ప్రపంచం అంతా పాపులారిటీ సంపాదించిన కామిక్ హీరోలంతా దాదాపు పశ్చిమ దేశాల వాళ్ళే. సూపర్ మేన్, బ్యాట్ మేన్, స్పైడర్ మేన్, ఫాంటమ్ ఇత్యాదూలంతా పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ప్రాణం పోసుకున్నవారు. వారితో సమానంగా పాపులారిటీ సంపాదించిన జంతు రూప’ కామిక్ క్యారెక్టర్లు కూడా అక్కడివే.
అదేం కాదు, మనకి కూడా కామిక్ హీరోలు, క్యారెక్టర్లు ఉన్నారని చెబుతున్నారు ది హిందూ కార్టూనిస్టు. సృజనాత్మకత ఉట్టిపడుతున్న మన కామిక్ హీరోల గొప్పతనాన్ని కనిపెట్టడానికి కేశవ్ లాంటి వారి వల్లే సాధ్యం అవుతుందనుకుంటా.
ఒకటిన్నర రోజుల్లో 15,000 మంది గుజరాతీయులను ఉత్తర ఖండ్ వరదల నుండి కాపాడి విమానంలో తమ రాష్ట్రం చేర్చడం ద్వారా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి భారతీయ రాంబో గా ఇటీవలే రుజువు చేసుకున్నారు.
మన రాజకీయ పార్టీల్లో అదే పనిగా సెక్యులరిజం జెండాను మోసే పార్టీలు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలంటే వారికి ‘సెక్యులరిస్టు’ సిద్ధాంతం భలే అక్కరకు వస్తుంది. చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ లాంటి పచ్చి ప్రజావ్యతిరేక చట్టాలను సమర్ధించడానికి వీరికి అక్కరకు వచ్చింది సెక్యులరిజమే. బిల్లు ఆమోదం పొందకపోతే సెక్యులరిస్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి మతతత్వ బి.జె.పి అధికారంలోకి వస్తుందని చెప్పిన ఘనత ములాయం సింగ్ గారిది. ఆయన ముక్కు ఎక్కడ ఉన్నా ఇట్టే పసిగట్ట్యొచ్చు మరి. సెక్యులరిజాన్ని కాపాడడానికి ముందుకు దూకే బ్యాట్ మేన్ మన ములాయం సింగ్ యాదవ్!
సి.బి.ఐ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సి.బి.ఐ కి స్వతంత్రత కావాలని సుప్రీం కోర్టే స్వయంగా కోరుతూ అందుకు అనుగుణంగా చట్టం తేవాల్సిన పరిస్ధితికి మన ప్రభుత్వాలు ఆ సంస్ధను నెట్టాయి. కీ ఇచ్చినట్టల్లా ఆడే పింక్ పాంధర్ ఈ సి.బి.ఐ!
ఇండియన్ సూపర్ మేన్ మన రూపాయే. 20 సంవత్సరాల క్రితం డాలర్ కి 25 రూపాయలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు ఒక డాలర్ ఇస్తే ఏకంగా 61 రూపాయలు వచ్చేస్తాయి. రూపాయి శక్తి అంతగా పెరిగిపోతోంది. డాలర్ కి కనీసం 100 రూపాయలు వచ్చేదాకా మనవాళ్లు నిద్రపోక పోవచ్చని ఈ మధ్యనే ఓ పెద్దమనిషి చెప్పేశారు.
టామ్ & జెర్రీ ఎవరు? ఇంకెవరు, బి.జె.పి మరియు నితీశ్ కుమార్ లు. పాపం నితీశ్ కుమార్ ఎన్.డి.ఏ ని వదిలిపోకుండా ఉండడానికి బి.జె.పి ఎన్ని ప్రయత్నాలు చేసిందని? ఒక వైపు మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూనే ఆయన జారిపోకుండా ఉండడానికి చేయాల్సిందంతా చేశారు. ఎల్.కె.అద్వానీ నుండి సుష్మా స్వరాజ్, సుశీల్ కుమార్ మోడిల వరకూ శతధా ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. మరి జెర్రీ ఎప్పుడైనా టామ్ కి పట్టుబడిందా?
హాలీవుడ్ లో తాజా హీరో హ్యారీ-పోటర్. పుట్టుకతోనే మంత్రవిద్యలను ఇట్టే నేర్చుకోగల శక్తియుక్తులతో పుట్టిన అదృష్టవంతుడు. హ్యారీ వంశమే మంత్రవేత్తల వంశం. మనకి కూడా పుట్టుకతోనే ప్రధాన మంత్రుల వంశంలో పుట్టిన హీరో ఉన్నారు. ఇటీవలే ఆయన దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీకి ఉపాధ్యక్షుడు కూడా అయ్యారు. భారత దేశానికి ఆహార భద్రతా బిల్లు తెచ్చి పెట్టాలని తెగ తపన పడుతున్నారు. ఈ బిల్లు వస్తే దేశంలో ఇక అందరికీ ఆహారం వచ్చేస్తుందట! ఎంతైనా మంత్రవేత్తల వంశం కదా!

Nice one. http://www.screentalent.wordpress.com
tera venuka kutantraalu chese kannaa aa mantralu chese vaalle better
ten years నుండి chief minister గా వున్నా గడచిన టెన్ ఇయర్స్ లలో ఇండియా లో ఎక్కడ ఇలాంటి సాయం చెయ్యని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ప్రధాని పదవి ఫై కన్ను పడగానే కులం లేదు మతం లేదు అంటూ తనే దేశానికీ దిక్కు ఐనట్లు నక్క వినయాలు పోతున్నాడు . కొద్దిపాటి ఆర్దిక వెసులుబాటుకె వీరుడు శూరుడు అంటూ కార్పొరేట్ శక్తులు భుజాన వేసుకున్నా, అతని పాలన లో జరిగిన నరమేధం అసలు అజెండా అందరికి తెలుసు.
మీరు ఇరవై ఏళ్ళ క్రితం నాటి కరెన్సీ విలువ గురించి మాట్లాడుతున్నారు. 1947లో రూపాయి విలువ డాలర్ విలువతో సమానంగా ఉండేది. అప్పట్లో ఇండియాకి విదేశీ అప్పులు లేకపోవడం వల్లే మన కరెన్సీ విలువ అంత భద్రంగా ఉండేది. నెహ్రూ విదేశీ అప్పుల ద్వారా వచ్చిన డబ్బుని మల్టిప్లై చెయ్యడానికి కరెన్సీ విలువ తగ్గిస్తే ఇప్పటి పాలకులు ఐటి కంపెనీలకి వచ్చే ఆదాయాన్ని మల్టిప్లై చెయ్యడానికి కరెన్సీ విలువ తగ్గిస్తున్నారు.
However, “borrow loan and eat dal” policy is dangerous to our economy.