మేడం-తెలంగాణ -కార్టూన్


Madam - Telangana

“మేడం గారు నిర్ణయం తీసేసుకున్నారు. సరైన సమయంలో దాన్ని బైటపెడతారు.”

భారత దేశం ప్రజాస్వామ్య దేశం అని పాలకులు చెబుతుంటారు. మామూలు ప్రజాస్వామ్య దేశం కూడా కాదు, ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం’ అని వారు తరచుగా చెప్పే మాట! అంటే ఇక్కడ జరిగే నిర్ణయాలన్నీ ప్రజల అభీష్టం మేరకే జరగాలి. ఎన్నికలు జరిగాక, ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ లేదా పార్టీల కూటమి వివిధ నిర్ణయాలు చేస్తుంది కనుక ఏ నిర్ణయం జరిగినా అది ఉమ్మడి నిర్ణయం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రజల నిర్ణయం అవుతుంది. కాబట్టి దానిని ఒక వ్యక్తికి ఆపాదించడం అనేది జరగకూడదు.

కానీ తెలంగాణ విషయంలో మొదటి నుండీ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఆ పద్ధతిలో లేదు. ‘సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి తీరతారు’ అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మొదటి నుండి చెబుతున్నమాట! సోనియా గాంధీ గారికి అన్నీ విషయాలూ తెలుసు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే ఆమె తీసుకుంటారు అని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చిన మాట! మరి తెలంగాణ ప్రజలు, వారి ఉద్యమాలు, వారి త్యాగాలు ఇవన్నీ ఏమయినట్లు?

5 thoughts on “మేడం-తెలంగాణ -కార్టూన్

  1. తెరాస కోరిక ‘ తెరా ‘ !
    భాజపా జపం అదే !
    గోడమీదే తెదే !
    హస్తిన మాత్రం తేల్చ దే ?!
    ఎత్తు కు పై ఎత్తులు వేస్తున్న
    ‘నేతల ‘ మధ్య,
    సగటు మనిషి చిత్తే !

  2. Leaders are behaving like bureaucrats. They say it is public opinion. Actually it is for their benifit only they areacting. Like changing names of towns and naming the project and all.
    This is also like that. they are looking for votes only.

  3. తెలంగాణ ఎంతో మంది ప్రజల ఆకాంక్ష అని చెబుతుంటే విన్నాను. కానీ దాని విడిపోవడం కొందరి అభిలాషైతే.. సమైక్యంగా ఉండాలన్నది మరికొందరి ఆకాంక్ష.. ఇక్కడి నాయకులను మనం ఎన్నుకున్నాం.. విడిపోవడం.. కలిసుండడం వారినే అడిగాం.. వాళ్లూ వాళ్ల అభిప్రాయాలు చెప్పారు.. అయితే అధికారం ఉన్నవాళ్లే ఏం మాట్లాడక తర్జన భర్జన పడుతూ ఉన్నారు. మరి ఏ అధికారం లేని సోనియా ఈ విషయంలో నిర్ణయం ఎలా తీసుకుంటారు.. ఏ ప్రాతిపదికన తీసుకుంటారు?

వ్యాఖ్యానించండి