ఇసుక మాఫియా కరిగిస్తున్న ఒక ప్రభుత్వ ఆయువు -కార్టూన్


Sand Mafia

అనగనగా ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యువకుడు ముఖ్యమంత్రి. నేరాలను, నేరస్ధ మాఫియాలను తుదముట్టిస్తానని ఆయన శపధం చేసి మరీ అధికారంలోకి వచ్చాడు. ప్రజలు పాపం మాఫియాలను తుదముట్టించే రోజుకోసం ఎదురు చూస్తున్నారు.

కానీ ప్రజల ఆశలు నెరవేరక పోగా విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. మాఫియాలను తుదముట్టించే బదులుగా మాఫియాలను తుదముట్టించే నిజాయితీ అధికారులను తుదముట్టించే కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రజలు ఏదయితే ఆశించి గద్దెనెక్కించారో సరిగ్గా దానికి విరుద్ధంగా మన యువనాయకుడు వ్యవరిస్తున్నారు.

ఇసుక మాఫియాను తుదముట్టించే పనిలో ఉన్న యువ అధికారి యువశక్తి నాగపాల్, తాజాగా యువ ముఖ్యమంత్రి తుదముట్టించిన అధికారుల జాబితాలో చేరిపోయారు. కొద్ది నెలల క్రితమే రాజా భయ్యా అనే పేరుగల భారీ మాఫియా రాజు దెబ్బకు తుదముట్టించబడిన పోలీసు అధికారి జియా ఉల్ హక్ కేసులోనూ వాస్తవాలు తుదముట్టించబడ్డాయి.

కేంద్ర ప్రభుత్వాన్ని పడిపోకుండా నిలబెడుతున్నందుకు మెచ్చారేమో గానీ సి.బి.ఐ పరిశోధకులు జియా హత్యలో మాఫియా రాజుగారి పాత్ర లేనే లేదని శుభ్రమైన కితాబు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

………………ఇంకా ఉంది. 

One thought on “ఇసుక మాఫియా కరిగిస్తున్న ఒక ప్రభుత్వ ఆయువు -కార్టూన్

వ్యాఖ్యానించండి