ఈ జైపూర్ బాల మాంత్రికుడి మేజిక్ చూడండి -వీడియో


జైపూర్ లో స్వదేశీ, విదేశీ టూరిస్టులను తన కనికట్టుతో కట్టి పడేస్తున్న బాల మాంత్రికుడి చిట్టి పొట్టి మాయాజాలం చూడండి. భుజానికి గుడ్డ సంచి తగిలించుకుని, అందులో కాసిన్ని మేజిక్ సరంజామా నింపుకుని తెచ్చి టూరిస్టులను ఆకర్షిస్తూ పొట్ట పోసుకోవడం ఈ బాలుడి దినచర్యలా కనిపిస్తోంది.

బాలుడి మేజిక్ అభినందనీయమే అయినా ఇంత చిన్న వయసులో తన పొట్ట తానే నింపుకోవలసి రావడం ఈ బాల మాంత్రికుడి వెనుక దాగిన ఒక విషాధం. మన పుణ్య భూమిలో ఇలాంటి ప్రతిభావంతులైన పిల్లలకు కొదవ లేదు గానీ వారిని ఆదరించి చదువు చెప్పి మరింత ప్రయోజకులను చేసే వ్యవస్ధకే భారీ కొదవ ఉంది.

ఎంత పెద్ద పేరు మోసిన మెజీషియన్ అయినా తనకంటూ సొంత సరంజామా లేకుండా మేజిక్ చేయలేరు. కాకపోతే ఖరీదయిన పెద్ద మాంత్రికులకు మందీ, మార్బలమూ, చప్పట్లతో అభినందించడానికి సదా సిద్ధంగా ఉండే ప్రేక్షక మహాశయులూ ఉంటే, ఇలాంటి వారికి వీధులు, చౌరాస్తాలే వేదికలు. చేతి సంచులే సరంజామాను రవాణా చేసే సాధనం.

ఈ వీడియో ఫేస్ బుక్ లో లభించింది. ఇప్పటికే లక్ష పదివేలకు పైగా లైక్ లూ, లక్ష పాతిక వేలకు పైగా షేర్లూ ఈ వీడియోకి దక్కాయి.

One thought on “ఈ జైపూర్ బాల మాంత్రికుడి మేజిక్ చూడండి -వీడియో

  1. చాలా బాగున్నాయి. ఇటువంటి బాల కళాకారుల ప్రతిభను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయాలి.
    అద్భుతంగా అన్నీ మాయం చేస్తున్న ఈ చిన్నారి మాంత్రికుడు…తన పేదరికాన్ని కూడా మాయం చేసే విద్య నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది.

వ్యాఖ్యానించండి