ఎడతెగని ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో ప్రధానంగా బలవుతోంది అక్కడి స్త్రీలు, పిల్లలు. ఈ యుద్ధం అనివార్యం ఏమీ కాదు. అమెరికా స్వయంగా పెంచి పోషించిన ‘ఒసామా బిన్ లాడెన్’ ను పట్టుకోవడం కోసం అంటూ ఆఫ్ఘనిస్ధాన్ పైన అమెరికా బలవంతంగా రుద్దిన దురాక్రమణ యుద్ధం ఇది. పన్నెండేళ్ళ సుదీర్ఘ యుద్ధంలో అమెరికా బావుకున్నది 2007-08 నాటి మహా ఆర్ధిక మాంద్యం మాత్రమే.
అమెరికా, ఐరోపాలు రుద్దిన దురాక్రమణ యుద్ధం పుణ్యాన ఆఫ్ఘనిస్ధాన్ లో మరో యుద్ధ తరం అక్కడ పుట్టి పెరుగుతోంది. యుద్ధ తరం అంటే మరేమీ లేదు. యుద్ధంలో పుట్టి పెరుగుతున్న తరం అని మాత్రమే దాని అర్ధం. యుద్ధంలో పుట్టి పెరిగే బాల్యం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు జవాబే ఈ ఫోటోలు.
ముందే చెప్పినట్లు ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో ప్రధాన బాధితులు స్త్రీలు, పిల్లలే. వేలాది మంది పిల్లలు ఇప్పుడక్కడ అనాధలు. ఐక్యరాజ్య సమితి, ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్, యునిసెఫ్ తదితర అంతర్జాతీయ సంస్ధలు తామూ పని చేస్తున్నామని చెప్పుకునేందుకు వీలుగా లెక్కల కోసం కొన్ని స్కూళ్ళు, కాసిన్ని ఆసుపత్రులు, ఇంకాసిని గుడారాలు కనపడతాయంతే. మిగిలిన వారంతా తల్లెవరో, తండ్రెవరో తెలియని దీన పరిస్ధితుల్లో చిన్నతనం నుండే చాకిరీ చేస్తూ బతుకుతున్నారు.
ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందించింది.
–
–
(స్పష్టత కోసం టైటిల్ ను ఎడిట్ చేశాను -విశేఖర్, 5/8/2013, 10:11 am)























