ఐ.ఎ.ఎస్ లను తంతే…..?–కార్టూన్


Kicking IAS

ఏం జరుగుతుందో తెలియడానికి ఇంతకు మించి వివరంగా బహుశా ఎవరూ చెప్పలేరేమో!

ఐ.ఎ.ఎస్ లను ‘అయ్యా, ఎస్’ లు అని ఆంధ్ర ప్రదేశ్ జనం చెప్పుకుంటారు. వారు అలా ‘అయ్యా, ఎస్’ అని ఎందుకు అనవలసి వస్తోందో ఉత్తర ప్రదేశ్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. అధికారులకు కూడా స్పష్టమైన రూల్స్ ని ప్రభుత్వ గ్రంధాల్లో నిర్దేశించి ఉంచారు. కానీ రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, కంపెనీల స్వార్ధ ప్రయోజనాల కోసం వీటిని నీరుగార్చడం లోనే అనేకమంది ఐ.ఎ.ఎస్ లు పండిపోయారు. అప్పుడప్పుడూ దుర్గాశక్తి లాంటివారు వచ్చినపుడే వారు కూడా ప్రజల కోసం ఎలా పని చేయవచ్చో జనానికి అర్ధం అవుతూ ఉంటుంది.

మంత్రులుగా అవతరించే ప్రజా ప్రతినిధులకు అనేక సందర్భాల్లో పాలక వ్యవస్ధ తీరుతెన్నులు అర్ధం కావు. వారికి అర్ధం చేయించి పరిపాలనను ప్రజలకు అనుకూలంగా మరల్చే బాధ్యత ఉన్నతాధికారులదే. ఐ.ఎ.ఎస్ లే సర్వస్వం కాకపోయినా, వారు లేకపోతే ప్రభుత్వ చక్రాలు ముందుకు కదలని మాటా నిజమే. అలాంటివారిని కాలదన్నితే రాజకీయ నాయకులు బొక్కబోర్లానో, వెల్లకిలానో పడడం ఖాయమని ఈ కార్టూన్ సూచిస్తోంది. ఇప్పుడున్న వ్యవస్ధలో ఇది నిజమే కదా.

అధికారులైనా, రాజకీయ నాయకులైనా వాళ్ళు ఎవరి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నారు అన్న విషయంపై ఆధారపడి వారి మాటలు, చేతలు ఉంటాయి. ప్రజాసేవకు కట్టుబడడంలో నిజాయితీయే ప్రధానం అనుకున్నవారు స్వార్ధ ప్రయోజనాలకు ఎదురు నిలిచి అశోక్ ఖేమ్కా, దుర్గాశక్తి నాగపాల్ తరహాలో వరుస బదిలీలు, సస్పెన్షన్ లకు గురవుతారు. ఆ క్రమంలో వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అంతిమంగా ప్రజల గుండెల్లో స్ధానం సంపాదించుకుంటారు.

తమకు కావలసింది ప్రజల అభిమాన హృదయాలా లేక డబ్బు కంపు గొట్టే స్వార్ధ ప్రయోజనాపరుల ఆకాశహర్మ్యాల లోగిళ్ళా అన్నది అధికారులు ఎవరికివారు తేల్చుకోవాల్సిందే.

2 thoughts on “ఐ.ఎ.ఎస్ లను తంతే…..?–కార్టూన్

  1. ప్రజాసేవ కోసమే రాజకీయాలలోకి వచ్చామని చెప్పే రాజకీయనాయకుల మాతలో నిజం ఎంతుందో మనకు తెలిసినదే!అధికారులు కూడా ప్రజాసేవ కోసమే ఇవన్నే చెస్తున్నారంటే అది పూర్తి వాస్తవం కాదని నా అభిప్రాయం!మనస్తత్వ శాస్త్రంలో దీనికి సంబందించిన విషయం ప్రకారం వ్యక్తి వ్యక్తిత్వం దీనికికారణంగా చెప్పవచ్చు!వారిలో ఎవరికీ తలవంచని నైజం,పొగరు,ఆత్మవిశ్వాసం,కఠినపరిస్తితులకు వెరవని తత్వం ఎలా కొన్ని అంశాలు ప్రభవితం చేస్తాయి.ఆ క్రమంలో ప్రజాహితకార్యక్రమాలు జరుగుతుంటాయి!అంతేగాని “ప్రజాహితమనే” పరమావది అంటే నేను పూర్తిగా అంగీకరించను!

  2. దేశంలో కాదు ప్రపాంచంలోనె స్వార్ధం లేని మనిషంటు లేడు. దానికి ఐ ఎ స్ లు మినహాఇంపు కాదు. ఎక్కడొ ఒకరిద్దరు మినహాఇంచి.
    స్వార్ధ ప్రయోజనాల కోసం స్పష్టమైన రూల్స్ ని నీరుగార్చడం లోనే అనేకమంది ఐ.ఎ.ఎస్ లు పండిపోయారు. ప్రజా ప్రతినిధులకు అనేక సందర్భాల్లో పాలక వ్యవస్ధ తీరుతెన్నులు అర్ధం కావు. పరిపాలనను ప్రజలకు అనుకూలంగా మరల్చే బాధ్యత ఉన్నతాధికారులదే. కాకపోతే ఉద్యోగ ధర్మం నిజాయితిగ నిర్వహించడం ఎంతైన విస్మరించ కూదనిది. క్షమించ రాని నేరం.

వ్యాఖ్యానించండి