ఇండియాకు ముంబై ఎలాగో చైనాకు షాంఘై నగరం అలాగ! ఇండియాకి ముంబై వాణిజ్య నగరంగా పేరొందితే, షాంఘై చైనాకి వాణిజ్య నగరంగా ప్రసిద్ధికెక్కింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరం ఇదేనట! అలాగని ది అట్లాంటిక్ పత్రిక చెబుతోంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం కూడా ఇదేనని సదరు పత్రిక తెలిపింది.
రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ కార్లోస్ బర్రియా ఇటీవల షాంఘై నగరాన్ని సందర్శించి కొన్ని ఫోటోలు తీశాడు. 1987 నాటి ఫోటో ఒకటి దగ్గర పెట్టుకుని ఆ ఫోటో ఏ యాంగిల్ లో అయితే తీశారో సరిగ్గా అదే యాంగిల్లో తాజా ఫోటోని తీశారట. ది అట్లాంటిక్ పత్రిక ఆ ఫోటోలను గిఫ్ ఫార్మాట్ లోకి మార్చి ప్రచురించింది.
అయితే కిందివాటిల్లో మొదటి ఫోటోని మాత్రమే అలా గిఫ్ ఫార్మాట్ లో ముద్రించింది. మిగిలిన రెండు ఫోటోలని క్లిక్ చేస్తే రెండో ఫోటో కనపడేట్లుగా ప్రచురించింది. అలా చేయడం ఎలాగో నాకు తెలియలేదు. అందుకని ప్రతి బొమ్మలోని రెండు ఫోటోలని డౌన్ లోడ్ చేసి వాటిని కూడా గిఫ్ ఫార్మాట్ లోకి నేనే మార్చాను. మూడు ఫొటోల్లో ఉన్నది దాదాపు అదే దృశ్యమే. కానీ యాంగిల్ లో కొద్దిగా తేడా ఉంది.
గిఫ్ ఫోటోగా మార్చడం వల్ల అప్పటికీ, ఇప్పటికీ ఒకే చోట వచ్చిన మార్పును సులభంగా గ్రహించడానికి వీలుగా ఉంది. అందువలన నేను కూడా గిఫ్ ఫార్మాట్ లోనే ఇస్తున్నాను.
ఫోటోలో 125 అంతస్ధూల షాంఘై టవర్ భవంతిని కూడా చూడొచ్చు. ఇది చైనాలోనే అతి ఎత్తైన భవంతి కాగా ప్రపంచంలో రెండో అతి ఎత్తైన భవనం. దానికి ఎడమ పక్కన ఉన్నది ఓరియెంటల్ పెరల్ టవర్. షాంఘై టవర్ ఎత్తు 632 మీటర్లు (2073 అడుగులు). దీని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 2014 చివరికి పూర్తవుతుందని చెబుతున్నారు.
షాంఘై నగర ప్రస్తుత జనాభా 23.5 మిలియన్లు. అంటే 2.35 కోట్లు. గత రెండు దశాబ్దాలుగా సంవత్సరానికి 10 శాతం చొప్పున ఈ నగర జనాభా పెరుగుతోందని చెబుతున్నారు.
ప్రపంచ స్ధాయి ఆర్ధిక వ్యవస్ధగా పశ్చిమ దేశాలకు పోటీ ఇవ్వాలంటే ప్రపంచస్ధాయి మౌలిక నిర్మాణాలు తప్పనిసరి. హై స్పీడ్ రైళ్లు, దేశం నిండా ఎక్స్ ప్రెస్ హై వే రోడ్లు, కాస్మోపాలిటన్ నగరాలు ఇవన్నీ ఉంటేనే గ్లోబల్ స్ధాయిలో వ్యాపార కార్యకలాపాలకు తగిన వసతి, సౌకర్యాలు అందజేయగలుగుతారు. చైనా ఆ విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది.
గత రెండు దశాబ్దాలుగా ఆ దేశానికి వాణిజ్య మిగులుగా వచ్చి చేరిన మూడు ట్రిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇపుడా దేశ ఆర్ధిక శక్తికి పెట్టని కోటగా ఉన్నాయి. అత్యంత చౌక రేట్లకు పని చేసే మానవ వనరులు ఎలాగూ ఉన్నాయి. అశేష శ్రామిక జనం వద్ద నుండి మిగుల్చుకున్న అదనపు విలువ ఆ దేశంలో భారీ సంపన్నులను సృష్టిస్తోంది.
వెరసి రెండో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా అవతరించి అమెరికాకు దడ పుట్టిస్తోంది. చైనా అమెరికా, ఐరోపాల లాగా సామ్రాజ్యవాద శక్తిగా అవతరించింది. కానీ మూడో ప్రపంచ దేశాల మార్కెట్లను మిలట్రీ శక్తితో దురాక్రమించే పనిలోకి ఇంకా దిగలేదు. అలా దిగే రోజు బహుశా ఎంతో దూరంలో లేదు.
ఎందుకంటే లెనిన్ మహాశయులు చెప్పినట్లు సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం. త్వరలో ప్రపంచ మార్కెట్లను స్వాధీనం చేసుకునే కృషిలో అమెరికా, ఐరోపా లతో పోటీ పడుతూ ప్రపంచ దేశాలకు ప్రమాదకారిగా చైనా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.



అశేష శ్రామిక జనం వద్ద నుండి మిగుల్చుకున్న అదనపు విలువ ఆ దేశంలో భారీ సంపన్నులను సృష్టిస్తోంది.
వెరసి రెండో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా అవతరించి అమెరికాకు దడ పుట్టిస్తోంది. చైనా అమెరికా, ఐరోపాల లాగా సామ్రాజ్యవాద శక్తిగా అవతరించింది. కానీ మూడో ప్రపంచ దేశాల మార్కెట్లను మిలట్రీ శక్తితో దురాక్రమించే పనిలోకి ఇంకా దిగలేదు. అలా దిగే రోజు బహుశా ఎంతో దూరంలో లేదు.
ఎందుకంటే లెనిన్ మహాశయులు చెప్పినట్లు సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం. త్వరలో ప్రపంచ మార్కెట్లను స్వాధీనం చేసుకునే కృషిలో అమెరికా, ఐరోపా లతో పోటీ పడుతూ ప్రపంచ దేశాలకు ప్రమాదకారిగా చైనా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
chaalaa correct gaa cheppaaru.