రాష్ట్రపతి పాలన ఎత్తుగడ? -కత్తిరింపు


తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, సీమాంధ్ర ఉద్యమం, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక అయోమయ సృష్టి ఇత్యాది అంశాలపై కాస్త వాస్తవానికి దగ్గరగా విశ్లేషణలు, విమర్శలు, సూచనలు ప్రచురిస్తున్నది ఆంధ్ర జ్యోతి దిన పత్రికే అనుకుంటాను. సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఇతర పత్రికలు, ఛానెళ్ల కంటే ఒక అడుగు ముందే ఉన్నది ఆ పత్రిక.

‘రాష్ట్రపతి పాలన ఎత్తుగడ?’ శీర్షికతో వచ్చిన ఈ విశ్లేషణ ఈ రోజు (అక్టోబర్ 11, 2013) జ్యోతిలో ప్రచురించబడింది. కేంద్ర కేబినెట్ తెలంగాణ ఏర్పాటుపై తీర్మానం ఆమోదించిన రోజే ఉదయం నుండి ఆ సంగతిని చూచాయగా ఏ.బి.ఎన్ ఛానెల్ చెప్పడాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు తెలంగాణ లీకులకు ఈ పత్రిక/చానెల్ ను ఎన్నుకున్నారా అన్న అనుమానాలు కలగడం సహజం. కేంద్రం అడుగులను ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా ఇవ్వడంలో జ్యోతి ముందు ఉండడానికి కారణం అదే కావచ్చా?

ఈ అనుమానాల సంగతి ఎలా ఉన్న తెలంగాణకు సంబంధించినంతవరకు ఆచరణాత్మక దృక్పధాన్ని, విశ్లేషణను అందిస్తోంది ఈ పత్రిక. ఆ వరుసలో వెలువడిన ఈ విశ్లేషణ పాఠకులకు ఉపయోగపడవచ్చు. జ్యోతి చూసే అలవాటు లేనివారికి ఇది ఉపయోగం. బొమ్మపై క్లిక్ చేస్తే పెద్ద సైజులో చూడవచ్చు.

President rule -Jyothi

2 thoughts on “రాష్ట్రపతి పాలన ఎత్తుగడ? -కత్తిరింపు

  1. RTC కార్మికులు ఎందుకు సమ్మె చేశారో తెలుసా? తెలంగాణా కంటే సీమాంధ్రలో బస్సులు & డిపోల సంఖ్య ఎక్కువ కానీ సీమాంధ్రలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ శాతం తక్కువ. పైగా సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కి నడపడానికి వందలాది ఖరీదైన బస్సులు కొనుగోలు చేశారు. వాటి ఆక్యుపెన్సీ రేట్ ఇంకా తక్కువ. తెలంగాణాలో బస్సుల సంఖ్య తక్కువ కాబట్టి అక్కడ ఆక్యుపెన్సీ రేట్ ఎక్కువ. తెలంగాణాలో జనంతో కిక్కిరిసిపోయిన బస్సులు నడిపి వాటి వల్ల వచ్చే ఆదాయంతో సీమాంధ్ర RTC ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారు, అందువల్లే RTC ఉద్యోగులు తెలంగాణాకి వ్యతిరేకంగా సమ్మె చేశారు కానీ తమ పిల్లలకి హైదరాబాద్ ఐ.టి. కంపెనీలలో ఉద్యోగాలు వస్తాయనుకుని కాదు.

వ్యాఖ్యానించండి