట్నాలో మోడీ సభ ఖరారయింది. అంటే ఇది అక్టోబర్ ఆఖరి వారం కాబట్టి ఫిబ్రవరి ఆఖరి వారంలో మోడి పర్యటన ఖరారయి ఉండాలి. అప్పటికి జె.డి(యు), బి.జె.పి ఒకే గూటి పక్షులుగా కాపురం చేస్తున్నాయి. బి.జె.పి కూడా బీహార్ ప్రభుత్వంలో భాగస్వామి. ఈ రెండు పార్టీలు కలిసి ఉండగా మోడి బీహార్ పర్యటనకు నితీశ్ కుమార్ ఎన్నడూ ఒప్పుకోలేదు. ఎన్నికల ప్రచారానికి కూడా మోడిని ఆయన రానివ్వలేదు. అలాంటిది అప్పుడే మోడి పర్యటన ఎలా ఖరారయింది?

  నేను: ఈ పర్యటన కనీసం 6 నెలల ముందే ఖరారు అయ్యిందని నేను ఈనాడు పత్రికలో డజను సార్లు చదివాను. భాజపా జాతీయ నాయకులు కుడా అదే చెప్తున్నారు. అలా కానప్పుడు వారి మాటలను అబద్దాలుగా ఎవరైనా ఖండిస్తే దానిని మీరు నిరూపించగలరు.

  5) పోనీ నితీశ్ కి తెలియకుండా ఖరారయింది అనుకుంటే దానికి నితీశ్ ప్రభుత్వం బాధ్యురాలు కాదన్న వాదన వస్తుంది. ఎనిమిది నెలల ముందే అనడంలో ప్రసాద్, భద్రతా బాధ్యతలను కాలం పైన పెట్టారు. ఆ కాలంలో బి.జె.పి కూడా ప్రభుత్వంలో భాగస్వామి కనుక జరిగిన ఘటనకు బి.జె.పి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

  నేను: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే రాష్ట్ర పర్యటనా ప్రణాళిక ఎంత పూర్వం చేసుకున్నా కనీస తగిన సమయం ముందు అధికారికంగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి తీరాలి, అందునా అది ఏ విలాస, ఆద్యాత్మిక కార్యక్రమమో కుడా కాదు, లక్షల మంది సమీకరణతో కూడిన పని. మీకేమో నితీష్ ప్రభుత్వం భాద్యురాలు కాదన్న వాదన వినిపిస్తుంది. ఇక ప్రసాద్ భద్రతా బాద్యతలను కాలం పైన ఎలా నేట్టారో, ఎందుకు నేట్టారో మీకే తెలియాలి. అప్పుడెప్పుడో భాగస్వామిగా ఉన్నందున ఇప్పుడు జరిగిన అరాచకానికి భాజపా కారణమనే మీ తర్కం వుంది చూశారు, విజ్ఞులకు హాస్యాస్పదం.

  6) ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడి రాజకీయ ర్యాలీకి ముందు పేలుళ్లు జరిగాయి కాబట్టి ఆ పేలుళ్ళ వలన ఎవరు లాభం పొందుతారు అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. మరోవైపు ఎవరికి నష్టం అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం అంత కష్టం ఏమీ కాదు. కాబట్టి ఎలా చూసినా పేలుళ్లలో కాస్తో, కూస్తో బి.జె.పి బాధ్యత వచ్చి చేరుతోంది.

  నేను: ఇక ఇక్కడ మీ ఆలోచనల్ని కుండ బద్దలు కొట్టారు. జమాతే ఇస్లామీ హింద్ అనే సంస్థ కూడా సరిగ్గా ఇదే వాదనను వినిపించింది పేలుళ్ళ అనంతరం. ఒక పక్క హిందూ తీవ్రవాదమనే దానిని తెరమీదకు తీసుకొచ్చి భారతీయ కాంగ్రెస్ నాయకులను కోతులులా ఆడిస్తూ వోట్లు, అధికారంతో పబ్బం గడుపుకోడానికి సిద్ధంగా వున్న ఇటలీ సోనియా గాంధీ (ఆంటోనియో మేనియో)*కి, మీరనుకుంటున్నట్లు భాజపాకి ఇందులో పాత్ర వుంటే ఇంకేమైనా వుండిద్దా.( * ఇటలీ అని ఎందుకు వాడానంటే ఇటలీ పాస్పోర్ట్ మీద ఇప్పటికీ ఆంటోనియో మేనియో అనే వుండిద్ది. ద్వంద్వ పౌరసత్వం కొనసాగిస్తుంది. భారతీయ చట్టాల ప్రకారం అది ఎంతవరకు సబబో పరిశోధించి ఒక వ్యాసం వ్రాయగలరు మీరు.)

  ఇన్ని రాతలు మీరు వ్రాసి, ఇదేమని ప్రశ్నిస్తే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాకిస్థాన్ లష్కర్-ఎ-తోయబా తో సంబంధం వున్న ఇండియన్ ముజాహిద్హీన్ తీవ్రవాదులు ఇప్పటికే పట్టుబడ్డా కుడా దాని గురించి ఇంతవరకు మీరు వ్యాసం వ్రాయలేదు. దీని గురించి ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన కధనం మీకు నేను కింద అందిస్తాను.
  మీయొక్క ఆలోచనా విధానాన్ని ఇప్పటికైనా పునః పరిశీలించుకోవలసిన అవసరం ఎంతైనా వుందనేది నా ప్రగాఢ నమ్మకం. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’ అని మీరు పాటిస్తున్న నియమం అన్ని వేళలా వర్తించదు. మీయొక్క అంతర్జాతీయ, ఆర్థిక విశ్లేషణలు చాలా బాగుంటాయి. మీయొక్క ఆలోచనా విధానం మారేవరకు జాతీయ విశ్లేషణలకు కొంత విరామం ఇవ్వడం అవసరమనేది నా భావన.

 7. *రెండు పార్టీలు విడిపోయాక పేలుళ్లకు పధక రచన జరిగింది అనుకుంటే …ఎలా చూసినా పేలుళ్లలో కాస్తో, కూస్తో బి.జె.పి బాధ్యత వచ్చి చేరుతోంది*

  ఈ మధ్య బిజెపి పార్టి వారిని చంపిన పాకిస్తాన్ ప్రేరెపిత తీవ్రవాదులు దేశమంతా విస్తరించి చివరికి ఎంతో ప్రశాంతంగా ఉండే పుత్తురు లో దొరికారు కూడాను.తీవ్ర వాదూల నుంచి మోడి కి ముప్పు ఉందన్న విషయం ప్రభుత్వాలకి తెలియదా! నెలల ముందుగా మీటింగ్ పర్మిషన్ మొద|| పక్కన పెట్టి, విషయానికి వస్తే ఆ రోజు మీటింగ్ జరుగుతుందని ప్రభుత్వానికి తెలుసు,అనుమతి ఇచ్చింది కూడాను. మొడి పైన ఇటువంటి దాడులు జరగటానికి ఎంతో ఆస్కారం ఉంది. శాంతి భద్రతల విషయంలో అధికారంలో ఉండే నితిష్ కుమార్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అంతేకాని మీటీంగ్ పెట్టుకొన్నందుకు ఏ అధికారం లేని బి.జె.పి బాధ్యత వహించాలంటే ఎలా? దేశా ప్రధాని పదవికి పోటి చేసే అభ్యర్ధి తీవ్రవాదులనుంచి ప్రాణానికి ముప్పు ఉందని, కార్యాలం నుంచి విడీయో కాంఫెరెన్స్ ద్వారా స్పీచ్ ఇస్తాడా? జరగాల్సిన మీటింగ్ రద్దు చేసుకొని పోతాడా? మొడి వ్యక్తిత్వం ఎమైనా అమెరికా అధ్యక్షుడి లాంటివాడిదా? ట్విన్ టవర్స్ భవనాలు కూలిపోతే అమెరికా అధ్యక్షుడు అండర్ గ్రౌండ్ లో దాకొని, అంతా అయ్యాక టివి ముందరకొచ్చి చాలా గొప్ప ధైర్యవంతుడైనట్లుగా పోజులు కొట్టాడు.

 8. @VISEKAR
  “So, somebody keeps Bin Laden’s books and photos in his house/room/hideout/whatever and comes straight away to Modi’s rally and places crude bombs and explode them and then remains there unmoved?! If you want to believe these cock & bull stories, you can do so. I’ve no problems. But please never blame others for not beliving such nonsense that cannot satisfy even commonsense.”

  its not cock and bull story, read today hindu (http://tiny.cc/uq1q5w & http://tiny.cc/ov1q5w)- 5 more live bombs detected again. the accused (imtiyaz) have disclosed that their intention was only to trigger a stampede inside Gandhi Maidan where people had gathered in large numbers. bjp did right thing through not speaking about bomb otherwise there would be huge stampede. i doubt nithish conspired to eliminate modi otherwise how irresponsible his govt was in providing security to patna rally where 10 lakh people are supposed to arrive at rally. i dont understand what satisfies your commonsense, your views on gujarat riots,modi, bjp are correct but someone supports them or tell about islamic terrorism then it is nonsense!?!?!?

 9. in this context, i remembered my school day anniversary, our home minister was chief guest. one day before his arrival bomb squad thoroughly checked entire ground with metal/bomb detectors, some constables were placed on duty that entire night. trespassers were strictly prohibited. its just a casual anniversary function. it seems shocking every day one live bomb is popping up at GANDHI MAIDAN, its sheer negligence of nithish sarkar and bihar police

 10. పై వ్యాఖ్య లో చెప్పదలచుకొంది ఒకటె ప్రభుత్వ బాధ్యత అయితె తప్పకుండా ఉంది. దేశప్రధాని అభ్యర్ది బాంబుల దాడి జరగ వచ్చని లేక ఊర్లో ఇంకొక ప్రాంతంలో జరిగిందని మీటింగ్ ఆపితె, దేశప్రజలు హర్షించరు. ఎవ్వరు కూడ పిరికి వారు నాయకులు గా ఉండటానికి సమ్మతించరు. మీకు నేను రాసింది నచ్చకపోతె, వ్యాఖ్యను ప్రచూరించకపోయినా ఎమి అనుకోను. ఒక దేశ ప్రధాని అభ్యర్ది కోణం నుంచి చూస్తూ అభిప్రాయం రాసాను.

 11. శ్రీనివాస రావు గారూ,

  మీరు కొత్తగా చెప్పిన విషయాలు ఏమీ లేవు. ఏమీ విషయం లేని చోట ఏదో ఉందని భ్రమించినట్లు కనిపిస్తోంది. సాయి భార్గవ్ గారికి ఇచ్చిన సమాధానంలోని అంశాలే చాలావరకూ మీకు వర్తిస్తాయి. ఒకటీ రెండూ మీకు విడిగా చెప్పాల్సినవి ఉన్నాయనుకుంటా.

  “నిఘా సంస్ధల వైఫల్యమే పేలుళ్ళకి కారణం” అని సుష్మా గారు అన్నారని మీరూ చెప్పారు. నేనేమన్నాను? ఏకంగా “పేలుళ్లకే నిఘా సంస్ధలే కారణం” అన్నారని చెబుతూ ‘అలా ఎలా అవుతారో అంతుబట్టని విషయం’ అన్నాను. ఇందులో ‘ఏకంగా, ఎలా అవుతారో అంతుబట్టని విషయం’ అన్నవి నావి. అవి ఆమె అన్నారని నేను అనలేదు. అవి implied. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ప్రత్యేకంగా చెప్పాలేమో అని మీరు తీసిన అర్ధం బట్టి అనిపిస్తోంది. ఆ సంగతి గమనంలో ఉంచుకుంటాను.

  అది పెద్ద మైదానం. జనం అప్పటికే రాళ్ళు వేసి ఒకటీ రెండూ బాంబుల్ని పేల్చినంత పెద్ద మైదానం అది. ఫోటోలు, వీడియోల్లో చూస్తే చాలా చోట్ల ఖాళీలు నాకు కనిపించాయి. మైకుల్లో హెచ్చరిస్తే జరిగే తొక్కిసలాటలో వేలమంది (?) మరణిస్తే ఎవరు బాధ్యులు అని మీరు ప్రశ్నిస్తున్నారు. కానీ రవి శంకర్ ప్రసాద్ గారేమో పోలీసులు ప్రతిఒక్కరినీ ఒళ్ళంతా తడిమి (ఫ్రిస్కింగ్) చూసి లోపలికి పంపాల్సి ఉండగా అలా చేయలేదని ఆరోపించారు. తొక్కిసలాటలో వేలాది మంది చనిపోయే అవకాశం ఉన్నంతమంది జనాన్ని ప్రతి ఒక్కరినీ ఒళ్ళంతా తడిమి చూసి లోపలికి పంపడం ఎలా సాధ్యం అంటారు?

  మరో సంగతి ఏమిటంటే: జైట్లీ గారు చెప్పిందాని ప్రకారం సభ ప్రారంభం కాక మునుపే పోలీసులు ప్రమాదం గురించి ఆయన్ను హెచ్చరించారు. మైదానం ఖాళీ చేయించడం గురించి కూడా జైట్లీ ఆలోచించారు. ఆ విషయమై పోలీసులతో కూడా చర్చించారు. కానీ మోడీ ప్రసంగం లేదని తెలిస్తే జనం వేదిక మీదికి తోసుకొచ్చి తొక్కిసలాట జరుగుతుందని ఆయన భయపడ్డారట. అందుకని జనానికి చెప్పలేదట.

  అనగా కనీసం కొన్ని గంటల ముందయినా లేదా గంట ముందయినా బాంబు పేలుళ్ళ దరిమిలా సభ రద్దు చేసుకునే ఆలోచన నిర్వాహకులకు, బి.జె.పి నాయకులకి వచ్చింది. కానీ వారి దృష్టి సభ ఎలాగైనా నిర్వహించాలన్న దానిపైనే ఉంది. దానికి వాళ్ళు మరొక కారణం చెబుతున్నారు.

  ఇక్కడ మీకు బి.జె.పి కి అనుకూలంగా ఆలోచించడమే ఇష్టం. నేనేమో ఆ ఐదుగురు కూడా చనిపోకుండా చూడగల అవకాశం బి.జె.పి నాయకులకు, సభా నిర్వాహకులకు వచ్చిందని గుర్తించాను. కాబట్టి ఇక్కడ అభిప్రాయాలు కలిసే అవకాశం లేదు. ఇద్దరం అక్కడ ఆగిపోయి మరో అంశం మీదికి సాగిపోవడమే మనం చేయగలిగిన పని! దాని బదులు ‘shame on you’ ఒకాయనా, ‘మూర్ఖత్వం’ అని మరోకాయనా వదరితే ఏమవుద్ది? చర్చ జరగదు. అంతిమంగా మిగిలేది విషయం కాదు, పరస్పర దూషణ, ప్రతి దూషణలే.

  8 నెలల ముందు సభ అనుకున్నామని బి.జె.పి నేత చెప్పినట్లు ది హిందూ చెప్పింది. పోనీ మీరు చెప్పినట్లు 6 నెలలు అనుకున్నా ఏప్రిల్ లో ప్లాన్ చేశారని అనుకోవాలి. ఇరు పార్టీలు విడిపోయింది జూన్ చివర. అంటే అప్పటికి కూడా కలిసే ఉన్నారు. కాబట్టి మీ పాయింట్ కి ఇక్కడ అవాకాశం లేదు.

  కాంగ్రెస్, బి.జె.పి, ఎస్.పి, బి.ఎస్.పి, టి.డి.పి ఇత్యాది పార్టీలన్నీ వ్యక్తుల పార్టీలు కావు. అలా అనుకుంటే తెలుసుకోవాల్సింది చాలా ఉందని అర్ధం. అవి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు. ఆ ప్రయోజనాలను కాపాడే వరకే వారి వ్యక్తిగత పాత్ర పరిమితం అవుతుంది. ఎన్నికల పోరు, రాజకీయ బోధనలు, సో కాల్డ్ సిద్ధాంతాలు చెప్పేవరకే వారి బోధనలు పరిమితం. అసలు ఆర్ధిక ప్రయోజనాలు, విధానాల విషయంలో వారిలో వారికి ఏకాభిప్రాయం ఉంటుంది. జనం హక్కులు హరించడంలో, కాంట్రాక్టులు పంచుకు తినడంలో, ప్రశ్నించినవాడిని అణచివేయడంలో అవన్నీ ఒకటే. కాబట్టి ఇటలీ వాళ్ళనీ, ఇంకోటనీ ద్వేషం పెంచుకుంటే సాధించేది ఏమీ ఉండదు. అర్ధం చేసుకోగలిగేది కూడా ఏమీ ఉండదు.

  కాలం పైకి నెట్టడం అంటే కాలమే దానికి కారణం అని కాదు. ఇది గ్రాహ్యానికి సంభంధించిన సమస్య. ‘8/6 నెలలు ముందే’ అన్నారు కదా. దానర్ధం కాలం ఒక ఫ్యాక్టర్ గా ఈ అంశంలో ఆయన చెప్పారనేగా అర్ధం. ఆ కోణంలో కాలం పైకి నెట్టారని చెప్పాను.

  నేను దేని పైన వ్యాసం రాసేదీ, రాయనిదీ అంతా నాకు సంబంధించిన విషయం. నా సమయానికీ, శ్రమకీ సంబంధించిన విషయం. రాస్తే చదవండి. చదివి విమర్శ చేయగలిగితే చేయండి. కానీ ఏది రాయాలీ, రాయకూడదు అన్నది నాకు చెప్పడానికి దయచేసి ఎప్పటికీ ప్రయత్నించొద్దు. నా ఆలోచనా విధానం నా స్వవిషయం. అందులో మీ బోధనలు అనవసరం.

  శత్రువు, మిత్రుడు అంటూ సంబంధం లేని సూత్రాలు అన్వయిస్తూ ఏవేవో నాకు అంటగట్టడం పూర్తిగా అవాంఛనీయం. మీకు నచ్చితే చదువుకొండి. నచ్చకపోతే ఒక పద్ధతిలో విమర్శ చేయండి. కానీ మీకు నచ్చిన పద్ధతిలోనే రాయమంటే… అది కుదరని పని. ఇంకెప్పుడూ ఇలాంటి పనికిమాలిన సలహాలు నాకు ఇవ్వద్దు.

  సాయి భార్గవ్ రాసిన దూషణల వ్యాఖ్యలు నేను చాలా తొలగించాను. తొలగించాను కాబట్టి అవేమిటో మీకు తెలిసే అవకాశం లేదు. హెచ్చరించాల్సిన అవసరం వచ్చింది కాబట్టే హెచ్చరించాను. తెలిసీ తెలియకుండా, తగుదునమ్మా అంటూ ఆర్తత్రాణ పరాయణునిలా మీరు పంచె జార్చుకుని పరుగెట్టుకుని రావడం మీకు విజ్ఞత కావచ్చు, నాకు మాత్రం కాదు. అది కేవలం తెలిసీ తెలియనితనం!

  మిగిలిన అంశాలకు సమాధానం సాయి భార్గవ్ గారికి ఇచ్చిన రిప్లైలో ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ వివరించే ఓపిక నాకు లేదు.

  దయచేసి వ్యక్తిగత దూషణలు చేయకండి. ప్రతి దూషణకు క్షణం పట్టదు. మీరది గమనించాలి. మీ నమ్మకాలపైనా, బి.జె.పి నాయకులపైన మీకున్న విపరీత అభిమానం అనవసర దూషణలకు మిమ్మల్ని పురిగొల్పుతోంది. గమనించి నిగ్రహం వహిస్తే చర్చ సజావుగా నడుస్తుందని మీ దృష్టికి తెస్తున్నాను.

  తిరుపాలు గారి పేరును మీ యిష్టం వచ్చినట్లు మార్చడం మీ హక్కని భావిస్తున్నారా అని మిమ్మల్ని అడిగాను. దానికి సమాధానం లేదు. ఎందువల్ల? మీకు లేని మర్యాదను ఇతరులకు బోధించాలని ఎందుకు చూడడం?

 12. ఇది తెలుగు బ్లాగ్. చర్చ కూడా తెలుగులోనే జరిగితేనే ఉపయోగం. తెలుగు సరిగా అర్ధం కావడం లేదేమోనని నేనూ ఆంగ్లంలో సమాధానం ఇవ్వాల్సి వస్తోంది. మిత్రులు లేఖిని ఉపయోగించాలని మనవి. మన చర్చ బూడిదరాలినట్లు ఉండకూడదంటే తెలుగులోనే చర్చించుకోక తప్పదు.

  @SriRam and others: జరిగిన ఘోరంలో బి.జె.పి కి ఎంతవరకూ బాధ్యత ఉన్నదో, అది జరగకుండా ఎలా నివారించి ఉండవచ్చో నేను చెప్పాను. ఆ అంశంతో అంగీకరించకపోతే అది వేరే విషయం. అదే అంశాన్ని మళ్ళీ మళ్ళీ వివరించడం వీలు కాదని మిత్రులు గమనించాలి. ఈ చర్చలోనే మనం అంతా తేల్చేయలేము. చర్చలోకి వచ్చిన అంశాలను పరిగణనలో ఉంచుకుంటే సరిపోతుంది.

 13. గిడుగు రామమూర్తి పంతులు గారి ఆత్మ క్షోభించదు. ఎందుకంటే తెలుగు ప్రజల భాష. ప్రజల భాష ప్రజలదగ్గరికెల్లాలని ఆయన లక్ష్యం. రాజుల దగ్గరికి కాదు.అందుకు సంతోషిద్దాం.

 14. నిఘా విభాగం ఎంత శోధించినా ఒకొక్కసారి సంఘటనల వెనక రాజకీయం ప్రభుత్వ వైఫల్యాలకు అద్దంపడుతుంది. దిగ్విజయ్ వ్యాఖ్య “యాద్రుఛ్ఛికం” అనేది హాస్యాస్పదం. విస్ఫోటనలు ప్రకృతి వైపరిత్యం కాదు మానవ తప్పిదం. అలాని సరిపెట్టితే, మానవత్వం హర్షించదు. ఒక రాజకీయ ప్రముఖుని అంతం చేసే కుట్రలో ఎంతోమందిని భాగస్వామ్యం చెయ్యడం పైశాచికత్వం. బి.జే.పి. ఎందుకు, ఏమాశించి భాగ్స్వామ్యంఅవుతుంది?

 15. నేను నా అభిప్రాయం,ఎదైనా తెలిసిన విషయముంటే చెపుతాను. ఒక కొత్తకోణంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. దానిపైన మీరు వివరణ ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉండదు. ఎన్నోవ్యాఖ్యలు వస్తూంటె అందరికి జవాబులివ్వటం సాధ్యం కాకపోవచ్చును కూడా. మీరు ఇస్తే మీ అభిప్రాయం ఎమిటో తెలుస్తుంది అంతే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s