ఉత్తరఖండ్, బుద్ధగయ మరియు జోకర్ వి.ఐ.పిలు -కార్టూన్


The Hindu

The Hindu

ఉత్తరఖండ్ హిమాలయ విలయం నుండి దేశం ఇంకా తేరుకోనే లేదు. అక్కడింకా శవాల లెక్కలు తేలలేదు. మందాకిని పూడ్చిన గ్రామాలు, పొలాలు పైకి లేవలేదు. విగతులైనవారి అంత్యక్రియలు సైతం పూర్తి కాలేదు. ఇంతలోనే బుద్ధగయ మానవ విధ్వంసం!

దేశానికి ప్రకృతి విలయాలు కొత్త కాకపోవచ్చు. ఆ మాటకొస్తే ఉగ్రవాద బాంబు పేలుళ్లు కూడా కొత్త కాదు. కానీ రాజకీయ నాయకులకు, వి.ఐ.పి లకు అవి ఎప్పటికప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అక్కరకు వచ్చే నిత్య నూతన సాధనాలు. ప్రకృతి ఆగ్రహిస్తే మరిన్ని నిధులు కురుస్తాయి. మతి మాలిన ఉగ్రవాదం పంజా విసిరితే మరిన్ని ఓట్లు కురుస్తాయి.

మొన్న కేదార్ నాధ్ ని పునర్నిర్మిస్తాం అంటూ సాయం చేయబోయినవారే ఈ రోజు బుద్ధ గయ దాడులపై విమర్శలు కురిపిస్తున్నారు. ఆరేడు నెలల క్రితం కేంద్రం నుండి వచ్చిన హెచ్చరికలను ఎందుకు ఖాతరు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. పన్నెండేళ్ళ క్రితం గుజరాత్ లో సాగించిన అమానవీయ హత్యాకాండకు దర్శకత్వం వహించినవారు, ఆనాటి గాయాలను మాన్చడం మాని బైటి రాష్ట్రాల గాయాలకు మందు వేస్తామనడం బాధితులను పరిహసించడమే.

ఇంతకీ అది బైటి రాష్ట్రాల గాయాలకు మందు పూయడమా లేక పుండు మీద కారం రాయడమా?

3 thoughts on “ఉత్తరఖండ్, బుద్ధగయ మరియు జోకర్ వి.ఐ.పిలు -కార్టూన్

  1. Sekhar gaaru…
    These polluted politicians cheap tricks will not end, untill unless People of this country get quality education, Political awareness and Finally the VALUE of their VOTE…….
    Good analysis…

వ్యాఖ్యానించండి