అందంగా కనిపించడానికి మనుషులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రకృతి సిద్ధంగా దొరికే పదార్ధాలతో అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న మనిషి క్రమ క్రమంగా వాటిని వదిలేసి కంపెనీలు తయారు చేసే సౌందర్య ఉత్పత్తులపై ఆధారపడడం ప్రారంభించారు. కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులు తాత్కాలిక అందాన్నిచ్చినా దానితో పాటు సరికొత్త అనారోగ్యాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. నిజానికి మనిషి ప్రకృతితో కలిసి జీవిస్తూ ప్రకృతిని కాపాడుతూ బతికితే అతనికి/ఆమెకు మించిన అందం మరెక్కడా ఉండదేమో!
ప్రకృతి ఒడిని వీడని జంతుజాలం, పక్షిజాలం మాత్రం వైవిధ్యభరితమైన తన అందాలను, మనిషి జోక్యం జొరబడనంతవరకూ, నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాయి. ఆ సంగతి ఈ ఫోటోలు చూస్తే చక్కగా అర్ధం అవుతుంది. ప్రకృతి అందంలో బిడ్డలపై ప్రేమ కూడా ఒక భాగమేననుకుంటాను. వివిధ పక్షులు గానీ, జంతువులు గానీ నియమబద్ధంగా, తమ పిల్లలను కాపాడుకుంటూ సాకే తీరు చూస్తే చాలా ముచ్చట వేస్తుంది. ఎన్ని గంటలైనా అలా చూస్తూ గడిపేయొచ్చనిపిస్తుంది.
ఈ ఫోటోలను బోస్టన్ పత్రిక అందించింది.



















