భారత పత్రికల్లో చాలా అరుదుగా కనిపించే వార్త ఇది.
తెలుగు పత్రికల్లో ఇలాంటి వార్త రావడం ఆశ్చర్యమే. నిజానికి దీనిని వార్త అనడం కంటే చరిత్ర అనడం సముచితం. ఇంకా చెప్పాలంటే వాస్తవ చరిత్ర అనడం ఇంకా సముచితం. అలీన దేశాల కూటమి ఏర్పాటు చేయడంలో మన ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన కృషి మామూలుది కాదు. అలాంటి నెహ్రూ చైనా దాడితో ఎటూ పాలుపోక అమెరికా శరణు జొచ్చాడని ఈ ‘వాస్తవ చరిత్ర’ చెబుతోంది.
చైనా, భారత్ ల మధ్య తరచుగా సరిహద్దు తగాదాలు జరగడానికి ప్రధాన కారణం ఏది సరిహద్దు అనే విషయంలో ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రాకపోవడమే. దానికి ఇరు దేశాలూ బాధ్యులు కాదు. ఎందుకంటే చరిత్ర ఈ సమస్యను ఇరు దేశాలపైనా మోపింది. చరిత్ర మోపింది కాబట్టి దాన్ని అలానే కొనసాగించడం విజ్ఞుల లక్షణం కాదు. రాజనీతిజ్ఞుల లక్షణం అసలే కాదు.
కానీ సమస్యలనేవి పాలక వర్గాల దృష్టిలో బంగారు గుడ్లు పెట్టే బాతుతో సమానం. ఆ బాతుని బతికించి సజీవంగా ఉంచితే అనేక రాజకీయ, ఆర్ధిక సంపదల గుడ్లను పాలకులకు అందిస్తుంది. అందులోనూ భావోద్వేగాలతో కూడి ఉండే సరిహద్దు సమస్యలైతే ఇక చెప్పనవసరం లేదు. వాటిని ఎంత దీర్ఘకాలం కొనసాగిస్తే పాలక వర్గాలకు అన్ని గుడ్లు ఇస్తుంది. గుడ్లు ఇవ్వడమే కాదు, అనేక వాస్తవ సమస్యల నుండి దారి మళ్లించడానికి సహాయపడుతుంది.
అందుకే కాశ్మీరు సమస్య, అరుణాచల్ ప్రదేశ్ సమస్య, ఈశాన్య రాష్ట్రాల సమస్యలు నిత్యం రావణ కాష్టంలా రగులుతూ ఉంటాయి. ఇక వార్తలోకి వెళ్దాం! (కింద బొమ్మపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ కాపీ ఓపెన్ అవుతుంది)
–

ఆనాడు నెహ్రూ తప్పనిసరై అమెరికా శరణు కోరాడు.
ఈనాడు వారి వారసులు అమెరికాను శరణు కోరక తప్పని పరిస్థితి తెచ్చారు.
ఇది పూర్తిగా నమ్మదగినదిగా లేదు! ఎందుకంటే ఆ సహాయమేదో రష్యాను అడగడానికే ఎక్కువ అవకాశం ఉంది!ఎందుకంటే అప్పటికే మనం రష్యావైపు పాక్షికంగా మొగ్గుచూపిఉన్నాము!
మూల గారు మీకు సమాధానం ఇద్దామనుకుని మరిచేపోయాను. అప్పటికి చైనా, రష్యాల మధ్య స్నేహ సంబంధాలు పూర్తిగా రద్దు కాలేదు. బహుశా అందువల్ల రష్యాను నెహ్రూ నమ్మకపోయి ఉండవచ్చు.
అదొక కారణం అయితే నెహ్రూకి అమెరికా అంటే విముఖత ఎమీ లేదు. తాను సోషలిస్టుని అని చెప్పుకోవడానికి రష్యావైపు మొగ్గు చూపినట్లు కనిపించారు గానీ, వాస్తవానికి అమెరికాతో కూడా సత్సంబంధాలు కొనసాగించారు. ఫోర్డ్ ఫౌండేషన్ లాంటివి యాభయల్లోనే ఇండియాలో కార్యాకలాపాలు నడిపాయి. ఫోర్డ్ ఫౌండేషన్ ఒక విధంగా సి.ఐ.ఎ కి ముసుగు.