బబూన్ అంటే తెలుగులో కొండముచ్చు అని అర్ధం. గండు కోతి, తిమ్మడు అని కూడా అంటారని అంతర్జాలంలో ఆంగ్ల పదాలకు తెలుగు తదితర భారతీయ భాషలకు అర్ధాలు ఇచ్చే శబ్ద కొష్ ద్వారా తెలుస్తోంది. ఈ గండు కోతులు పెద్ద సంఖ్యలో గుంపులుగా కూడితే దాన్నే కాంగ్రెస్ అంటారట!
అమెరికా పార్లమెంటులో దిగువ సభ అయిన ప్రతినిధుల సభ (House of Representatives) ను కూడా కాంగ్రెస్ అంటారు. సభకు ఆ పేరు సరిగ్గా సరిపోయిందని ఈ ఇలస్ట్రేషన్ లో వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ కొందరు దీనిని అంగీకరించడం లేదు. వారి దృష్టిలో కొండముచ్చుల గుంపును కాంగ్రెస్ అని పిలిస్తే కొండముచ్చులకే అవమానం అట! తమను ఇలా పోల్చుతున్నారని కొండముచ్చులకు అర్ధం అయితే గనుక వాటికి ఖచ్చితంగా కోపం వస్తుందనీ, అలా అన్నవారిపైన దాడి కూడా చేయవచ్చని సూచిస్తున్నారు. ఆ విచిత్రం ఇక్కడ చూడండి. ఆ సంగతి బహుశా మనకంటే అమెరికన్లకు బాగా తెలిసి ఉండవచ్చు.
కానీ భారత దేశ ప్రజలకు తెలిసిన విషయాలు కూడా ఉన్నాయి మరి. వారు కూడా ‘కొండ ముచ్చులకు అవమానం’ అన్న వాదనతో ఏకీభవించవచ్చునేమో!
