రాజకీయ పార్టీలకు ఏది ఆహారం? ఇంకేది, ఓట్లు, సీట్లు. ఎన్ని ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి. సీట్లు పెరిగేకొందీ అధికారం దగ్గరవుతుంది.
వర్షాకాలం సమావేశాల్లో ‘ఆహార భద్రతా బిల్లు’ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోడానికి కాంగ్రెస్ తెగ తాపత్రయ పడుతోంది. ‘గ్రామీణ ఉపాధి హామీ పధకం’ 2009 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్ల వరప్రదాయని అయినట్లుగా 2014 ఎన్నికల్లో ‘ఆహార భద్రతా చట్టం’ ఆ తరహా పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ ఆశ. అందుకే బి.జె.పి, తృణమూల్ కాంగ్రెస్ తదితరులు వద్దు వద్దంటున్నా వినకుండా ఆమోదింపజేయడానికి కాంగ్రెస్ సమాలోచనలు జరుపుతోంది.
బిల్లుకు బి.జె.పి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తోంది. ఈ సవరణల వివరాలు ఏమిటో ఇంకా తెలియలేదు. జనానికి భద్రత ఇస్తుందో లేదో గానీ తమకి మాత్రం అధికారాహార భద్రత ఇస్తుందని కాంగ్రెస్ విశ్వసిస్తోందని కార్టూన్ సూచిస్తోంది.

tama food security kosame rashtraani vidadeesaru annadi deeni meaning.food security bill meeda ee cartoon kaadanukuntaanu.
నేను రాసిందీ అదే కదా?