పత్రిక చదువరి: “ద్రవ్యోల్బణ వ్యతిరేక చర్యలు పని చేసి ధరలు కుప్ప కూలినై”
గృహిణి: “భలే – ఇంకేం, ఇక షేర్లు కొనేద్దాం”
మరుగుజ్జు వంత: “ఇంకేం, కేకు తినేద్దాం”
రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్ద మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో ఈ కార్టూన్ తెలియజేస్తోంది. అంతేకాదు, వారి మాటలకు ఉండే ద్వంద్వార్ధాలు, ఒక్కోసారి బహుళార్ధాలు కూడా వస్తాయన్న సంగతినీ సూచిస్తోంది.
ద్రవ్యోల్బణం ఆగస్టు చివరి నాటికి 6.1 శాతానికి పెరిగిందని కాబట్టి ధరల్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచుతున్నామని ఆర్.బి.ఐ గవర్నర్ ప్రకటించి కొద్ది రోజులే అయింది. ఐతే ఏళ్లతరబడి 10 శాతానికి పైగా ద్రవ్యోల్బణాన్ని జనం నెత్తిమీద రుద్దిన పాలకులకు 6.1 శాతం ద్రవ్యోల్బణం చాలా తక్కువే మరి!
అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ తన ఉద్దీపన పధకాన్ని ఉపసంహరించడం లేదని, మరికొంత కాలం వేచి చూస్తామని ప్రకటించిన రోజు 600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్, ద్రవ్యోల్బణం కట్టడికి రెపో రేటును 0.25 శాతం పెంచుతున్నట్లు ఆర్.బి.ఐ ప్రకటించిన వెంటనే 600 పాయింట్లకు పైగా పతనం అయింది. ‘జి.డి.పి వృద్ధి కోసమే ద్రవ్యోల్బణం కట్టడికి చర్య తీసుకున్నాను తప్ప మరోకందుకు కాదని గవర్నర్ రఘురాం రాజన్ వివరణ ఇచ్చుకున్నాక కొద్దిగా కోలుకుని నష్టాన్ని 400 పాయింట్లకు పరిమితం చేసుకుంది.
కార్టూన్ లో విద్యావంతుడు ఈ వార్తనే ప్రభుత్వ పెద్దలు ఎలా మార్చి చెప్పారో చదువుతుంటే పాపం ఆ నులక మంచం మీద కూర్చున్న పెద్దాయన ధరలు ఎప్పుడు తగ్గాయబ్బా అని హాశ్చర్యపోతుంటే, తగ్గింది నిత్యావసర సరుకుల ధరలు కాదు, షేర్ ధరలు అని నీళ్ళ బిందె మోసుకొస్తున్న గృహిణి పరోక్షంగా వివరణ ఇచ్చింది.
ఈ కార్టూన్ కి తీయదలిస్తే రెండు మూడు అర్ధాలు తీసుకోవచ్చు.
ఒకటి: సరుకుల ధరలు తగ్గితే మిగిలిన కాస్త డబ్బును పురుష పుంగవులు షేర్లకి తగలేస్తున్నారని.
రెండు: గృహిణులు కూడా షేర్ మార్కెట్ల మాయాజాలంలో మునిగిపోయే విధంగా ఫైనాన్స్ మార్కెట్లు దేశాన్ని ప్రభావితం చేశాయని.
మూడు: షేర్ ధరల పతనాన్ని ‘సరుకుల ధరల పతనం’గా చెబుతూ నాయకులు గొప్పలు పోతున్నారని.

ఇంత జరుగుతున్నా, చివరికి చదువుకున్న వాళ్లు కూడా తమ వొటు హక్కుని సరిగ్గా వినియొగించరు ఏందుకు ? కేవలం మన కులానికి చెందిన వాడికే వొటు !! అందుకే జగన్ కి ఇంకా వొటు వెసేవాళ్లు ఉంటారు.