గానుగెద్దు సి.బి.ఐ -కార్టూన్


The Hindu

The Hindu

ఆ, అది చాలా సార్లు దగ్గరగా వచ్చింది లెండి!

బీహార్ గడ్డి కుంభకోణం అందరికీ తెలిసిందే. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇందులో ఒక నిందితుడు. ఈ కేసు అంతిమ తీర్పే తరువాయి అన్న దశలో ఉంది. ఈ దశలో గడ్డి కుంభకోణం కేసును సి.బి.ఐ కోర్టు నుండి మరో కోర్టుకు మార్చాలంటూ ఆయన బీహార్ హై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కేసు కొట్టేసింది. కేసును మార్చాలన్న ఆయన వాదనను కోర్టు అంగీకరించలేదు. అంటే తీర్పును ఇంకా వాయిదా వేయించాలన్న లాలూ ప్రసాద్ చివరి ప్రయత్నం ఇలా బెడిసి కొట్టింది.

సి.బి.ఐ కోర్టు జడ్జి, బీహార్ లోని జె.డి(యు) ప్రభుత్వంలో విద్యా మంత్రిగా పని చేస్తున్న పి.కె.సాహికి దగ్గర బంధువుని కాబట్టి కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని లాలూ కోరారు. కానీ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయిపోయింది. అంతిమ తీర్పు వెలువరించడానికి జులై 15 తేదీ కూడా నిర్ణయం అయింది. ఈ దశలో వేసిన పిటిషన్ తీర్పును మరి కొంతకాలం వాయిదా వేయించడానికే అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

సి.బి.ఐ గతంలోనూ లాలూ ప్రసాద్ కు చేరువగా వచ్చి వెళ్లిపోయింది. కాంగ్రెస్ కు కేంద్రంలో సమస్యలు తెచ్చినపుడో, పార్లమెంటులో మద్దతు తగ్గిపోయి లాలూ మద్దతు అవసరం అయినపుడో, కాంగ్రెస్ పైన లాలూ అదే పనిగా విమర్శలు చేస్తున్నపుడో ఇలా సి.బి.ఐ, లాలూ వైపుకి దూసుకు రావడం అనంతరం లాలూ, కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించడం, దూసుకు వచ్చిన సి.బి.ఐ కాస్తా పక్కకు వెళ్లిపోవడం ఒక ప్రహసనంగా జరుగుతుంది.

ఈ నేపధ్యంలోనే సి.బి.ఐ కి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చేందుకు చట్టం తేవాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు చట్టం సిద్ధం చేశామని కేంద్ర సచివులు కపిల్ సిబాల్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. కానీ ఈ చట్టం మీద పెద్దగా ఆశలు పెట్టుకుంటున్నవారెవ్వరూ లేరు!

2 thoughts on “గానుగెద్దు సి.బి.ఐ -కార్టూన్

  1. ఇక్కడ ఉన్నది సి బి ఐ గానుగెద్దు దాని కల్లకి గంతలు కడితే స్కాములెలా కీనిపెదుతుంది? అది స్కాములు కనిపెట్టాలి, అలాగె స్కాముల సొంత దారులమీద రంకెలు వెయ్యాలి. లేక పోతే అది సి బి ఐ ఎద్దు కాదు. కాక పొతే రంకె వేసె టప్పుడు దాన్ని అదుపు చెయ్యడనికే గానుక్కు బందించ బడి ఉంటుంది.

వ్యాఖ్యానించండి