ప్రశ్నలు పంపాల్సిన ఈ మెయిల్ అడ్రస్


Change QUESTION

పాఠకుల సలహా మేరకు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ లో ‘ప్రశ్న-జవాబు’ కేటగిరీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాఠకులు తమ ప్రశ్నలు ఎక్కడ వేయాలో ఇంకా ఆలోచించలేదని ఆ కేటగిరీ ప్రారంభిస్తూ చెప్పాను. ‘ఎందుకో? ఏమో’ బ్లాగర్ గారు నా ఈ మెయిల్ అడ్రస్ కు ప్రశ్నలు పంపే అవకాశం ఇవ్వొచ్చని సలహా ఇచ్చారు. ఆలోచించగా, చించగా…. అదే బెటర్ గా తోచింది.

పాఠకులు తమ ప్రశ్నలను పంపాల్సిన నా ఈ-మెయిల్ చిరునామా: visekhar@teluguvartalu.com

నేను పండితుడ్నని, సర్వం వచ్చని నేను భావించడం లేదు. పాఠకులు కూడా అలానే భావించాలని నా కోరిక. కాకపోతే తెలిసినవారు చెబుతారు. తెలియనివారు అడుగుతారు. ప్రశ్నలు అడిగేవారిలో నేనూ సమాధానం చెప్పేవారిలో పాఠకులూ ఉండొచ్చు.

‘ప్రశ్న-జవాబు’ కేటగిరీ ప్రధానంగా చర్చకు ఉద్దేశించినది. నా అవగాహనలో ఉన్నవి నేను పాఠకుల ముందు ఉంచుతాను. అలాగే పాఠకులు తమ తమ అవగాహన మేరకు చర్చలో పాల్గొంటారు. ఈ చర్చకు కామెంట్స్ పాలసీలో పొందు పరిచిన నియమనిబంధనలన్నీ వర్తిస్తాయి.

ఈ బ్లాగ్ నిర్వహణ పార్ట్ టైమ్ పని. కాబట్టి ఒక్కోసారి నేను వెంటనే సమాధానం ఇవ్వలేకపోవచ్చు. ఒక్కోసారి సమాధానం ఇద్దామనుకుని మర్చిపోవచ్చు. మళ్ళీ అడగడానికి మొహమాటం పడాల్సిన అవసరం లేదు.

ప్రశ్నలు అడిగినవారిలో కొందరు తమ పేరు వెల్లడి చేయడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటివారు ఆ మేరకు సూచన చేయగలరు.

One thought on “ప్రశ్నలు పంపాల్సిన ఈ మెయిల్ అడ్రస్

  1. విశెఖర్ గారూ సరలీకరణ అంటె ఎమిటొ దాని అర్దాన్ని వివరించాలని కొరుచున్నాను. వర్తమాన దేశాల్లొ సరలీకరణ ప్రవేశ పెట్టిన తర్వాత ఆయాదేశాల్లొ పరిస్తితి ఎమిటి ప్రవేశ పెట్టక ముందు పరిస్తితి ఎమిటి. డాలర్ కొసం అన్ని దేశాలనూ పరుగులుపెట్టించే పరిస్తితి ఎందుకు వచ్చిందీ తెల్పమని కొరుచున్నాను.

వ్యాఖ్యానించండి