అమెరికాలో ఈ మధ్య దావనలాలు ఎక్కువైనాయి. మే మొదటివారంలో లాస్ ఏంజిలిస్ సమీపంలో భారీ దావానలంతో పోరాడి అదుపులోకి తెచ్చిన అమెరికన్ అగ్నిమాపక దళం ఈసారి ఆ నగరానికి 140 కి.మీ దూరంలోని రివర్ సైడ్ కౌంటీ వద్ద మరో భారీ దావానలంతో తలపడుతున్నారు. ‘సిల్వర్ ఫైర్’ గా పిలుస్తున్న ఈ దావానలాన్ని అదుపు చేయడానికి దాదాపు 1500 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఆగస్టు 7 తేదీన మొదలయిన మంటలు ఇక్కడి కొండాల్ని ఆసాంతం రగిలిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు మొదలై కొద్ది గంటల్లోనే 5,000 ఎకరాలకు మంటలు విస్తరించాయని ‘ది అట్లాంటిక్’ పత్రిక తెలిపింది. శనివారానికి 25 శాతం ఏరియాలో మంటల్ని అదుపు చేశామని సిబ్బంది ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ ప్రకటించడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందించింది.



















