దారికొచ్చిన అద్వానీ


Iron man

“చూశావా మరి! వాళ్ళ మధ్య విభేదాలని ఇస్త్రీ చేసేసుకుంటారని నేను ముందే చెప్పలేదా?”

మొత్తం మీద అద్వానీ దారికొచ్చారు. ఛత్తీస్ ఘడ్ పర్యటనలో నరేంద్ర మోడిపై ప్రశంసలు కురిపించడం ద్వారా బి.జె.పి వృద్ధాగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ మోడి ప్రధాని అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలిపారు. మోడికి ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వం కట్టబెట్టడం ద్వారా బి.జె.పి చేసిన ప్రయత్నం సఫలం అయితే దేశం అంతా గుజరాత్ నమూనా విస్తరిస్తుందన్న ఆశాభావాన్ని కూడా అద్వానీ వ్యక్తం చేశారు. ‘బోడి, మోడి గొప్పేముందట? ఆయన వచ్చేనాటికే గుజరాత్ అభివృద్ధి అయి ఉంది. ఆ మాటకొస్తే వెనుకబడిన మధ్య ప్రదేశ్ ను అభివృద్ధిలోకి తెచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ అసలు వీరుడు అవుతాడు’ అని వ్యాఖ్యానించిన అద్వానీ చివరికి స్వ శిబిరం పూర్తిగా ఖాళీ కావడంతో తాను కూడా మోడికి జిందాబాద్ కొట్టక తప్పలేదు.

రాయపూర్ లోని ఒక బహిరంగ సభలో సోమవారం ప్రసంగించిన అద్వానీ గుజరాత్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రశంసించడం ద్వారా తాను నరేంద్ర మోడి ప్రధాని అభ్యర్ధిత్వానికి ఆమోదం చెబుతున్నానని పరోక్షంగా ప్రకటించారు. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నడిపిన రాయబారం ఫలితంగానే అద్వానీ ఈ విధంగా దారికొచ్చారని బి.జె.పి అంతర్గత వనరులను ఉటంకిస్తూ ది హిందూ తెలిపింది.

“అద్వానీ, రమణ్ సింగ్ లు రాయపూర్ నుండి ఉత్తర ఛత్తీస్ ఘడ్ లో కార్యక్రమం జరుగుతున్న చోటికి ఒక చార్టర్డ్ విమానంలో వెళ్లారు. ఈ విమానంలో ఇతరులు ఎవరూ ఎక్కవద్దని ముఖ్యమంత్రి (రమణ్ సింగ్) మమ్మల్ని కోరారు. ఛత్తీస్ ఘడ్ వేదికగా మోడి అనుకూల ప్రకటన చేయాల్సిందిగా అద్వానీకి నచ్చజెప్పడానికి బహుశా ఈ ప్రయాణం ఆయనకు సహాయపడి ఉండవచ్చు” అని అద్వానీ, సింగ్ లు ఇరువురికీ సన్నిహితంగా మెదిలే ఒక సీనియర్ బి.జె.పి నాయకుడు చెప్పారని పత్రిక తెలియజేసింది.

గుజరాత్ లోని గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా తెచ్చిన ఘనత మోడీదేనని, మోడీ పైన ఉంచిన నమ్మకం ఫలవంతం అయితే (బి.జె.పి అధికారంలోకి వచ్చి మోడి ప్రధాని అయితే) బి.జె.పి ప్రభుత్వాలు అందజేసిన సుపరిపాలన దేశం అంతటికీ విస్తరించే అవకాశం వస్తుందనీ అద్వానీ వ్యాఖ్యానించారు. మధ్య ప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్ ఘడ్ లో రమణ్ సింగ్, కర్ణాటకలో యెడ్యూరప్ప తదితరులంతా తమ తమ ప్రజలకు సుపరిపాలన అందజేశారని అద్వానీ ఇస్తున్న సందేశం!?

ఏమిటా సుపరిపాలన? పదుల వేల కోట్ల ఖరీదు చేసే ఓబుళాపురం, బళ్ళారి ఇనుప గనులను అక్రమంగా తవ్వి తీసి చైనాకు ఎగుమతి చేయడం ద్వారా వేలాది కోట్ల నల్లధనం కూడబెట్టేందుకు గాలి బ్రదర్స్ కు అవకాశం ఇచ్చిన యెడ్యూరప్పది సుపరిపాలనా? వీళ్ళు పొద్దున లేస్తే తిట్టే దేశాల జాబితాలో చైనాది మొదటి స్ధానం కాదా? లోకాయుక్త చేత పచ్చి అవినీతిపరుడుగా నిర్ధారించబడిన యెడ్యూరప్పది సుపరిపాలనా?

సో కాల్డ్ స్వతంత్ర భారతావనిలో మొట్టమొదటిసారిగా మత దురహంకార దాడులను, విధ్వంసక మారణకాండను ‘ప్రతీకార చర్య’ పేరుతో సమర్ధించిన నాయకుడిది సుపరిపాలనా? ముస్లిం నరమేధంపై విచారణ జరగకుండా సంవత్సరాల తరబడి విచారణను తొక్కిపెట్టడం, ధైర్యం చేసి విచారణకు సిద్ధపడిన పోలీసు అధికారులను, స్వచ్ఛంద సంస్ధల నాయకులను అక్రమ కేసులతో వెంటాడి వేధించడం సుపరిపాలనా?

ఛత్తీస్ ఘడ్ లో వేలాది గిరిజనుల పైన పెట్టీ కేసులు బనాయించి, కనీస విచారణ, కోర్టు హాజరుకు కూడా నోచుకోకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గేలా జాగ్రత్త తీసుకోవడం సుపరిపాలనా? ఒక ఆదివాసీ గిరిజన మహిళా టీచర్, నక్సలైట్లకు సహకరిస్తున్నారన్న అక్రమ కేసులు మోపి విచారణ పేరుతో ఆమె రహస్యాంగాల్లో లాఠీలు, రాళ్ళు జొనిపిన జిల్లా ఎస్.పి కి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అవార్డు ఇప్పించి సత్కరించడం సుపరిపాలనా? రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల దుర్మార్గాలను లోకానికి చెబుతున్నందుకు ఆ గిరిజన టీచర్ కి మతిచలించిందని ముద్ర వేయడానికి ప్రయత్నించడం సుపరిపాలనా?

బహుశా రధయాత్రతో మత కల్లోలాలను రేపిన అద్వానీకి ఇవన్నీ సుపరిపాలనల్లా కనిపించడం మామూలే కావచ్చు! ఓ కాంగ్రెస్ నేత అన్నట్లు దేశ రాజకీయాల్లో మతతత్వాన్ని చొప్పించి పబ్బం గడుపుకునే రాజకీయాలకు ఆద్యుడు అద్వానీయే! అందుకే అద్వానీజీకి సుపరిపాలనకు, దుష్పరిపాలనకు మధ్య ఉన్న అగాధం ఎన్నడో పూడిపోయింది గావాల్ను?

తన ప్రియ శిష్యుడు మోడి విషయంలోనే అద్వానీ మార్చిన మాటలెన్ని? గుజరాత్ మారణకాండకు బాధ్యుడిని చేస్తూ అప్పటి ప్రధాని వాజ్ పేయి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడిని తొలగించడానికి పూనుకున్నపుడు అడ్డు పడింది అద్వానీయే అని చెప్పని పత్రిక లేదు. 2009లో అద్వానీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేవరకూ ఆయనకు మోడి మంచి బాలుడే. తీరా 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిత్వానికి మోడి పోటీ రావడం మొదలు పెట్టినప్పటి నుండీ మోడి అకస్మాత్తుగా చెడ్డబాలుడైపోయాడు! అప్పటిదాకా చుక్కల్లో కనిపించిన గుజరాత్ అభివృద్ధి నేలబారుదైపోయింది! మోడి అంతటి అభివృద్ధి కాముకుడు దేశంలోనే లేడన్న మనిషికి అకస్మాత్తుగా అనేకమంది ప్రత్యామ్నాయాలు -సుష్మా, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిశ్ గడ్కారీ, రాజ్ నాధ్ సింగ్… ఇలా ఒకరేమిటి, అందరూ మోడి కంటే ఒక అంగుళం ఎత్తుగా కనపడనారంభించారు.

ఇప్పుడేమో, తప్పదనుకున్నాక, తప్పనిసరి అయ్యాక, సుష్మా, మురళీ మనోహర్ లాంటి వారు కూడా తన శిబిరం వీడి మోడి శిబిరంలో చేరిపోయాక, దారి తెన్నూ కానని క్షణాల్లో అద్వానీజీకి మళ్ళీ మోడీ సాక్షాత్కారం లభించింది. రాయపూర్ లో, రమణ్ సింగ్ సాహచర్యంలో అద్వానీ గారికి జ్ఞానోదయం కలిగింది. ఫలితంగా అద్వానీ దారికొచ్చారు. ఖర్మ కాలి జనం దారి తప్పితే ఇక వారు ఏరుకోవాల్సిన జీవన శిధిలాలని ఇప్పటి నుండే లెక్కపెట్టుకోవాలేమో!?

13 thoughts on “దారికొచ్చిన అద్వానీ

  1. ఈ మధ్య కాలంలో ఇంత మంచి cartoon చూసిన జ్ఞాపకం లేదు. పొద్దున్నే చాలాసేపు నవ్వుకున్నాను.

    మీ వ్యాఖ్యానం గూర్చి కొత్తగా రాసేదేముంది? చాలా బాగుంది. పూర్తిగా మీతో ఏకీభవిస్తున్నాను.

  2. maoist లను, వారికి సహాయం చేసే చైనా no 1 అని చెప్పిన మిమ్మల్ని ఏమనాలో అర్ధం కాట్లేదు. ఒక పని చేద్దాం అంది భారత దేశాన్ని చైనా తో కలిపేసి, నక్షలిస్మ , మావుఇసం ని మన రాజ్యంగంగా చేద్దాం !!! k na

  3. ‘ ఆడు ‘ వారి మాటలకు అర్ధాలు వేరులే అన్నట్లుగా వీరి భాష వ్యతిరాకార్ధం తో తీసుకోవాలి. అమెరికా వాళ్లు మేము ప్రంచ ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్యులం అంటే మనం ఏలాంటి అర్ధం తీసుకుంటున్నామో అలాగే వీల్ల అర్ధం చేసు కోవాలి. ఇక్కడ ‘ సుపరిపాలనంటే ‘ ప్రజలకు ఇంతకంటే నరక పాలన అని అర్ధం ! కార్టున్‌ తో పాటు మీ వ్యాఖ్య చాలా అర్దవంతంగా వుంది.

  4. @sai bhargav

    రాసిన టపా ఏమిటి, మీ వ్యాఖ్య ఏమిటి? ఏమన్నా అర్ధం పర్ధం ఉందా?

    మావోయిస్టులకు చైనా సహాయమా? గాడిద గుడ్డేం కాదూ? మన ఊహల్ని బట్టి ప్రపంచం నడవదు. ప్రపంచం ఎలా నడుస్తోందో పరిశీలించి దాన్ని బట్టి ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. అది చాతకాకపోతే గమ్మున ఉండాలి.

    మీకు ఇప్పటికి రెండుసార్లు చెప్పినట్లు గుర్తు. ఆధిక్యత, వెటకారం, దూషణ వద్దని. ఐనా మీ వెకిలితనానికి హద్దూపొద్దూ లేకుండా పోతోంది. పైగా మీ వేళ్ల నుండి కారేదంతా పాండిత్యమేనని ఒకటే అతిశయం!

    ఓ ఉచిత సలహా. మీ పాండిత్య ప్రదర్శనకు మరో బ్లాగ్ ఎంచుకోండి. లేదా మీరే ఇంకో బ్లాగ్ పెట్టుకోండి. కాని నా బ్లాగ్ ని ఇలా పదే పదే ఖరాబు చెయ్యొద్దు. మీ విషయంలో నాకిక ఓపిక నశిస్తోంది.

  5. మీ బావజాలానికి వ్యతిరేకంగా ఏది చెప్పిన అది గాడిద గుడ్డే అవ్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ చైనా నే స్వయంగా తాము mao ఉన్న సమయంలో తిరుగుబాటులకు సహాయం చేసిన మాట నిజమే అని అంగీకరించారు (source – http://tiny.cc/cvil3w ). ఇది కాక IB దగ్గర ఇండియా టుడే వారు సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి చైనా మావుఇస్ట్ లకు ఏ విదంగా సహాయం చేస్తున్నది అన్న విషయం ఈ ఆర్టికల్ (http://tiny.cc/y7il3w) లో పొందుపరిచారు. మీ టపా లో ” వీళ్ళు పొద్దున లేస్తే తిట్టే దేశాల జాబితాలో చైనాది మొదటి స్ధానం కాదా?” అని అన్నారు, అందుకే చైనా – మావుఇస్ట్ ల లింక్ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. నేను పండితుడిని అని నేను యక్కడ చెప్పలేదు , మీరు అలా వ్యంగ్యంగా, అవమానంగా మాట్లాడితే అది మీ విజ్ఞతకే వదిలేస్తాను. మీ బ్లాగ్ లో leftist లు కాని వారికి మాట్లాడే హక్కు లేదని చెప్పండి అలాగే ఇంకెప్పుడు కామెంట్ లు చెయ్యను

  6. మావో చనిపోయి దాదాపు నలభైయేళ్లవుతోంది. ఆయన చనిపోయాక చైనా సోషలిజం వదులుకుని పెట్టుబడిదారీ పంధాకు మళ్లింది. ఆ క్రమం పూర్తయ్యి కూడా రెండు దశాబ్దాలు గడిచిపోయినై. వాళ్లు బో-గ్జిలాయ్ లాంటి సంస్కరణ వాదుల్ని కూడా సహించలేక జైల్లో తోశారు. ఇక మావోయిస్టుల్ని ఎలా పోషిస్తారు? మావో కాలంలో సహాయం చేస్తే నలభై యేళ్ల తర్వాత వారి సిద్ధాంతాన్ని పూర్తిగా తలకిందులుగా చేసుకున్నాక కూడా దాన్ని అప్లై చేసేస్తారా?

    ఐ.బి ఇంటలిజెన్స్ సమాచారం ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించినది. ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్ సంస్ధల ద్వారా మావోయిస్టులకు ఆయుధాలు అందితే అందొచ్చు గానీ, మావోయిస్టులకు నేరుగా సహాయం చెయ్యడం చైనా ప్రయోజనాలకే విరుద్ధం. ఐ.బి చెప్పినంత మాత్రాన నిజం అవ్వాలనేం లేదు.

    మీరు చెప్పిన ఆర్టికల్స్ లోనే మావోయిస్టులకు మేము సహాయం చెయ్యడం లేదని చైనా చెప్పింది కదా? ఐ.బి. సమాచారం చైనా సమాచారం పరస్పర విరుద్ధంగా ఎందుకున్నాయి? ఎందుకంటే చైనా మావోయిస్టులకి నేరుగా సహాయం చెయ్యడం లేదు కాబట్టి.

    “maoist లను, వారికి సహాయం చేసే చైనా no 1 అని చెప్పిన మిమ్మల్ని ఏమనాలో అర్ధం కాట్లేదు. ఒక పని చేద్దాం అంది భారత దేశాన్ని చైనా తో కలిపేసి, నక్షలిస్మ , మావుఇసం ని మన రాజ్యంగంగా చేద్దాం !!! k na”

    ఇదీ మీ వ్యాఖ్య. ఇందులో వ్యంగ్యం లేదా? పాండిత్య ప్రదర్శన లేదా? చైనా నెం. 1 అని నేను చెప్పినట్లు నాపైన రుద్దడం ఏమిటి? నేను చెప్పనిదాన్ని నాపైన రుద్దడం అడ్డగోలు పాండిత్యం కాక ఏమిటట? ‘ఇండియాని చైనాతో కలిపేసి మావోయిజాన్ని రాజ్యాంగం చేసేద్దాం’ అంటూ అడ్డగోలు రాతలు రాసేసి అమాయకత్వం నటించడం ఏమిటి? పైగా నన్నేదో అనేద్దామని కుశాల? తెలివి మీ ఒక్కరి సొత్తా ఏమి?

    ‘వీళ్లు పొద్దున లేస్తే తిట్టేది చైనా కాదా?’ అన్నది ఎందుకు? అర్ధం కాలేదా మీకు? అర్ధం కాకపోవడం తప్పుకాదు. అర్ధం కానప్పుడు, అడగండి చెబుతాను. ఒక పక్క చైనాను తిడుతూ అదే దేశానికి మన ముడి ఖనిజవనరులను తవ్వి అమ్మేస్తున్నారు, ఎంత ఘోరం?’ అని చెప్పడానికి ఆ వాక్యం రాశాను.

    చైనా తెలివిగా తన ముడి వనరుల్ని అట్టే పెట్టుకుని ఇతర దేశాల నుండి ముడి వనరుల్ని దిగుమతి చేసుకుంటోంది. తద్వారా ఇతర దేశాల్లో వనరుల్ని ఖాళీ చేసేస్తూ తన రిజర్వుల్ని కాపాడుకుంటోంది. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? చైనాకి లాభం, మనకి నష్టం! ‘అలాంటి దరిద్రగొట్టు విధానాన్ని బి.జె.పి పాలిత రాష్ట్రం అమలు చేస్తే దాన్ని సుపరిపాలన అంటున్నారు’ అని చెప్పాను. దీన్ని వదిలేసి చైనా-మావోయిజం-నక్సలైట్లు అంటూ అడ్డగోలు రాతలకి దిగారు. నేను రాసిన సబ్జెక్టు నుండి మీరు దూరంగా వెళ్లిపోయారని ఇప్పటికైనా అర్ధం అయిందా? కాకపోతే మళ్ళీ అడగండి. చెప్పడానికి నాకు ఓపిక ఉంది. కాని అడ్డగోలు వ్యంగ్యానికి దిగితే నా ఓపిక ఇట్టే హరించుకుపోతుంది.

    ఇలాంటి రాతలు మీరు అదే పనిగా రాశారు. నన్ను వ్యక్తిగతంగా కూడా తూలనాడారు. అయినా ఓపిక పట్టి డిలిట్ చేసాను తప్ప ఒక్క మాటా అన్లేదు. వ్యంగ్యం లేకుండా సబ్జెక్ట్ చర్చించినవన్నీ ప్రచురించాను. ఒకసారి వ్యాఖ్యల్ని తిరగేయండి. నేను చెప్పేవాటికి వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యలు అనేకం మీకు కనపడతాయి. అవమానకరంగా, వ్యంగ్యంగా మీరు అనేకసార్లు రాసిన తర్వాతే ఓపిక నశించి గాడిద గుడ్డు అనాల్సి వచ్చింది. అది కూడా మీ వ్యంగ్యం స్ధాయికి చాలా చాలా తక్కువ స్ధాయికే పరిమితం అయ్యాను. వ్యంగ్యానికి దిగితే చర్చ ఖరాబవ్వడానికి క్షణం పట్టదని చెప్పడానికే ఆ మాత్రం రాశాను. దానికే ‘విజ్ఞత’ అంటూ కబుర్లు చెప్పేస్తున్నారు. ఇక మీ ‘విజ్ఞత’ గురించి ఇంకెంత చెప్పాలి?

    ఒక సంగతి మళ్లీ స్పష్టంగా అర్ధం చేసుకోండి! నేను చెప్పే అంశాలకి వ్యతిరేక భావాల్ని రాసినా నాకు ఓ.కే. కానీ ఇతర ప్రజల మతాల్ని, విశ్వాసాల్ని తక్కువ చేస్తూ, దూషిస్తూ ఉండే అడ్డగోలు పాండిత్యం నా బ్లాగ్ లో అనుమతించను. విశ్వాసాల్లో ఉండే ఉన్మాదం, మూఢత్వం తదితరాల్ని చర్చించడం వేరు, ఇతర విశ్వాసాల్ని తక్కువ చేయడం వేరు. ఈ రెండూ ఒకటి కాదు.

    మీరు నేను రాసేవాటిలో ఫాక్చువల్ గా తప్పొప్పులు ఉంటే చర్చించండి. నేను అబద్ధం రాసాననుకుంటే ఎత్తి చూపండి. కాని వ్యంగ్యం, వెటకారాలు చేస్తూ ‘ఫ్రీడం ఆఫ్ స్పీచ్’ వెనక దాక్కోవాలనుకుంటే అదిక్కడ సాధ్యం కాకపోవచ్చు. వీలయితే ఒకసారి కామెంట్స్ పాలసీని చూడండి.

  7. ఎందుకు రాదు, మార్పు రావచ్చు. కాని ఆ సంగతి మార్పు వచ్చిన వ్యక్తి చెప్పాలి గదా సంపత్ గారూ? మోడి తాను తప్పు చేసినట్లు ఎప్పుడూ చెప్పలేదు గదా?

  8. @visekar gaaru

    మోడీ అసలు తప్పు అసలు చేస్తే కదా , అలాంటప్పుడు why should he repent ???? modi తప్పు చేసుంటే కాంగ్రెస్ 1000 కోట్లు ఐన కర్చు పెట్టి మోడీ నీ ఎలాగోలా బొక్కలో తోసున్దేవారు. 10 years power లో వుంది మోడీ ని ఏమి పికలేదు అంటే అక్కడే తెలుస్తుంది మోడీ ఏమి చెయ్యలేదని. SHOLAY సినిమా ఇప్పటికి ఏదో ఒక బొంబాయి థియేటర్ లో ఆడుతుంది అని విన్నా ఆ విదంగా paid media , congress, hindu lanti patrikalani , jnu , DU lani hijack chesina leftist lu GUJARAT 2002 అనే సినిమాని 11 years అయినా ఆడిస్తూనే ఉన్నారు……ఐన riots ఎందుకు స్టార్ట్ అయ్యాయి అది మటుకు చెప్పరు, ఇండియా లో ఎప్పుడు riots జరిగినా అది ఎవరు స్టార్ట్ చేస్తారో జగమెరిగిన సత్యం !!!

  9. shekar garu, central cabinet leader aina p.m garu boggu files pote naku enti sambandam ani cheppinapudu,modi garu ela vapuukunataru ?andari goal okkate kada, change anedi prajalallo ravali ani na abiprayam.prajalu ante ekkada middle class,erojullo moral values vadilesi,easy money kosam anni prayatnalu chestunnaru,karma siddanttani vadilestummaru. vallaku strong (niyanta type)leader avasaram vachinattundi,edi evolution lo bagamemo

వ్యాఖ్యానించండి