ఇదెలా సాధ్యం?
‘స్పైడర్ మేన్’ సినిమా కాబట్టి అందులో హీరో గోడల మీద వేగంగా ఎగబాకడం సాధ్యం అయింది. కానీ ఇది నిజం.
ఈ బాలుడు ఎవరో తెలియదు. ఫేస్ బుక్ లో కనపడిన ఈ వీడియో కింద వివరణ పదాల ప్రకారం టర్కీ బాలుడని మాత్రం అర్ధం అయింది.
–
విచిత్రం ఏమిటంటే దాదాపు అదే టర్కీ టైటిల్ తో (Düz Duvara Tırmanan Örümcek Bebekler) మరో రెండు వీడియోలు దొరికాయి. ఇందులో కూడా అంతే. ఒకరు ఏకంగా ఫ్రిజ్ తలుపు మీద నుండి పాకితే మరో వీడియోలో ఇద్దరు పిల్లలు గోడని ఇట్టే ఎగబాకేస్తున్నారు.
–
–
–
శకుంతలా దేవి లాంటి గణిత మేధావుల కోవలోకి వీరిని చేర్చవచ్చేమో. కాకపోతే శకుంతల అపూర్వమైన గణన శక్తిని కలిగి ఉంటే వీరు అపూర్వమైన, ప్రత్యేకమైన శారీరక శక్తిని కలిగి ఉన్నారు. తరాలు గడిచే కొద్దీ తర్వాత తరం వాళ్ళు తమ ముందు తరం కంటే మెరుగైన లక్షణాలతో పుడతారన్నది నిజమే గానీ, మరీ ఇంత మెరుగ్గానా?
ఈ లెక్కన మనిషి రాను రాను ఇంకెంత మెరుగ్గా ఉంటాడో మరి!
ప్రాణుల్లో పరిసరాలకి అనుగునంగా మారటానికి మ్యుటేషన్లు ఏర్పడతాయట! అవి ఈ జనరేషన్ లో నే వస్తాయెమో!