విభజన అధికారం పార్లమెంటుదే – ప్రొ.కె.నాగేశ్వర్ (10టివి)


K Nageswar

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు. కార్మికులు, ఉద్యోగుల భాగస్వామ్యంతో ఏర్పడిన 10టి‌విలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్ట్రాల విభజనపై రాజ్యాంగం ఏమి చెబుతోందో వివరించారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ తలా ఒక ప్రకటన చేస్తూ జనాన్ని రకరకాలుగా మభ్య పెడుతూ  గందరగోళంలో పడేస్తున్న పరిస్ధితుల్లో నాగేశ్వర్ గారు ఇచ్చిన వివరణ చాలా ఉపయోగంగా ఉంది. అందులో కొంత భాగం:

” ప్రస్తుతం రాష్ట్ర విభజనపై నేతలు కావాలనే గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఏర్పాటు అధికారం పార్లమెంటుకే ఉంటుంది. రాష్ట్రం పేరు మార్చాలన్నా, సరిహద్దులు పెంచాలన్నా, విభజించాలన్నా, కలపాలన్నా..సర్వాధికారాలు పార్లమెంటుకే ఉంటాయి. విభజనపై ముసాయిదా బిల్లును రాష్ట్రపతి శాసనసభకు పంపుతారు. దానిపై అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారు.

అంతేకానీ..పార్లమెంటులో ఆమోదించాల్సిన బిల్లును శాసనసభ తిరస్కరించలేదు. రాజ్యాంగంలోని 5వ సవరణకు ముందు ఆర్టికల్ 3 ప్రకారం విభజన తీర్మానం పెట్టబోతున్నప్పుడు సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకోవాలి. సవరణ తర్వాత బిల్లులోని అంశాలపైనా శాసనసభ అభిప్రాయాలు తీసుకోవాలి.

సంప్రదింపు అంటే ఆమోదం కాదు..


2009లో హరిద్వార్ జిల్లా కేసులో సుప్రీంకోర్టు ఓ తీర్పు చెప్పింది. దాని ప్రకారం సంప్రదింపు అంటే ఆమోదం కాదు. బిల్లుపై పార్లమెంటు శాసనసభను సంప్రదిస్తుంది కానీ దాని అభిప్రాయాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదు. ఇది తెలిసి కూడా నేతలు బిల్లును ఓడిస్తాం, తిరస్కరిస్తాం అని ప్రజలను మోసం చేస్తున్నారు. సుప్రీం తీర్పు, ఆర్టికల్ 3 దేని ప్రకారమైనా..బిల్లులోని అంశాలపై శాసనసభ తన అభిప్రాయాలను మాత్రమే చెబుతుంది. ఇక తీర్మానం శాసనసభకు వస్తుందా లేదా అని రాజ్యాంగంలో లేదు. అయినా…

ఇంకా మిగిలిన అంశాలయిన

ఎపి పునర్వ్యవస్ధీకరణ చట్టం..

రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదు

కోర్టుల జోక్యం ఉండదు

ల కోసం 10టివి వెబ్ సైట్ నే సందర్శించండి! ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాటల పూర్తి సారాంశాన్ని అక్కడ వీడియోలో కూడా చూడొచ్చు.

4 thoughts on “విభజన అధికారం పార్లమెంటుదే – ప్రొ.కె.నాగేశ్వర్ (10టివి)

  1. నాగేశ్వర్ చాలా క్లియర్ గా వివరించారు. ఇది విన్న ఎవరికైనా సందేహం అన్న ప్రశ్నే తలెత్తదు.
    మరి నాకిప్పటికీ అర్థం కానిది, సీఎం లాంటి వ్యక్తి, ఉండవల్లి లాంటి మేథావి, కూడా విభజనను అడ్డుకుంటామని ఎందుకు చెబుతున్నారు…?
    కొంపదీసి కావాలనే సీమాంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నారా…?

  2. తేది 21.10.13 నాటి గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ వివరణని కూడా చూడండి. సీమాంధ్ర నాయకుల మాటలలోని మోసం క్లియర్ గా అర్థం అవుతుంది.

వ్యాఖ్యానించండి