ఓ సమైక్య మొగుడి ఆధిపత్యం చూసి తీరాలి -వీడియో


Samaikya Husband

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్ధితులకు ఈ వీడియో చక్కగా అద్దం పడుతోంది.

సంసారంలో భార్యా, భర్తలు ఇద్దరూ సమానం అయితేనే అది సజావుగా నడుస్తుంది.  కానీ పురుషాధిక్య సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం అనేక సందర్భాల్లో డొల్లగా మారిపోయింది. చట్టాలు పురుషాధిక్యతను తిరస్కరిస్తున్నట్లు చెబుతాయి. స్త్రీలపై జరిగే అన్యాయాలను అరికట్టడానికే కంకణం కట్టుకున్నట్లు బల్లలు గుద్దుతాయి. కానీ అమలు విషయంలో అదంతా నాటకం అని తేలిపోతుంది. ఆచరణలోకి వచ్చేసరికి అమలు చేయాల్సింది మళ్ళీ ఆ పురుషులే, లేదా పురుషాధిక్య భావాజాలాన్ని నింపుకున్న స్త్రీలు. దీనివల్ల చట్టాలు చట్టు బండలై స్త్రీల దుంప తెంచుతున్నాయి.

అలాగే అందరూ కలిసి కోరుకునేది ఐక్యత. ఒక ప్రాంతం వాళ్ళు మాత్రమే సమైక్యం అంటూ వారితో కలిసి ఉండాల్సినవారు విడిపోవాలని కోరుకుంటే అది సమైక్యత అవుతుందా? 60 యేళ్ళ పాటు కలిసి బతికిన అనుభవం ఇల్లెక్కి వెక్కిరిస్తుంటే ఎవరు మాత్రం కలిసి ఉండాలని కోరుకుంటారు. “కాదు, కలిసే ఉండాలి” అనడం అంటే ఏమిటో ఈ వీడియో ప్రతిభావంతంగా వివరిస్తోంది. ఈ వీడియోలోని నటులు తెలంగాణ నివాసి కాదు. అచ్చమైన సీమాంధ్రులు. ప్రకాశం జిల్లా వాస్తవ్యులు. కధా రచయిత కూడా అయిన శ్రీ రామిరెడ్డి. రాఘవ రెడ్డి గారికి అభినందనలు! రాఘవ రెడ్డి గారికి సహకారం అందించిన కార్టూనిస్టు శ్రీ కరుణాకర్ గారికి కూడా అభినందనలు!

6 thoughts on “ఓ సమైక్య మొగుడి ఆధిపత్యం చూసి తీరాలి -వీడియో

  1. అచ్చమైన సీమాంధ్రులు. ప్రకాశం జిల్లా వాస్తవ్యులు. కధా రచయిత కూడా అయిన శ్రీ రామిరెడ్డి. రాఘవ రెడ్డి గారికి అభినందనలు! రాఘవ రెడ్డి గారికి సహకారం అందించిన కార్టూనిస్టు శ్రీ కరుణాకర్ గారికి కూడా అభినందనలు!
    మీకు కూడా అభినందలండీ శేఖర్‌ గారు!
    ఒక ఆది పత్య వర్గం పీడిత వర్గాన్ని తన చెప్పుచేతల్లో పెట్టు కోవటానికి చేసే ప్రయత్నం ఎంత ఎగతాలికి గురి చేస్తుందో అద్బుతంగ వివరించారు. సమైక్య ఆంద్రకు మాత్రమే కాదు సార్వత్రిక మైన భావం!

  2. వి శేఖర్ గారు .. మీ బ్లాగ్ గొప్పదనం నిరూపించారు. అద్భుతమైన కళారూపాన్ని పాఠకుల కోసం అందించారు.

    ”వంద ప్రసంగాల్లో చెప్పలేనిది ఒక్క కళారూపంలో చెప్పొచ్చు. ”

    దాన్ని నిరూపించిన రామిరెడ్ది గారికి, రాఘవరెడ్డి గారికి కరుణాకర్ గారికి ఇతర కళాకారులకు అభినందనలు.

    సీమాంద్ర ప్రాంతానికి చెందిన వారు సీమాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఏదైన రూపొందించి ఉంటే వారికి స్థానికంగా
    గొప్ప సత్కారాలు, సన్మానాలు లభించేవి.

    కానీ ఈ కళాకారులు మాత్రం న్యాయం వైపు మొగ్గారు. ఎందుంకటే కళ ప్రజల కోసం అన్న వాస్తవాన్ని గుర్తించారు.

    అలాగని నేను సీమాంద్ర ప్రజలను తప్పు పట్టడంలేదు.
    సమైక్యంగా ఉండాలి అని కాకుండా.. హైదరాబాద్ గురించి, తమ హక్కుల గురించి స్పష్టంగా డిమాండ్ చేయాలి.
    చివరగా ఆ కళాకారులకు మరోసారి అభినందనలు.

  3. రాఘవ గారూ, ఐడియా, కెమెరా, సాంకేతికత కూడా కరుణాకర్ గారివేనా? అయితె ఆయనకు ట్రిపుల్ అభినందనలు.

    మీ నటనా వైదుష్యం మాత్రం అనుపమానం! ఈ వీడియో గనక ఏ సినిమా డైరెక్టర్ అన్నా చూస్తే మీకు తప్పకుండా పిలిచి అవకాశం ఇస్తారని నా నమ్మకం.

  4. పింగ్‌బ్యాక్: 2013లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ -సమీక్ష | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

వ్యాఖ్యానించండి